త్వరలోనే మంచి రోజులొస్తాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలోనే మంచి రోజులొస్తాయి

త్వరలోనే మంచి రోజులొస్తాయి

Written By ysrcongress on Wednesday, March 13, 2013 | 3/13/2013


* వైఎస్సార్‌సీపీ తప్పక అధికారంలోకి వస్తుంది
* రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు తెస్తుంది
* {పజల అండతోనే పార్టీ విజయాలు పొందింది
* ఆదరాభిమానాలు అందించండి
* తగిన సమయంలో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి
* అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కష్టాలు మరెన్నో రోజులు ఉండవు. త్వరలోనే మనందరికీ మంచి రోజులొస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా జైల్లో పెట్టిన జగనన్న త్వరలోనే విడుదల అవుతారు. ముఖ్యమంత్రిగా వచ్చి ప్రజల బాధలను తీరుస్తారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు భరోసానిచ్చారు. యువజన, శ్రామిక, రైతుల కోసం ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల అండదండలతో రెండేళ్లలో అనేక విజయాలను కైవసం చేసుకుందని, జనం కోసం అనునిత్యం పోరాడుతున్న పార్టీకి ప్రజలంతా అండదండలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ 200 అసెంబ్లీ సీట్లు, 35 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధిస్తుందని ఉద్ఘాటించారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా షర్మిల మంగళవారం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో పాదయాత్ర కొనసాగించారు. చిరుమామిళ్ల, సొలస గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి పార్టీ జెండాలను ఎగురవేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. చిరుమామిళ్ల, సొలస గ్రామాల్లో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రసంగం సారాంశం ఆమె మాటల్లోనే..

మా కుటుంబమే కాదు.. రాష్ట్రం పెద్దదిక్కు కోల్పోయింది
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో మేం మాత్రమే తండ్రిని కోల్పోలేదు. రాష్ట్రమంతా తండ్రిని కోల్పోయిన బాధను అనుభవించింది. మహానేత మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలి 660 మంది రాజన్నతోనే వెళ్లిపోయారు. వారిని ఆదుకోవాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించలేదు. వారి కుటుంబాలను ఓదార్చాలన్న జగనన్న ఆలోచనే కాంగ్రెస్ నేతలకు చేదైంది. జగనన్న చేపట్టిన ఓదార్పు యాత్రకు వచ్చిన ఆదరణ చూసి తట్టుకోలేక పొగబెట్టి అన్నను పార్టీ నుంచి బయటకు పంపారు. అనేక మంది నేతలు అన్నతోనే అడుగులేస్తామని ముందుకొచ్చారు.

ఆ తర్వాత ప్రజల కోసం పుట్టిన వైఎస్సార్‌సీపీ ఈ రెండేళ్లలో అనేక విజయాలు పొందింది. ప్రజలు, కార్యకర్తలు అన్నకు అండగా నిలబడ్డారు. కానీ ఈలోపే కుట్రలు పన్ని జగనన్నను జైల్లో పెట్టారు. కుట్రలు ఎన్నోరోజులు సాగవు. త్వరలోనే అన్న బయటకు వస్తాడు. వైఎస్సార్‌సీపీకి బంగారు భవిష్యత్తు ఉంది. రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు తెస్తుంది. జగనన్న సీఎంగా పేద ప్రజల కోసం వైఎస్ అమలు చేసిన పథకాలన్నింటికీ పునర్‌వైభవం తెస్తారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుంది. చార్జీల భారం నుంచి విముక్తి కలుగుతుంది. వృద్ధులకు, వికలాంగులకు నెలనెలా పెన్షన్ వస్తుంది.

అధికారం కోసం బాబు... మాట కోసం అన్న ..!
చంద్రబాబు అధికార దాహంతో పిల్లనిచ్చిన మామనే వంచించాడు. సీఎం పీఠం కోసం ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. తొమ్మిదేళ్ల అధికారంలో ప్రజలను అష్టకష్టాలు పెట్టారు. వైఎస్ అకాల మరణంతో గుండె పగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఇచ్చిన మాట మేరకు ఓదార్పు యాత్ర చేసినందుకు జగనన్నను జైల్లో పెట్టారు. జైలుకు పోయేందుకైనా సిద్ధపడ్డారు కానీ మాట తప్పలేదు. అదీ చంద్రబాబుకు, జగనన్నకు ఉన్న తేడా.

వైఎస్ ఒక్క రూపాయి పెంచలేదు..
వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కొత్త పన్నులు విధించలేదు. విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పైసా కూడా పెంచలేదు. దీనికి తోడు అనేక ఉచిత పథకాలను అమలు చేశారు. రైతన్నలకు ఉచితంగా కరెంటిచ్చారు. పేదలకు ఉచితంగా చదువు చెప్పించారు. ఆరోగ్యశ్రీ పేరుతో నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేయించారు. 108 ప్రాణదాతను పక్కాగా అమలు చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్.. కరెంటు, ఆర్టీసీ, గ్యాస్ ధరలు పెంచారు. విద్యుత్ సర్‌చార్జీల పేరిట రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై మోపారు. దీనిపై నిలదీయాల్సిన ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షంతో అంటకాగుతోంది. ప్రజలు వద్దనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమని ఎన్ని సార్లు అడిగినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. బాబుకు, ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్‌కు తగిన సమయంలో బుద్ధి చెప్పండి.

యాత్ర సాగిందిలా...
‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 88వ రోజైన మంగళవారం షర్మిల 14.3 కిలోమీటర్లు నడిచారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం చిరుమామిళ్ల నుంచి ప్రారంభమైన యాత్ర సొలస, సొలస ఎస్సీ కాలనీ, చెంగిజ్‌ఖాన్‌పేట, సంతపేట, కోట మీదుగా సాగింది. మంగళవారం రాత్రి 8.30 గంటలకు కోట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. పాదయాత్రలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఆర్కే, మర్రి రాజశేఖర్, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నేతలు దేవళ్ల రేవతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గౌతంరెడ్డి, బండారు సాయిబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

జన్మనిచ్చింది మేమైనా.. ప్రాణం పోసింది మీరే.. 
తన బిడ్డకు వైఎస్ ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించారని గుర్తుచేసుకుంటూ నారాయణమ్మ అనే మహిళ షర్మిల వద్ద కన్నీళ్ల పర్యంతమైంది. నరసరావుపేటలోని రెడ్డిపాలెం నుంచి వచ్చిన ఆమె.. సొలస గ్రామంలో షర్మిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నా కొడుకు జితేంద్ర శివప్రసాద్‌కు గుండెలో మూడు రంధ్రాలున్నాయని డాక్టర్లు చెప్పారమ్మా. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైఎస్ ప్రభుత్వంలో నా బిడ్డకు హైదరాబాద్‌లో ఉచితంగా ఆపరేషన్ చేశారు. మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదమ్మా. నా కొడుకు బతికాడు. వాడిని కన్నది మేమైనా ప్రాణం పోసింది మీరేనమ్మా. వాడికి మళ్లీ రూ.4 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయాలంటున్నారు. జగనన్న వస్తేనే నా కొడుక్కి మళ్లీ వైద్యం అందుతుందమ్మా’’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను చూసి షర్మిల కళ్లు కూడా చెమ్మగిల్లాయి.
Share this article :

0 comments: