ఈ చీకటి బాబుదే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ చీకటి బాబుదే!

ఈ చీకటి బాబుదే!

Written By news on Thursday, March 28, 2013 | 3/28/2013

- ఇప్పుడు ఆ నింద వైఎస్‌పై వేయాలని చూస్తున్నారు 
- టీడీపీ బ్లాక్ పేపర్‌లో అన్నీ అర్ధ సత్యాలు, అవాస్తవాలు
- {పైవేటు సేవలో తరించిందెవరు? బాబా.. వైఎస్సా?
- బాబు అర్ధరాత్రి చేసుకున్న 23 ప్రైవేటు ఒప్పందాలను బ్లాక్ పేపర్‌లో ఎందుకు ప్రస్తావించలేదు?
- అత్యంత ఖరీదైన నాఫ్తాపై అడ్డగోలు ఒప్పందాలు చేసుకుని ప్రజలపై భారమేసింది చంద్రబాబే
- వాటిని గ్యాస్‌కు మార్పించి.. గ్యాస్ కేటాయింపులు లేక పోయినా ఉన్నట్లు లేఖలు తెప్పించిందీ ఆయనే చివరికి ఆ భారం రాష్ట్ర బడ్జెట్‌పై పడింది 

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభానికి కారణమైన ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని లక్ష్యంగా చేసుకుని బురదజల్లేందుకే టీడీపీ ‘బ్లాక్ పేపర్’ పేరుతో అర్ధ సత్యాలు, అవాస్తవాలతో కూడుకున్న ఒక నిష్ర్పయోజన పత్రాన్ని విడుదల చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. వాస్తవానికి విద్యుత్ రంగం భ్రష్టు పట్టింది చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలోనేనని, అయితే ఆ అంశాన్ని ఎక్కడా వారి బ్లాక్ పేపర్‌లో ప్రస్తావించలేదని విమర్శించింది. 

బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్‌పై టీడీపీ విడుదల చేసిన బ్లాక్ పేపర్‌కు తమ ప్రతిస్పందన పత్రాన్ని వెల్లడించారు. బాబు తొమ్మిదేళ్ల చీకటి పాలనలో కరెంటు చార్జీల పెంపు పేరిట వరుసగా ప్రజలను నిలువు దోపిడీకి గురి చేసిన వైనం నుంచి దృష్టి మళ్లించడానికే టీడీపీ విద్యుత్ రంగంపై ఈ బ్లాక్ పేపర్‌ను విడుదల చేసినట్లుగా ఉందని సోమయాజులు విమర్శించారు.

వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ఏనాడైనా కరెంటు చార్జీలు పెంచారా? వినియోగం పెరిగినా వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత సరఫరా చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా వైఎస్ హయాంలో విద్యుత్ రంగం అస్తవ్యస్తం అయినట్లుగా టీడీపీ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘రాజశేఖరరెడ్డి విద్యుత్ రంగం ప్రైవేటీకరణవైపు మొగ్గు చూపారట...! చంద్రబాబు నాయుడేమో ప్రభుత్వ రంగంలో విద్యుత్ ఉత్పాదన చేయాలనుకున్నారట... ఇంతకన్నా జోక్ మరొకటి ఉందా! ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదు’ అని ఆయన అన్నారు.

అర్ధరాత్రి ఒప్పందాలు మర్చిపోయారా చంద్రబాబూ..?
‘‘ఎన్టీ రామారావు మంత్రివర్గంలో చంద్రబాబు ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా ఉన్నపుడు 1995 ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి పది వేల మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంగల 23 విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాలను ఎడాపెడా కుదుర్చుకున్నారు. అవన్నీ ప్రైవేటు వ్యక్తులతోనే. వారిలో సగం మంది అసలు ఆదాయపు పన్ను చెల్లింపుదార్లే కాదు, వారికి ఫైనాన్షియల్ క్లోజర్స్ (బ్యాంకుల రుణ సౌకర్యం) కూడా లేదు. అయినా హడావుడిగా సంతకాలు చేసుకున్న ఘనత బాబుది. బహుశా ఈ అర్ధరాత్రి ఒప్పందాలను బాబు మర్చి పోయారేమో. వాటిని కూడా ఈ బ్లాక్ పేపర్లో పెట్టి ఉంటే బాగుండేది’’ అని సోమయాజులు అన్నారు. ఈ ఒప్పందాలపై ప్రతిపక్షం నుంచి తీవ్ర ప్రతిఘటన, విమర్శలు వచ్చాక రద్దు చేశారని ఆయన అన్నారు.

నాఫ్తా పేరుతో ప్రజలపై భారం వేసింది మీరే కదా!
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక షార్ట్ గెస్టేషన్(స్వల్ప కాల వ్యవధిలో పూర్తయ్యే) ప్రాజెక్టుల పేరుతో అత్యంత ఖరీదైన నాఫ్తా ఇంధనంతో అడ్డగోలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని ప్రజలపై భారం పడటానికి కారకులయ్యారని సోమయాజులు దుయ్యబట్టారు. నాఫ్తాతో ఉత్పాదన జరిగితే విద్యుత్ ఒక యూనిట్ ధర 15 రూపాయలవుతుందనే విషయం కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. 

ఇదేమీ వంద లేదా 150 మెగావాట్ల సామర్థ్యం కాదని, ఏకంగా 2,000 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని సోమయాజులు పేర్కొన్నారు. ఈ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై ఆనాడు గొడవ చేసింది ఎవరో కాదని, గాలి ముద్దుకృష్ణమనాయుడేనని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో వీటిలో జరిగిన అవకతవకలను తూర్పారబట్టారన్నారు. 

ఇవన్నీ బ్లాక్ పేపర్లో ప్రస్తావనకు తెచ్చి ఉంటే బాగుండేదన్నారు. ఆ తరువాత ఇదే ప్రాజెక్టులను గ్యాస్ ఆధారితంగా మార్చారని అన్నారు. అప్పట్లో కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం నుంచి గ్యాస్ కేటాయింపులు లేకపోయినా ఉన్నట్లు లేఖలు చంద్రబాబు తెప్పించి వాటిని గ్యాస్‌కు మార్చారన్నారు. తమ వద్ద గ్యాస్ లేకపోయినా ఒత్తిడి తెచ్చి లేఖలు తీసుకు వెళుతున్నారు కనుక భవిష్యత్‌లో సరఫరా చేయకపోతే తమకేమీ సంబంధం లేదన్నట్లుగా గెయిల్ ఒప్పందంలో పేర్కొన్నదని, ఆ భారం మొత్తం బడ్జెట్‌పై పడిందని ఆయన అన్నారు. ఈ వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంతకాలతో కూడిన పత్రాల్లో స్పష్టంగా ఉన్నాయని సోమయాజులు వివరించారు.

ప్రైవేటుపై చంద్రబాబు ప్రేమ..
ఏపీజీపీసీఎల్ అనే ప్రభుత్వ రంగ సంస్థ ఆరోజున చేపట్టిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులో ఒక మెగావాట్ వ్యవస్థాపక వ్యయం రూ.2.7 కోట్లయితే.. అదే జీవీకే, స్పెక్ట్రమ్ ప్రైవేటు కంపెనీలకు చంద్రబాబు రూ.5 కోట్లకు అనుమతించారని సోమయాజులు అన్నారు. ఇది ప్రైవేటు రంగంపై చంద్రబాబు చూపిన ప్రేమ కాదా అని ప్రశ్నించారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించడానికి రోశయ్య అధ్యక్షతన కమిటీ వేశారని, అయితే న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే అభిప్రాయం వెల్లడి కావడంతో ఏమీ చేయలేకపోయారని అన్నారు. 

ఎమ్మెల్యేలు గడికోట, కాపు మాట్లాడుతూ వైఎస్ హయాంలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించడం అంటే వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఐదేళ్లలో ఒక్కసారి కూడా చార్జీలు పెంచకపోవడమా అని ప్రశ్నించారు. ఎంత సేపూ వైఎస్‌ను అనవసరంగా విమర్శించడమే తప్ప ప్రస్తుత సర్కారు ైవె ఫల్యాలను టీడీపీ నేతలు ఎండగట్టక పోవడానికి కారణం కేసులనుంచి తప్పించుకోవడానికేనని అన్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వచ్చినపుడు మద్దతివ్వకుండా.. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తే ప్రయోజనం ఏమిటని, ఇది ఎవరిని మోసం చేయడానికని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం మైనారిటీలకు భారీగా బడ్జెట్ కేటాయించామని గొప్పలు చెప్పుకుంటోందని అయితే ఉర్దూ టీచర్ల పోస్టులను మాత్రం భర్తీ చేయడం లేదని వారు విమర్శించారు. మొత్తం 1,500 ఖాళీలుంటే అందులో 700 మాత్రమే భర్తీ చేశారన్నారు. మిగతా 800 పోస్టులు కూడా భర్తీ చే యాలని వారు డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: