జనం కోసం జగన్ ఏమైనా చేయగలరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనం కోసం జగన్ ఏమైనా చేయగలరు

జనం కోసం జగన్ ఏమైనా చేయగలరు

Written By news on Monday, March 25, 2013 | 3/25/2013

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించి, బట్టకట్టించింది జననేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని అందరికీ తెలిసినదే. ఆయన హఠాన్మరణం వల్ల ప్రజాభీష్టం మేరకు ఆ స్థానాన్ని భర్తీ చేస్తానని మాట ఇచ్చిన యువనేత జగన్. అయితే అందుకు అధిష్టానం అనుమతించలేదు. దాంతో కాంగ్రెస్‌పార్టీ నుండి బయటపడి, వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో పార్టీ స్థాపించి ‘ఓదార్పుయాత్ర’కు బయలుదేరారు జగన్. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ అధిష్టానం, ప్రతిపక్షమైన తెలుగుదేశం కుమ్మక్కై అవినీతి ఆరోపణలతో జగన్‌ను జైలుపాలు చేశారు. ఇప్పటికీ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. 

జగన్‌ను వేధించినకొద్దీ ప్రజల్లో ఆయనకు సానుభూతి పెరుగుతోందని గమనించిన కాంగ్రెస్... ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రజలను మభ్యపెట్టో, పనికిమాలిన వాగ్దానాలు చేసో లేక వక్రమార్గంలోనో ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే కాంగ్రెస్‌కు మళ్లీ ఓట్లేసి మోసపోవడానికి ప్రజలేం పిచ్చివాళ్లు కారు. ఇక బాబుగారు. జగన్‌పై ఉండే ప్రజాభిమానం చూసిన టీడీపీ నాయకుడి గుండె పగిలినంత పనై, ‘వస్తున్నా మీకోసం’ అంటూ యాత్ర మొదలుపెట్టి ఊరూవాడా తిరుగుతున్నారు. వై.ఎస్. కుటుంబాన్ని తిడుతున్నారు. శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. 

జగన్ సీఎం అయితే ప్రజల కోసం ఏమైనా చేయగలరన్న నమ్మకం అందరికీ ఉంది. చంద్రబాబుగారిపై అలాంటి నమ్మకం లేదు. ఎందుకంటే... బాబుగారు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లూ తాము పడిన ఇక్కట్లను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. తను ప్రసంగించిన సభల్లో జనం కేరింతలు, చప్పట్లు కొడుతుంటే, చంద్రబాబు పొంగిపోయి సంబరపడుతున్నారు గానీ జనాలు ‘గేలి’చేస్తున్నారన్న సంగతి ఆయన తెలుసుకోవడం లేదు. చేతకాని కాంగ్రెస్ అని దుమ్మెత్తిపోస్తారు. అయినా అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేయరు! దీనినిబట్టి తెలియడంలేదా, ఎవరు చేతకాని వారో! కనుక ఆయన జగన్‌కు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ అయినా జగన్‌ను జైలు నుండి విడిపిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లతోనైనా ప్రతిపక్షంలో ఉండొచ్చు. 

- హనుమంతు నందికేశ్వరరావు, బోరుమజ్జిపాలెం

కుమ్మక్కయ్యారు కుయుక్తులు పన్నుతున్నారు!

దివంగతనేత, రైతుబాంధవుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లారు. ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రజాసంక్షేమం గురించే ఆలోచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడ్డారు. ఆ పథకాలన్నింటినీ ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యి ప్రజలను ఆదుకోవడం మానేసి, వై.ఎస్.కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలనూ నానావిధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జగన్‌ను ఏకాకిని చేసి జైలుకి పంపించడమే కాకుండా ఆయన బయటకు రాకుండా కుట్రలు పన్నుతున్నారు. జరిగేదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. యావత్ భారతదేశంలో ఓదార్పుయాత్ర చేపట్టిన వ్యక్తి ఒక్క జగన్‌గారే. ప్రజల ఆశీర్వాదాలు ఆయనకు మెండుగా ఉన్నాయి. ఆయన త్వరగా బయటకు రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 

- డి.రాజు, కట్టా అప్పలనాయుడు, కొత్తూరు, తూ.గో.
Share this article :

0 comments: