బ్లాక్ పేపర్‌లో చీకటి కోణాలేవీ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్లాక్ పేపర్‌లో చీకటి కోణాలేవీ!

బ్లాక్ పేపర్‌లో చీకటి కోణాలేవీ!

Written By news on Thursday, March 28, 2013 | 3/28/2013



తొమ్మిదేళ్ల పాటు సాగిన చం ద్రబాబు చీకటి పాలనలో కరెంటు చార్జీల పెంపు పేరిట ప్రజలు వరసగా నిలువుదోపి డీకి గురైన వైనం నుంచి దృష్టి మళ్లించడానికే టీడీపీ విద్యుత్ రంగంపై బ్లాక్ పేపర్ విడుదల చేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ పార్టీ ఇలా ఒక బ్లాక్ పేపర్‌ను అదీ విద్యుత్ రంగంపై విడుదల చేయడం విడ్డూరం. విద్యుత్ రంగానికి సంబంధించి తన హయాంలో అనుస రించిన,అవలంబించిన అపసవ్య అస్తవ్యస్త విధానాలను ప్రజలు మరిచిపోయారని చంద్రబాబునాయుడుగారు భ్రమపడుతున్నట్లుంది.

తన ప్రత్యక్ష మద్దతుతో మనుగడ సాగిస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాకుండా దివంగత మహానేత డా. వైఎస్. రాజశేఖరరెడ్డిని టార్గెట్ చేయడానికే టీడీపీ ఈ బ్లాక్ పేపర్‌ను విడుదల చేసిందన్నది సుస్పష్టం. డా. వైఎస్ గారి హయాంలో విద్యుత్ ప్రాజెక్టుల వ్యయాల పెంపునకు సం బంధించి అనిర్దిష్ట, అస్పష్ట ఆరోపణలు చేయడం కాకుం డా ఏయే ప్రాజెక్టుల వ్యయాలు పెరిగాయో బ్లాక్ పేపర్ విస్పష్టంగా ప్రకటించి ఉంటే బాగుండేది.

ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ముఖ్యకారణాల్లో ఒక టైన పదేళ్ల టీడీపీ పరిపాలనలోని విపరీతమైన అవినీతి, అసమర్థతల గురించి కూడా చర్చించి ఉంటే బ్లాక్ పేపర్‌కు కొంతైనా విశ్వసనీయత వచ్చి ఉండేది.

విద్యుత్ సంక్షోభానికి సంబంధించి రాష్ట్ర ప్రజల మన సుల్ని తొలుస్తున్న అంశాలు మూడు.
అ. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో విద్యుత్‌కు కొరత ఎందుకు ఏర్పడింది?
ఆ. మన రాష్ట్ర రాబడులు మునుపెన్నడూ లేనంతగా గత నాలుగేళ్లలో గణనీయంగా పెరిగినప్పటికీ భారీగా కరెంటు చార్జీలు ఎందుకు పెంచు తున్నట్లు?
ఇ. వైఎస్‌ఆర్ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో వ్యవ సాయానికి 7 గంటలపాటు ఉచిత విద్యుత్ అం దిస్తూ కూడా ఏ వర్గానికీ కరెంటు చార్జీలు పెం చకుండా ఎలా విద్యుత్తు రంగాన్ని నిర్వహించ గలిగింది?

బ్లాక్ పేపర్ భావిస్తున్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో నెల కొన్న విద్యుత్ సంక్షోభానికి కారణం విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు లేకపోవడం కాదు. ఈ విషయం చంద్రబాబుకు ఇంకా అవగతమైనట్లు కనిపించడం లేదు. ఇవాళ మనకు విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యానికి కొరత లేదు. కానీ కావలసినంత బొగ్గు, గ్యాస్‌లేకపోవడమే అసలు సమస్య. మనకు మరో 5 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ దానికి కావలసిన ఇంధనం లేకపోతే ప్రయోజనం ఏమిటి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే నేటి విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణం.

గత నాలుగేళ్లుగా ఆదాయంలో కానీ అప్పుల్లో కానీ భారీ పెరుగుదలతో ఆర్థిక వనరులు అందుబాటులో ఉండగా ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తూ వరుసగా కరెంటు చార్జీలను పెంచడాన్ని చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ పేపర్‌లో ఎందుకు నిలదీయడంలేదు?

2008-09లో రూ.62,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 2011-12లో రూ.1.09 లక్షల కోట్లకు, 2013-14లో రూ.1.27 లక్షల కోట్లకు చేరుకున్న విష యం చంద్రబాబుగారికి తెలియదా?

కేవలం గత నాలుగేళ్లలో సుమారు రూ.50,000 కోట్ల మేర రాష్ట్ర వార్షికాదాయం పెరగ గా, తరచుగా కరెం టు చార్జీలను ఎందుకు పెంచుతున్నారని చంద్రబాబు నాయుడుగారు ప్రభుత్వాన్ని తాను బ్లాక్ పేపర్ అంటున్న దానిలో ఎందుకు నిలదీయలేదు?

2008-09లో రూ.93 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర రాష్ట్ర రుణాలు 2012-13 నాటికి రూ.1.55 లక్షల కోట్లకు చేరి కేవలం నాలుగేళ్లలోనే రూ.62,000 కోట్లకు పెరి గిన వాస్తవం చంద్రబాబుగారికి తెలియదా? 2013- 14లో రాష్ట్ర ప్రభుత్వం రూ.25,000 కోట్ల మేర అద నంగా అప్పులు తేవడం లేదా?

బడ్జెట్, బడ్జెటేతర మార్గాల ద్వారా సమకూరుతున్న డబ్బునంతా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లని చంద్ర బాబుగారు తన బ్లాక్ పేపర్‌లో ఎందుకు నిలదీ యలేదు?

ఇన్ని లక్షల కోట్లు అదనంగా ఆర్థిక వనరులు సమకూ ర్చుకున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దెబ్బ తీసింది. బీదల్లో వృద్ధులకు, వితంతువులకు, వికలాం గులకు ఇచ్చే ఫింఛన్‌లో ఒక్క రూపాయి కూడా పెం చలేదు. వచ్చిన డబ్బంతా మరి ఎక్కడ ఖర్చు పెట్టా రని చంద్రబాబునాయుడు గారు ఎందుకు ప్రశ్నిం చడం లేదు?

రాష్ట్ర వనరులు గణనీయంగా పెరిగినప్పటికీ తరచుగా ప్రభుత్వం భారీగా కరెంట్‌చార్జీలను ఎందుకు పెంచు తోందని చంద్రబాబుగారు బ్లాక్ పేపర్‌లో ఎందుకు ప్రశ్నించలేదు?

కాగ్, మీడియా, విపక్షం, కోర్టుల విమర్శలకు జడిసి కేంద్ర ప్రభుత్వం అన్ని కీలమైన అంశాలపై నిర్ణయం తీసుకోవడం మానేసింది. అటవీ అనుమతులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంవల్ల గత మూడే ళ్లుగా బొగ్గు ఉత ్పత్తి దాదాపు నిలిచిపోయింది. దీని వల్ల అనేక బొగ్గు ఆధారిత ప్రాజెక్టులు సమస్యను ఎదు ర్కొంటున్నాయి.

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ధర స్వదేశీ బొగ్గుతో పోల్చితే రెట్టింపు. 2012లో మన బొగ్గు దిగు మతులు 80 మిలియన్ టన్నులు. రాగల సంవత్స రాల్లో ఇది 185 మిలియన్ టన్నులకు చేరగలదని కేంద్ర ఆర్థికమంత్రి చెబుతున్నారు. ఒకవేళ అంత భారీగా బొగ్గును ఎక్కువ ఖరీదు పెట్టి దిగుమతి చేసు కుంటే విద్యుదుత్పత్తి వ్యయం ఎంతకు చేరుతుంది.?

నానాటికీ గ్యాస్ ఉత్పత్తి తగ్గుతూపోతున్నది. రిల యన్స్ ఇండస్ట్రీస్ మినహా 2002లో కేజీ బేసిన్ కాం ట్రాక్టులు పొందిన తక్కిన మూడు కంపెనీలు ఇంత వరకూ ఒక్క క్యూబిక్ మీటర్ గ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేయలేదు. అయినప్పటికీ వాటి మీద చర్యలు లేవు. తాజా గ్యాస్ బ్లాకుల అన్వేషణ కేటయింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివల్ల దేశం దేశీయ ఉత్ప త్తితో పోల్చితే మూడు రెట్లు అధిక వ్యయంతో కూడిన దిగుమతులపై ఆధారపడవలసివస్తోంది.

బొగ్గు, గ్యాస్ లేకపోతే దేశంలో విద్యుదుత్పత్తి మెరుగు పడేదెలా? విద్యుత్తు లేనిదే వృద్ధిని ఆశించగలమా? వృద్ధి లేకుండా సామాజిక న్యాయం ఎక్కడిది?

దివంగత మహానేత వైఎస్‌ఆర్ హయాంలోలాగా మన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యాస్ సరఫరా సాధించలేకపోతోంది?
1994-2004 మధ్య విద్యుత్ రంగంపై టీడీపీ ప్రభు త్వం పనితీరుకు సంబంధించిన అనేక వాస్తవాలను బ్లాక్ పేపర్ మరుగుపరిచింది. ఆ పదేళ్లకాలంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని భ్రష్టుపట్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఒకప్పుడు విద్యుత్తు బోర్డు పరిస్థితి ఎలా ఉంది? చం ద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఆ తర్వాత నేడు పరిస్థితి ఏమిటి? 1989 నుంచి 1994 వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ఏపీఎస్‌ఈబీ నిర్వహణ లాభాలతో కొనసాగిన మాట వాస్తవం కాదా?

ఆ తర్వాత చంద్రబాబునాయుడు గారు ముఖ్యమం త్రిగా ఉన్న 1994 నుంచి 2004 వరకు అంటే టీడీపీ హయాంలో... ప్రతి ఏడాది ఏపీఎస్‌ఈబీ నష్టాలతో సతమతమై, అంతా కలిపి మొత్తం రూ.20 వేల కోట్ల మేర భారీనష్టాలు పేరుకుపోయినమాట నిజంకాదా?

టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు. దాని పర్యవసానం మొత్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 1994 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం రెవెన్యూ మిగులు కాస్తా చంద్రబాబునాయుడుగారు విద్యుత్ సంస్థతో ఆడిన చెలగాటం ఫలితంగా తలకిందులై ఏకంగా రూ.22 వేల కోట్లు లోటు పేరుకుపోయిన సంగతి వాస్తవం కాదా?

టీడీపీ నిర్వాకం కారణంగా 1994 మార్చి 31 నాటికి 101:100గా ఉండిన ఆస్తులు-అప్పుల నిష్పత్తి కాస్తా 1994-2004 మధ్యకాలంలో 45:100కు పడిపోవడం వాస్తవం కాదా?

2004-09 మధ్య కాలంలో అంటే మహానేత వైఎస్ హయాంలో 31-3-2009 నాటికి ఈ నిష్పత్తి 120:100కు పెరిగిన మాట నిజం కాదా?
లాభాల్లో ఉన్న సంస్థను ఏటా నష్టాలే మిగిలేలా ఊబి లోకి తోసేసి, ఆ సంస్థను సంస్కరించానని చెప్పుకుం టున్నారంటే, ఇదేనా చంద్రబాబుగారు ఎమ్మే ఎకనా మిక్స్ చదవడం ద్వారా నేర్చుకున్న చదువు అనే అను మానం కలుగుతోంది.

{పతి ఏడాదీ అన్ని వర్గాలకు సంబంధించిన వినియో గదారుల కరెంటు చార్జీలను ఠంఛనుగా పెంచుతా మని ప్రపంచబ్యాంకుతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నమాట వాస్తవం కాదా?

వైఎస్ పాలనలో 2003-04లో రూ.800 కోట్ల యూని ట్లుగా ఉన్న వ్యవసాయ విద్యుత్ వినియోగం, 2008- 09 నాటికి 1500 కోట్ల యూనిట్లకు చేరినప్పటికీ ఎన్నడూ ఏ వర్గానికీ కరెంటు చార్జీలు పెంచని మాట వాస్తవం కాదా?

2004తో పోల్చితే 2009లో పారిశ్రామిక విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు 75 పైసలు తక్కువగా ఉన్న మాట వాస్తవం కాదా?

విద్యుత్ చార్జీలను మాత్రమే కాదు వ్యాట్ రేటు, ఆర్టీసీ చార్జీలు, నీటి బిళ్లులు, మునిసిపల్ టాక్సులు ఏవీ కూడా 2004-09 మధ్య కాలంలో ఒక్కసారి కూడా పెంచని మాట వాస్తవం కాదా?

టీడీపీ హయాంలో 5.7 శాతంగా ఉన్న రాష్ట్ర వార్షిక ఆర్థిక వృద్ధిరేటు... ఆ తరువాత వైఎస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచకపోవడం, నాణ్యమైన కరెంటు సరఫరా చేయడం, రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ వంటి కారణాల వల్ల 2004-09 మధ్య కాలంలో 9.07 శాతానికి పెరిగిన మాట నిజం కాదా?

టీడీపీ హయాంలో కేవలం 8 శాతంగా ఉన్న వస్తూత్ప త్తిరంగం వార్షికవృద్ధి రేటు వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలవల్ల 2004-09 మధ్యకాలంలో 13 శాతంగా నమోదై రికారు వృద్ధి సాధించిన మాట వాస్త వం కాదా?

వ్యవసాయరంగం వార్షిక వృద్ధిరేటు చంద్రబాబు గారి హయాంలో కేవలం 3.25 శాతం కాగా ,వైఎస్ హయాంలో అది 6.87 శాతం కావడం నిజం కాదా?

టీడీపీ ఇచ్చిన బ్లాక్ పేపర్‌లో 2004 తరవాత ప్రైవేటు విద్యుదుత్పత్తిదారుల నుంచి ఎక్కువగా విద్యుత్ కొనుగోలు చేశారని తప్పుపట్టారు. ఎంత హాస్యా స్పదమైన ఆరోపణ? చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో ఆర్థిక సంస్కరణలకు తానే ఆదిపురుషు డినని, ప్రైవేటీకరణకు తానే రియల్
చాంపియన్‌నని చెప్పుకున్న మాట వాస్తవం కాదా?

1995 ఫిబ్రవరి 17-18 నాడు కనీసం ఆదాయం పన్ను చెల్లింపుదారులు కాకపోయినా, 10 వేల మెగా వాట్ల అదనపు విద్యుదుత్పత్తి సామర్థ్యానికి సంబం ధించి వివిధ ప్రైవేటుసంస్థల వారితో హడావుడిగా అర్థరాత్రి 23 ఎంఓయూలు కుదుర్చుకున్నది ఎవరి ప్రభుత్వం? ఈ చీకటి ఒప్పందాలే రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్ చేయలేదా?

విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ ఈఏఎస్ శర్మ సలహాను ఖాతరు చేయకుండా అర్థరాత్రి సంతకాల వ్యవహారంతో యావద్దేశం నివ్వెరబోయిన మాట వాస్తవం కాదా? ఇలా అవమానించడంవల్ల డాక్టర్ శర్మ ఢిల్లీ సర్వీసులకు వెళ్లి కేంద్ర విద్యుత్‌శాఖ కార్య దర్శిగా నియమితులయ్యారు.

మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించిన ముద్దనూరు విస్తరణ ప్రాజెక్టును రద్దుచేసి, 23 అర్థరాత్రి ఎంఓయూలలో భాగంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించింది టీడీపీ కాదా?

టీడీపీ బ్లాక్ పేపర్ దీనిని ఎందుకు ప్రస్తావించలేదు?

31-3-1997 నాడు టీడీపీ ప్రభుత్వం 6 నాఫ్తా ఆధా రిత స్వల్పవ్యవధి పవర్ ప్రాజెక్టుల కోసం యూనిట్‌కు 97 పైసలు మొదలుకుని 135 పైసల వరకు ఫిక్స్‌డ్ పవర్ టారిఫ్‌లతో పీపీఏలు కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా?

నాడు ముద్దుకృష్ణమనాయుడుగారు, ఇతర పార్టీల వారితో కలిసి దీనిపై రాద్ధాంతం చేయలేదా?అది పెద్ద కుంభకోణం కాలేదా?

టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి యూనిట్‌కు 97 పైసల చొప్పున అన్ని ప్రాజెక్టులకు సమానంగా ఫిక్స్‌డ్ టారిఫ్‌ను అమలు చేసేలా ఒత్తిడి తెచ్చిన ఘనత వైస్‌ది కాదా?

గత పనితీరు, ఆర్థిక సామర్థ్యం, ఆనుభవం ఆధా రంగా ఐసీఐసీఐ షార్ట్ గెస్టేషన్ పవర్ ప్రాజెక్టుల బిడ్లను అంచనా కట్టగా దాని ఆధారంగా టీడీపీ ప్రభు త్వం కేబినెట్ ఆమోదంతో ప్రాజెక్టులను వారికి కట్టబెట్టింది.
కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం పూర్తిగావేరు. ప్రమోటర్లు మారిపోయారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రదే శాలు మారిపోయాయి. ఇదంతా కేబినెట్ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఆకస్మికంగా ఎక్కడి నుంచో ఊడిపడిన టీడీపీ సభ్యుడు ఎంవీవిఎస్ మూర్తి కి ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ఒక స్వల్పకాలిక విద్యుత్‌ప్రాజెక్టును కట్టబెట్టారు. 

సుమారు 200 మెగావాట్ల నాఫ్తా ఆధారిత పవర్ ప్రా జెక్టులను ఆమోదించడం ఆత్మహత్యాసదృశం కాదా?

విపక్షాలన్నీ ఒత్తిడి చేయగా టీడీపీ ప్రభుత్వం ఆ తరు వాత విద్యుత్ ప్రాజెక్టుల ఇంధనం వాడకంలో మార్పు చేసిన మాట వాస్తవం కాదా?

కేజీ బేసిన్‌లో గ్యాస్ అందుబాటులో లేనందున విద్యు త్ ప్రాజెక్టుల ఇంధనాన్ని నాఫ్తా నుంచి బొగ్గును మార్చాలని అప్పట్లో విపక్షాలు స్పష్టంగా చెప్పడం వాస్తవం కాదా?

విపక్షాలే కాకుండా గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు వద్దం టూ విద్యుత్ రంగ నిపుణులు కూడా నాడు టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్యాస్ సరఫరా చేయ లేని పక్షంలో ఎలాంటి పెనాల్టీ చెల్లించడానికి గెయిల్ ముందుకురాకపోయినప్పటికీ ఎందుకు టీడీపీ ప్రభు త్వం విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు గ్యాస్‌ను ఎంచు కున్నట్టు?

గ్యాస్ సరఫరా చేయకపోయినా ప్రభుత్వం పరిహారం కోరలేక నిస్పహాయంగా ఉండిపోవడానికి ఈ తప్పు డు నిర్ణయం కారణం కాదా? ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఇదే అతిపెద్ద ఏకైక కారణం కాదా?

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన ఎంవీవీఎస్ మూర్తికి బలిమెల హైడ్రోప్రాజెక్టును కట్టబెట్టడం వాస్తవం కాదా?

1997లో ఏపీజీపీసీఎల్ గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజె క్టును కేవలం మెగావాట్‌కు రూ.2.7 కోట్లకు అమలు చేస్తుండగా జీవీకే, స్పెక్ట్రమ్ వంటి ప్రైవేటు ప్రాజెక్టు లను మెగావాట్‌కు రూ.5 కోట్లకు అనుమతించింది చంద్రబాబాబు కాదా?

అప్పుడంతా ప్రైవేటీకరణతో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన టీడీపీ ఇప్పుడు ప్రైవేటీకరణ ప్రస్తావన తెచ్చి వైఎస్‌ను ఆడిపోసుకోవడం విడ్డూరంకాక మరేమిటి?

ఏ విధంగా చూసినా టీడీపీ విడుదల చేసిన బ్లాక్ పేపర్ అర్ధసత్యాలతోనూ, అవాస్తవాలతోనూ కూడు కున్న నిష్ర్పయోజక పత్రం మాత్రమే.
Share this article :

0 comments: