బాబూ..ప్రజలకైనా సమాధానమివ్వు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ..ప్రజలకైనా సమాధానమివ్వు!

బాబూ..ప్రజలకైనా సమాధానమివ్వు!

Written By news on Saturday, March 9, 2013 | 3/09/2013

ఈ ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని జనం అడుగుతున్నారు
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా అసెంబ్లీకి రానంటారా?
జనం కష్టాలు పట్టని టీడీపీ ఒక పార్టీయేనా
అవిశ్వాసం పెట్టరట.. బ్రదర్ అనిల్‌పై చర్చిస్తారట

 రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు విచిత్ర ధోరణి చూసి రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయకుండా బడ్జెట్ సమావేశాలకు దూరంగా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్న ప్రజలకైనా సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు బడ్జెట్ సమావేశాలకు రారట. ఆ పార్టీ అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించదట! కానీ బ్రదర్ అనిల్‌కుమార్ మీద చర్చలేపుతారట. 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటూ తొమ్మిదేళ్లు పాలన చేసిన నాయకుడు చేసే చేష్టలు ఇవేనా? టీడీపీ ఒక రాజకీయపార్టీయేనా?’’ అని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో తాగడానికి గుక్కెడు నీళ్లులేక ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. కరెంటు కోతల కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సందర్భంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీయరట...’’ అని ఎద్దేవా చేశారు.

ఎవరు చెబితే అవిశ్వాసం పెడతారు...?

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తున్నా మిన్నకుండిపోయిన చంద్రబాబుకు తన పాదయాత్రలో ప్రజలు అడుగుతున్నా స్పందించడం లేదని అంబటి అన్నారు. ‘గుంటూరు జిల్లా మంగళగిరిలో బాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు తోటి పాదచారుడు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని బాబును నిలదీశారు. ముదినేపల్లిలో రాత్రి 11 గంటలకు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నప్పుడు కొందరు విద్యార్థులు అవిశ్వాసం పెట్టరేం? అని ప్రశ్నించినా ఆయన స్పందించరు. మరి ఎవరు చెబితే అవిశ్వాసం పెడతారు? పార్టీలు అడిగితే ఎలాగూ స్పందించడం లేదు, కనీసం ప్రజల ప్రశ్నలకైనా జవాబివ్వు’’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేట్లు లేరన్నారు. ఈ మధ్యకాలంలో అవిశ్వాసంపై టీడీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారన్నారు. ‘‘జగన్ బెయిల్ తెచ్చుకునేందుకే అవిశ్వాసం కోసం వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుందని చంద్రబాబు అంటున్నారు. అంటే రాజకీయ దురుద్దేశాల వల్లే అక్రమ కేసులతో జగన్ ను నిర్బంధించినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా?’’ అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే తక్షణం అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు రానంటున్న చంద్రబాబును ఇక పూర్తిగా అసెంబ్లీకి రాకుండా చేసేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారని పేర్కొన్నారు. 

రహస్యం కాదు బహిరంగమే..

‘‘కాంగ్రెస్‌కు తాను రహస్య స్నేహితుడినని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఆయనను కాంగ్రెస్‌కు బహిరంగ మిత్రుడు అని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నం చంద్రబాబు చేయరు’’ అని అంబటి పేర్కొన్నారు. గతంలో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌కు నష్టం జరిగినందుకే మరోసారి అలా జరగకూడదనే ఆలోచనతో బాబు ఉన్నట్లున్నారన్నారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కాంగ్రెస్ పరువు కాపాడేందుకు చంద్రబాబు తన పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు పరిచిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైనప్పుడల్లా ఢిల్లీ వెళ్లి చీకట్లో చిదంబరాన్ని కలవడం, కర్ణాటకలో భరద్వాజతో సమావేశమవుతూ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారని మండిపడ్డారు.
Share this article :

0 comments: