షర్మిల సభకు కిక్కిరిసిన జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల సభకు కిక్కిరిసిన జనం

షర్మిల సభకు కిక్కిరిసిన జనం

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013


 మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర భాగంగా గుంటూరు పట్టణంలో జరిగిన షర్మిల బహిరంగ సభకు జనం పోటెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో సభాప్రాంగణం కిక్కిరిసింది. ఈ సభలో ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్, టీడీపీలపై ధ్వజమెత్తారు. 

అమాయకుడైన జగనన్న 9 నెలలు జైలులో ఉంచారు.. మీకు మనస్సాక్షి ఉందా అని షర్మిల ప్రశ్నించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గుంటూరు పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అవిశ్వాసాన్ని వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్‌కు లేని తొందర టీడీపీకి వచ్చిందని..అందుకే ముందుగానే టీడీపీ విప్ జారీ చేసింది అని షర్మిల అన్నారు. ఈ సభలో షర్మిల టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు.

కేసులు, విచారణ లేకుండా చంద్రబాబు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారని.. ప్రజా వ్యతిరేక పార్టీకి మద్దతు పలికిన తర్వాత.. ఇక టీడీపీ ఎక్కడుంది బాబూ అని ఎద్దేవా చేశారు. మన కర్మ కొద్ది ఓ వైపు అసమర్థ ప్రభుత్వం.. మరోవైపు చేతగాని ప్రతిపక్షం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల కోసం వైఎస్ఆర్ 5 శాతం రిజర్వేషన్ల కోసం పట్టుపట్టారని.. కేంద్రం ఒప్పుకోకుంటే 4 శాతం రిజర్వేషన్లను ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దేనని షర్మిల ఈసందర్భంగా గుర్తు చేశారు.

వైఎస్ఆర్‌ రైతులకు ఏమీ చేయలేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని..చిన్నపిల్లవాడ్ని అడిగినా రైతులకు, రాష్ట్రానికి వైఎస్ఆర్ ఏంచేశారో చెబుతారని ఆమె అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: