జగన్ కోసం - 293 రోజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం - 293 రోజులు

జగన్ కోసం - 293 రోజులు

Written By ysrcongress on Friday, March 15, 2013 | 3/15/2013


వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారి అరెస్ట్ వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ఇది ముమ్మాటికి నిజం. ఓదార్పు యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి కొందరు వృద్ధ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అసలు వాస్తవాలు తెలియకుండా ఉన్నవి లేనివి కల్పించి, జగనన్నను పార్టీకి రాజీనామా చేసేటట్లు చేశారు. అయితే వాళ్లు తప్పకుండా ఒక వాస్తవం తెలుసుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగనన్న సీఎం కావడం తధ్యం.

ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారు. ఇది ముమ్మాటికీ నిజం. జగనన్నకు తప్పనిసరిగా బెయిలు వస్తుంది. జగనన్న ఏ తప్పూ చేయలేదు. ఆయన త్వరగా విడుదలవ్వాలని మేము ప్రతిరోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్సార్ చనిపోతే... ఆ తర్వాత ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ హింసిస్తోంది. ఈ అన్యాయాన్ని భరించలేకపోతున్న రాష్ర్టప్రజలు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

- సిహెచ్ మల్లయ్య, నందనం, వర్దన్నపేట, వరంగల్
Share this article :

0 comments: