అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ అనుమతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ అనుమతి

అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ అనుమతి

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013

 అవిశ్వాస తీర్మానంపై చర్చకు అసెంబ్లీ ఆమోదం లభించింది. మొత్తం 45 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. అవసరమైన సంఖ్యకంటే ఎక్కువ మంది అవిశ్వాసం తీర్మానానికి అంగీకారం తెలపడంతో అవిశ్వాసంపై చర్చకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్ అంగీకరించారు. సభను వెంటనే వాయిదా వేసిన స్పీకర్‌ అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీ, సమయాన్ని ఖరారు చేసేందుకు శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశంలోనే అవిశ్వాసాన్ని ఎప్పుడూ చర్చించేందుకు ఖరారు చేస్తారు. అంతకు ముందుకు తనకందిన రెండు అవిశ్వాస తీర్మానాలు సక్రమంగా ఉన్నాయని స్పీకర్‌ ప్రకటించారు. ముందుగా టీఆర్ఎస్ ఇచ్చిన తీర్మానాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్కు 17మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన 3, సీపీఐకి చెందిన 3, ఇండిపెండెంట్లు నాగం జనార్థన్‌ రెడ్డి, సోమారపు సత్యనారాయణ, లోక్‌సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్‌ నారాయణ, సీపీఎం జూలకంటి రంగారెడ్డి తీర్మానంపై చర్చకు మద్దతు తెలిపారు. విప్‌ను ధిక్కరించి టీడీపీ ఎమ్మెల్యే హరీశ్వర్‌ రెడ్డి కూడా తీర్మానానికి మద్దతు ప్రకటించారు.
Share this article :

0 comments: