జగన్ విడుదలయ్యాక ఏప్రిల్‌లో తిరుపతిలో భారీ సభ ఏర్పాటు చేస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ విడుదలయ్యాక ఏప్రిల్‌లో తిరుపతిలో భారీ సభ ఏర్పాటు చేస్తా

జగన్ విడుదలయ్యాక ఏప్రిల్‌లో తిరుపతిలో భారీ సభ ఏర్పాటు చేస్తా

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

- మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- 10 నెలలుగా అన్యాయంగా జైలులో బంధించారు
- రాష్ట్రానికి సుభిక్షమైన పాలన జగన్‌తోనే సాధ్యం

జగన్ విడుదలయ్యాక ఏప్రిల్‌లో తిరుపతిలో భారీ సభ ఏర్పాటు చేస్తా.. ఆయన సమక్షంలోనే పార్టీలో చేరతా
 మాట మీద నిలబడే వ్యక్తి అయిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని పది నెలలుగా అన్యాయంగా జైలు గోడల మధ్య బంధించడం జీర్ణించుకోలేని పరిణామమని మాజీ మంత్రి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. 

తన 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని అన్నారు. తన కుమారుడు మిథున్‌రెడ్డితో కలిసి ఆయన బుధవారం చంచల్‌గూడ జైలులో జగన్‌ను ములాఖత్‌లో కలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని, వీటిని సహించలేకుండా ఉన్నామని చెప్పారు. క్విడ్ ప్రోకో పేరుతో జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని తెలిపారు. ఓదార్పు యాత్ర చేపట్టినందుకే జగన్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. జగన్ తొందరగా బయటకు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి సుభిక్షమైన పాలన ఆయన వల్లనే సాధ్యమవుతుందని భావిస్తున్నానని అన్నారు. జగన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకునే ఆయన్ని కలిశానని తెలిపారు. జగన్ బెయిల్‌పై విడుదలయ్యాక ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయన సమక్షంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని వెల్లడించారు. 

వాస్తవానికి తానీ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సిందని, జగన్ బయటకు వస్తారని ఇంతకాలం వేచి ఉన్నానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేలా శాయశక్తులా పార్టీకి సేవలందిస్తానని చెప్పారు. తాను రెండు నెలల ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ, దాంతో సంబంధం లేకుండా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వంపై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని జగన్ సూచించారని తెలిపారు. జగన్ సూచన ప్రకారమే చేస్తానన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయని చెప్పారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలు, ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఆ పార్టీలు కలిసి పనిచేశాయని తెలిపారు.

‘జై జగన్..’ నినాదాలతో మార్మోగిన చంచల్‌గూడ: జగన్‌ను కలిసి పెద్దిరెడ్డి బయటకు రాగానే ‘జై జగన్’ అంటూ చిత్తూరు నుంచి వచ్చిన పెద్దిరెడ్డి అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డప్ప, గాయత్రీ దేవి, పలు సహకార సంఘాల అధ్యక్షులు పెద్దిరెడ్డితోపాటు వచ్చారు.


 కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కైనందున, అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజల సమస్యలపై పోరాడాలని తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి తెలిపారు. ఆమె బుధవారం చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సందర్భంగా జగన్‌ను కలిశామన్నారు. బుధవారం జగన్‌ను కలిసినవారిలో ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి, కుమార్తెలు హర్ష, వర్ష కూడా ఉన్నారు. వర్ష జన్మదినం కారణంగా వారు జగన్‌ను కలిసినట్లు తెలిసింది.
Share this article :

0 comments: