టీడీపీవి శవరాజకీయాలు :ఆమోద ఇండస్ట్రీస్ ఎండీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీవి శవరాజకీయాలు :ఆమోద ఇండస్ట్రీస్ ఎండీ

టీడీపీవి శవరాజకీయాలు :ఆమోద ఇండస్ట్రీస్ ఎండీ

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

వీరభద్రారెడ్డి 20 ఏళ్లుగా మా సంస్థలో తన సామర్థ్యంతో అంచెలంచెలుగా ఎదిగారు 
అత్యంత నమ్మకస్తుడైన ఉద్యోగిని కోల్పోవటం మాకు ఎంతో బాధ కలిగించింది 
టీడీపీ ఎమ్మెల్యేకు మాతో ఉన్న వ్యాపార వైరం వల్ల దీనిని రాజకీయం చేస్తున్నారు 
ఏదో రకంగా బురదజల్లి వైఎస్ కుటుంబాన్ని దెబ్బతీయటమే చంద్రబాబు లక్ష్యం 
స్వార్థ రాజకీయాల కోసం వీరభద్రారెడ్డి ఆత్మహత్యను వాడుకోవటం సిగ్గుచేటు 
వీరభద్రారెడ్డి ఆత్మహత్యకు - బ్రదర్ అనిల్‌కు సంబంధం అంటూ దుష్ర్పచారం 
ఆమోద ఇండస్ట్రీస్, బెనిటా, రక్షణ స్టీల్స్‌తో అనిల్‌కు సంబంధం ఉందని నిరూపించాలి 
నిరూపిస్తే కంపెనీలను వారికి రాసిస్తా.. లేనిపోని ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తా 
టీడీపీ నేతల తీరుపై ఆమోద ఇండస్ట్రీస్ ఎండీ కొండలరావు ధ్వజం

సాక్షి, హైదరాబాద్: చెట్టంత కొడుకును పోగొట్టుకుని బాధపడుతున్న తల్లిదండ్రులను, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఇల్లాలిని, తండ్రి లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని చిన్నారులను పరామర్శించి ఆదుకోవాల్సిన ఆపన్న సమయంలో.. తెలుగుదేశం పార్టీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వీరభద్రారెడ్డి ఆత్మహత్యను వాడుకోవటాన్ని ఆమోద ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ కొండలరావు తప్పుపట్టారు. ఆయన ఈమేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాను వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి 20 సంవత్సరాలుగా తమతో ప్రయాణించిన వీరభధ్రారెడ్డి వ్యాపారంతో పాటు అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. ‘‘గుమస్తాగా చేరిన ఆయన.. తన సామర్థ్యంలో మేనేజర్ స్థాయికి ఎదిగారు. 20 సంవత్సరాల కిందట రూ. 1,500 జీతంలో మా వద్ద చేరి రూ. 50 వేలకు పైనే జీతం తీసుకునే స్థాయికి చేరారు. ఆయన కుటుంబంతో కూడా మాకు ఆత్మీయ అనుబంధం ఉంది’’ అని వివరించారు. తమకు అత్యంత నమ్మకస్తుడైన ఉద్యోగిని కోల్పోవటం మాకు బాధ కలిగించిందని కొండలరావు విచారం వ్యక్తం చేశారు. 

వీరభద్రారెడ్డి సెలవులో సొంత గ్రామమైన పోచంపల్లికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవటం తమను కలిచివేసిందన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న వీరభద్రారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవటానికి, ఆయన పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వటానికి ఏం చేయాలని తాము ఆలోచిస్తున్న సమయంలో.. టీడీపీ నాయకులు, కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు పనికట్టుకుని వీరభద్రారెడ్డి ఆత్మహత్యను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు తమతో ఉన్న వ్యాపార వైరం వల్ల వీరభద్రారెడ్డి ఆత్మహత్యను రాజకీయం చేయటం ద్వారా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని కొండలరావు ఆరోపించారు. ‘‘ఏదోరకంగా బురదజల్లో శవరాజకీయాలు చేసో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని దెబ్బతీయటమే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే వీరభద్రారెడ్డి ఆత్మహత్యను వాడుకుంటున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ర్పచారం, శవరాజకీయాల వల్ల తమకు ఎంతో నమ్మకస్తుడైన ఉద్యోగి వీరభద్రారెడ్డి కుటుంబంతో ఉన్న ఆత్మీయ అనుబంధం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న వీరభద్రారెడ్డి ఆఖరి కోరిక తీర్చటానికి కూడా తమకు అవకాశం లేకుండా చేయాలనే కుట్ర కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరిస్తూ.. చనిపోయిన వ్యక్తి ఆత్మ ఘోషించే విధంగా, ఆయన ఆఖరి మాటల (సూసైడ్ నోట్)కూ వక్రభాష్యాలు చెప్తూ.. వీరభద్రారెడ్డి ఆత్మహత్యకు, బ్రదర్ అనిల్‌కుమార్‌కూ సంబంధం ఉందంటూ టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు దుష్ర్పచారానికి దిగటాన్ని కొండలరావు ఖండించారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆమోద ఇండస్ట్రీస్, బెనిటా, రక్షణ స్టీల్స్.. తన కంపెనీల్లో బ్రదర్ అనిల్‌కుమార్‌కు సంబంధం ఉందని నిరూపిస్తే, ఆ కంపెనీలను ఆరోపణలు చేస్తున్న వారి పేరిట రాసిస్తామని ఆయన సవాల్ చేశారు. 2003లో అమోద ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశామని, 2007లో అనిల్‌కుమార్‌తో తనకు పరిచయమయిందని తెలిపారు.

నీతికి నిలబడతానన్నా వదలరా?

‘‘వీరభద్రారెడ్డికి స్వయానా చిన్నాన్న, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి.. ఈ ఆత్మహత్యకు రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు. శవరాజకీయాలు చేయవద్దని టీడీపీ నేతలకూ సూచించారు. కానీ టీడీపీ ప్రయోజనాల కోసం పార్టీ అధినేత ఆయనకు హుకుం జారీ చేశారు. నీతికి నిలబడతానని, శవరాజకీయాల జోలికి పోనని చెప్పినా రామకృష్ణారెడ్డిని వదలటం లేదు’’ అని కొండలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: