బాబు భేషజాలు, కుంటిసాకులు మాని అవిశ్వాసం పెట్టాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు భేషజాలు, కుంటిసాకులు మాని అవిశ్వాసం పెట్టాలి

బాబు భేషజాలు, కుంటిసాకులు మాని అవిశ్వాసం పెట్టాలి

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

 ప్రతిపక్ష నేత చంద్రబాబు భేషజాలు వీడి అవిశ్వాసం పెట్టాలని పిలుపు
- వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత మైసూరా ప్రకటన
- బాబు భేషజాలు, కుంటిసాకులు మాని అవిశ్వాసం పెట్టాలి
- తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడితే మేం మద్దతిస్తాం
- ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది
- ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సమయం ఆసన్నమైంది 

రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడుతుందని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి వెల్లడించారు. ‘‘రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టు లేదు. మంత్రివర్గంలో తీవ్ర స్థాయిలో కుమ్ములాటలున్నాయి. 

రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం అధికారం కోసమే మనుగడ సాగిస్తున్న ప్రభుత్వమిది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కూడా తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది’’ అని బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైసూరారెడ్డి చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీనే అవిశ్వాసం పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ప్రస్తుత శాసన సభ సమావేశాలు అనువైన సమయమని చెప్పారు. ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు భేషజాలు వీడి అవిశ్వాసం పెట్టాలని సూచించారు. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతిస్తుందని తెలిపారు. ఏవో పార్టీలు అవిశ్వాసం పెడితే మేం కూడా పెట్టడమేమిటని కుంటి సాకులు చెప్పి తప్పించుకోవద్దని టీడీపీని కోరారు. 

‘‘భేషజాలకు పోవడానికి ఇది వ్యక్తిగత సమస్య కాదు. ప్రజల సమస్య. మీకు ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముందుకు రండి. మీరే (టీడీపీయే) తీర్మానం ప్రవేశపెట్టండి. మీ తీర్మానాన్నే తీసుకోవాలని స్పీకర్‌కు చెబుతాం. టీడీపీ తీర్మానాన్నే బలపరుద్దామని మిగతా రాజకీయ పక్షాలనూ మేం కోరతాం. అందరమూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం’’ అని టీడీపీకి విజ్ఞప్తి చేశారు. నైతికంగా బలం లేని ఒక పార్టీ అధికారాన్ని చేతిలో పెట్టుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని, అధికార దుర్వినియోగం చేయడం అంతకంటే ఘోరమని, వీటిని దృష్టిలో ఉంచుకునైనా అవిశ్వాసానికి టీడీపీ ముందుకు రావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడే అవిశ్వాసం పెడతున్నారన్న విమర్శలను ప్రస్తావించగా.. ‘‘మాకు ఎన్నికలంటే భ యంలేదు. మున్సిపల్, పంచాయితీరాజ్, జడ్పీ.. ఇలా ఏ ఎన్నికలనై నా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాం’ అని మైసూరా స్పష్టం చేశారు.

పాలించే హక్కు లేదంటే చాలదు: పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలో అవిశ్వాసం పెట్టడానికి ముందుకు రాకుండా మా వ్యూహం మాకుంటుంది, సరైన సమయంలో పెడతామని చంద్రబాబు చెప్పడం పూర్తిగా అర్థరహితమని మైసూరా అన్నారు. అవిశ్వాసం పెడతామని అన్ని పార్టీలూ ముందుకు వచ్చినప్పుడు బేరసారాలాడుకునేందుకేనని బాబు చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. వాస్తవానికి అవిశ్వాసం పెట్టకుండా ఆయనే బేరసారాలు అడుతున్నట్లు అనుకోవాలని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని కత్తులు, కటార్లతో చంపండి, సముద్రంలో పడేయండని అంటున్న చంద్రబాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని దింపే అవకాశం వచ్చినప్పుడు కుంటి సాకులు చెప్పడం ఏం పద్ధతి అని ప్రశ్నించారు. దీన్నే పలాయన వాదం అంటారన్నారు. అవిశ్వాసం ద్వారా ప్రభుత్వం పడిపోదని టీడీపీ చేస్తున్న వాదనలను ఆయన తిరస్కరించారు. ‘‘అవిశ్వాసం అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాని ద్వారా ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయవచ్చు.

ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు. అందరూ కలిస్తే పనిచేయని ప్రభుత్వాన్ని గద్దె దించవచ్చు. ఈ అవకాశాలున్నా అవిశ్వాసం నెగ్గదు అని చెప్పడమేమిటి’’ అని సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన 17 మంది శాసన సభ్యులతో పాటు తమను అనుసరించే వారు అవిశ్వాసంపై కలిసి వస్తారని చెప్పారు. చంద్రబాబు ఆయన పార్టీకి చెందిన 76 మంది ఎమ్మెల్యేలను గైర్హాజరు కాకుండా సభకు రప్పించగలరా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ తెలంగాణ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని పెట్టే అవిశ్వాసానికి ఎలా మద్దతిస్తారని ప్రశ్నించగా.. ఫలానా కారణం వల్లే అవిశ్వాసం అని ఏమీ ఉండదని, దానికి కారణాలు చూపాల్సిన అవసరమూ లేదని వివరించారు. ఎవరైనా ఏ అంశంపైనైనా పెట్టొచ్చని, తాము ప్రజా సమస్యలపై పెడతామని తెలిపారు.

పోనీ విశ్వాస తీర్మానం పెట్టు : కొణతాల
కిరణ్ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టను అంటే, పోనీ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానమైనా పెడతామని చెప్పమనండి అని వైఎస్సార్ కాంగ్రెస్ పీఏసీ సభ్యుడు కొణతాల రామకృష్ణ అన్నారు. అవిశ్వాసం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఏమాత్రం లబ్ధి చేకూరదని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించబట్టే జగన్ జైల్లో ఉన్నారని చెప్పారు. అవిశ్వాసం పెట్టకుండా లబ్ధి పొందేది ఎవరైనా ఉంటే అది బాబేనని, ఆయనపై కేసులు రాకుండా, జైలుకు పోకుండా కాంగ్రెస్ సర్కారును కాపాడుతున్నారని విమర్శించారు
Share this article :

0 comments: