సానబట్టిన వజ్రంలా తయారవుతున్నారు జగనన్న! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సానబట్టిన వజ్రంలా తయారవుతున్నారు జగనన్న!

సానబట్టిన వజ్రంలా తయారవుతున్నారు జగనన్న!

Written By news on Friday, March 1, 2013 | 3/01/2013


రాజశేఖర్‌రెడ్డిగారు రాష్ట్ర పరిపాలన చేసినంత కాలం దేశ కాలమాన పరిస్థితులు అంతా సవ్యంగా ఉండి ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. ఆ మహారాజు దూరమైననాటి నుంచి పరిస్థితులు అపసవ్యంగా మారి ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నారు. ప్రజల ఆత్మీయానుబంధంతో ఆ తండ్రిబాటలో అందరి కష్టసుఖాలను తెలుసుకుంటూ అడుగులు వేస్తున్న జగనన్నను కుటిల రాజకీయాలు జైలుగోడల మధ్య బంధించాయి.

ప్రజలందరి శ్రేయస్సుకై కృషి చేస్తున్న జగనన్న కుటుంబంపై నిష్కారణంగా నిందలు వేస్తూ వారిని బాధించడం ఎంతవరకు సమంజసం? కుట్రలు, కుతంత్రాలు మిళితం చేసి, వాటికి శకుని రాజకీయాలు జోడించి ఎంతగా జగనన్న కుటుంబాన్ని సాధిస్తున్నారో ప్రజలందరికీ అర్థమౌతూనే ఉంది. తండ్రి బాటకు, అన్న ప్రేమకు కట్టుబడి ఎండ కన్నెరగని షర్మిలమ్మ పాదయాత్ర ప్రారంభించి అనారోగ్యం పాలైంది. భర్తతో మనసులో మాట చెప్పుకోవడానికి లేక, బిడ్డలకు సర్ది చెప్పలేక భారతమ్మ బాధ పడుతోంది. భర్తను దూరం చేసుకుని, బిడ్డలు పడుతున్న అవస్థలు చూసి విజయమ్మగారు ఆక్రోశిస్తున్నారు. ఎప్పటికి తీరుతాయి ఈ కుటుంబానికి కష్టాలు? ‘వందమంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు.

ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు’ అంటారు కదా... రేపు జగనన్న నిర్దోషి అని వెల్లడైనప్పుడు... ఆయన్ని ఇన్నాళ్లూ ప్రజల మధ్య లేకుండా చేసిన ఈ ప్రభుత్వం... అమూల్యమైన ఆ సమయాన్ని తిరిగి తెచ్చిస్తుందా? అలా ఇవ్వలేనప్పుడు ఈ ప్రభుత్వానికి ఎలాంటి శిక్ష వేయాలో ఈ నాయ్యస్థానాలు చెప్పగలవా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో, చెరగని చిరునవ్వుతో, కష్టాలను ఎదుర్కొంటూ సానబెట్టిన వజ్రంలా తయారవుతున్నారు జగనన్న. ఆయన ఓర్పుకు, సహనానికి త్వరలోనే తియ్యని ప్రజాతీర్పు వెలువడుతుంది. అప్పుడు జగనన్నే మన రాష్ట్రానికి అధినేత.

- సర్రాజు హిమబిందు, సింధు, కావలి, నెల్లూరు జిల్లా
Share this article :

0 comments: