రాముడి బలం బాణంలో...జగన్ బలం జనంలో... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాముడి బలం బాణంలో...జగన్ బలం జనంలో...

రాముడి బలం బాణంలో...జగన్ బలం జనంలో...

Written By news on Monday, March 4, 2013 | 3/04/2013


అమ్మా సోనియా! భస్మాసురుడు శివుడిని వరం అడిగాడు - ‘నేను ఎవరి తల మీద చేయి పెడితే వారు భస్మం అవ్వాలని’! ప్రజాదరణ లేని వారి మాటలు నమ్మి, ప్రజలు ప్రాణమిచ్చే జగన్‌ను పొమ్మనలేక పొగపెట్టి, కాంగ్రెస్ నుండి బయటకు పంపి మీ తలమీద మీరే భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. పగతో ఎవరూ ఏమీ సాధించలేరు. మంచితనంతో కొండను కూడా మనకు అండగా చేసుకోవచ్చు అని తెలుసుకోండి.

వైఎస్సార్‌గారు అనుక్షణం ప్రజాసంక్షేమం కోసం కృషి చేశారు. అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జగన్ - వైఎస్సార్ మరణం తట్టుకోలేని గుండెలు ఆగితే, మీరంతా నా కుటుంబం అని, మీ కుటుంబంలో నేనొకడినని, మీ బాధ నా బాధ అని ఓదార్చడానికి బయలుదేరారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేని గుంటనక్కలు, సోనియాకు లేనిపోని భయాలు పెట్టి ఓదార్పును అడ్డుకున్నారు. జగన్ ఢిల్లీ వెళ్లి సోనియాకి విన్నవించుకున్నా ఆమె పాషాణ హృదయం కరగలేదు. 

ఇచ్చిన మాటను నెరవేర్చుకునే జగన్, ధర్మరాజులోని ఓర్పును, వైఎస్సార్ చిరునవ్వును వెంటతీసుకుని ఓదార్పుకు బయలుదేరారు. కానీ జగన్‌ని ఎలాగైనా అడ్డుకోవాలని ఆయన కంపెనీల మీద రైడింగ్ చేయించారు. అయినా జగన్ బెదరలేదు. ఉప ఎన్నికల ముందు సీబీఐ చేత అర్ధరాత్రి అంధకారంలో జగన్‌ని అరెస్ట్ చేయించారు. అయినా ప్రజలు కాంగ్రెస్ దిమ్మతిరిగేలా తీర్పునిచ్చారు. ప్రస్తుతం జగన్‌ను బెయిల్ రాకుండా బంధించాం అనుకుంటున్నారు. జగన్ బెదిరే సింహం కాదు, గాండ్రించే సింహం. త్వరలో బయటికి వస్తుంది. రాముడి బలం బాణంలో ఉన్నట్లు... జగన్ బలం జనంలో ఉంది. 

- టి.కోటేశ్వరరావు, నాదెండ్ల మండలం, గుంటూరు

కాంగ్రెస్‌వారు, బాబుగారు కనులారా... వీక్షించబోతున్నారు!

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దివంగత నేత వైఎస్సార్‌పై గౌరవంతో, జగన్‌పై ఇష్టంతో, వారి కుటుంబంపై ఉన్న అభిమానంతో మన రాష్ట్రంలో లక్షలాదిగా ముందుకు వచ్చి గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇష్టపూర్వకంగా వచ్చిన ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. దానికి రెట్టింపుగా దాదాపు రెండు కోట్ల జనవాహిని ఎంతో ఉత్సాహంగా సంతకాలు చేసింది. జగన్‌పార్టీ నేతలు ఆయన తరఫున న్యాయాన్యాయాల విచారణ నిమిత్తం గౌరవనీయులైన రాష్ట్రపతికి ఆ సంతకాల ప్రతులకు సమర్పించారు. 

అయితే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, తొమ్మిదేళ్లు ప్రతిపక్షాన ఉన్న చంద్రబాబు ఈ సంతకాలు అబద్ధమని, బ్లాక్‌మెయిల్ చేయడానికే ఈ పనిచేశారని పేలడం అవివేకం. అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా చెప్పడం ఆయనకు పరిపాటి. రాజకీయ నాయకులలో అనిశ్చితి పెరిగి, తద్వారా ప్రభుత్వరంగ సంస్థల్లో వారి ప్రాబల్యం పెరిగినప్పుడు దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి సమాలోచన చేసి, రాజ్యాంగ బద్ధంగా ధర్మాన్ని పరిరక్షిస్తారు. ఇది ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే విధానమే. దానినే కదా ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అనుసరించింది. 

ఇందులో అబద్ధం ఏముందో చంద్రబాబు చెప్పాలి. బాబుగారు తన ఉపన్యాసంలో పాలకపక్షాన్ని దుమ్మెత్తిపోసి, గంపకెత్తినా కిరణ్ సర్కార్ కిమ్మనకుండా ఉండటం; చంద్రబాబుపై వచ్చిన నేరారోపణలు విచారణకు నోచుకోకపోవటం... ఈ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం. ఇది తెలిసే గత ఉపఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీలకు బుద్ధి చెప్పారు. రాబోయే 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ మొన్నటి సంతకాలకు రెట్టింపుగా ఉత్సాహంతో జనం ఓట్లు వేసి జగన్‌ని ముఖ్యమంత్రి చేస్తారు. ఆ దృశ్యాన్ని కాంగ్రెస్‌వారు, బాబుగారు కనులారా వీక్షిస్తారు. 

- కృష్ణకుమారి, రాజేంద్రనగర్, నెల్లూరు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com

Share this article :

0 comments: