కోటిమందికి వైఎస్సార్ సీపీ సభ్యత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోటిమందికి వైఎస్సార్ సీపీ సభ్యత్వం

కోటిమందికి వైఎస్సార్ సీపీ సభ్యత్వం

Written By news on Friday, March 29, 2013 | 3/29/2013

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సంస్థాగత బలోపేతానికి పటిష్టమైన కృషి జరుగుతోందని ఆ పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ కన్వీనర్ డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.గుంటూరు జిల్లా బాపట్లలోని తన నివాసంలో గురువారం ఆయనవిలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా కోటిమందికి సభ్యత్వం ఇవ్వాలని లక్ష్యంగా పనిచేస్తున్నామనీ, ఇందులో 40 లక్షలమంది క్రియాశీలక సభ్యులు, 60 లక్షల మంది సాధారణ సభ్యులుగా ఉంచాలనేది నిర్ణయమన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఐదుగురి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది క్రియాశీలకసభ్యులకు ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వారికి వివిధరంగాలలో నిపుణులైన వారితో శిక్షణ ఇప్పించి, వారిద్వారా మిగిలిన సభ్యులకు జిల్లా, మండల, గ్రామ స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో రాజకీయ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Share this article :

0 comments: