రాష్ట్రం యూనిట్‌గా సర్పంచ్‌ల రిజర్వేషన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రం యూనిట్‌గా సర్పంచ్‌ల రిజర్వేషన్

రాష్ట్రం యూనిట్‌గా సర్పంచ్‌ల రిజర్వేషన్

Written By news on Wednesday, March 20, 2013 | 3/20/2013

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల రిజర్వేషన్లు గతంలో మాదిరి జిల్లా యూనిట్‌గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయించనున్నారు. 1995 నుంచి 2006 వరకు నిర్వహించిన మూడు దఫాల స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కలెక్టర్లు సర్పంచ్‌ల సంఖ్యను నిర్ధారించి రిజర్వేషన్లు అమలు చేసేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా 73వ రాజ్యాంగ సవరణతోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించనున్నారు. ఏ జిల్లాకు ఏ వర్గానికి ఎన్ని పంచాయతీ స్థానాలు రిజర్వ్ అవుతాయన్న విషయాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ ప్రకటిస్తారు. ఒక్కో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, జనరల్ రిజర్వేషన్ల సంఖ్యను కమిషనర్ ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తారు. వాటి ఆధారంగా జిల్లాలో పంచాయతీలను రిజర్వ్ చేస్తారు. 

దీంతో పంచాయతీ రిజర్వేషన్లు పూర్తిగా మారిపోనున్నాయి. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.30 శాతం, ఎస్టీలకు 8.25 శాతం, మిగిలినవి జనరల్ కేటగిరిగా పరిగణిస్తారు. రిజర్వ్, జనరల్ కేటగిరీల్లో 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈసారి 21,670 పంచాయతీల్లో సగం మంది మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నిక కానున్నారు. ఈనెల 26న అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను ప్రచురించనున్నారు.
Share this article :

0 comments: