మమ్మల్ని బాబే చూసుకుంటాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మమ్మల్ని బాబే చూసుకుంటాడు

మమ్మల్ని బాబే చూసుకుంటాడు

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

* బాబు ‘విశ్వాసం’పై కాంగ్రెస్‌లో హర్షం
* కాంగ్రెస్, టీడీపీ నేతల కరచాలనాలు
* రేవంత్‌తో గండ్ర ఆలింగనం
* థ్యాంక్స్ చెప్పిన మంత్రి ఆనం 
* ప్రభుత్వాన్ని చంద్రమామ చేతిలో పెట్టాం.. ఆయనే ఆదుకుంటారు: జేసీ
* తమకిక ఢోకా లేదంటూ ధీమా 

 ఫిక్సింగ్ గుట్టు బాహాటంగా రట్టయింది. ‘అవిశ్వాసం’ ముప్పును తప్పించుకున్న ఆనందాన్ని అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఎంత ప్రయత్నిం చినా దాచుకోలేకపోయాయి. ఇంతకాలం తెర వెనక, గుంభనంగా, గప్‌చుప్‌గా సాగుతూ వస్తున్న కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు బాగోతాలు తాజాగా అసెంబ్లీ సాక్షిగా బహిరంగమైపోయాయి! ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం తొలగిందన్న సంతోషాన్ని కాంగ్రెస్ నేతలు, ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా సర్కారును నిలబెట్టగలిగామన్న ఆనందాన్ని టీడీపీ తమ్ముళ్లు పరస్పరం పబ్లిగ్గానే పంచుకున్నారు! బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజును ఇరు పార్టీల నేతలూ పరస్పర ఆలింగనాలతో, శుభాకాంక్షలతో, అభినందనలతో ఆద్యంతం సందడి సందడిగా గడిపారు. టీఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వరాదని టీడీపీ తీసుకున్న నిర్ణయం తాలూకు ఊరట వారిలో కొట్టొచ్చినట్టు కన్పించింది. ఈ మేరకు చంద్రబాబు చేసిన ప్రకటన నేపథ్యంలో బుధవారం శాసనసభ లోపలా, ఆవరణలోనూ ఎటు చూసినా కాంగ్రెస్, టీడీపీ నేతల కోలాహలం, ఉత్సాహమే దర్శనమిచ్చాయి. వారంతా పూర్తి సంతోషకర వాతావరణంలో, ఛలోక్తులతో గడిపారు. నేతల ముఖాలు ఆద్యంతం చిరునవ్వులతో వెలిగిపోయాయి. 

ఒకవైపు రాష్ట్ర ప్రజలు పుట్టెడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే, వాటిని ప్రతిబింబించాల్సిన బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు ముఖచిత్రం ఇలా అందుకు పూర్తి భిన్నంగా కన్పించింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజున మామూలుగా పరస్పరం ఆరోపణలతో, విమర్శనాస్త్రాలతో నిప్పులు కురిపిం చుకునే అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యులు ఇలా కలిసిమెలిసి ‘పండుగ’ చేసుకోవడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పలువురు కాంగ్రెస్ నేత లు తమ దగ్గరికొచ్చిన టీడీపీ నేతలను ఆలింగనం చేసుకొని మరీ ధన్యవాదాలు తెలపడం విశేషం. తల్లి తన పిల్లల్ని మేనమామ చేతిలో పెట్టినంత జాగ్రత్తగా కాంగ్రెస్ పెద్దలు తమను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ‘చంద్రమామ’ చేతిలో పెట్టారనే వ్యాఖ్యతో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి ఒక్క ముక్కలో విషయాన్ని విశదీకరించారు. ఇక ముందు కూడా అన్నింటికీ తమను బాబే ఆదుకుం టారంటూ ముక్తాయించారు. 

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం తనకు ఎదురైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆప్యాయంగా ఆలింగ నం చేసుకున్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా ఆయనతో కరచాలనం చేయడంతో పాటు ధన్యవాదాలు కూడా తెలిపారు. అవిశ్వాసంపై టీడీపీ నిర్ణయమే కీలకం కావడంతో నిన్నటిదాకా చాలా ఉత్కంఠతో ఉన్న నేతలు బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆనందంగా గడిపారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సీనియర్ల మధ్య కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. అవిశ్వాసానికి టీడీపీ కూడా మద్దతిస్తే ప్రభు త్వ మనుగడ కష్టమే అయ్యేదని నేతలన్నారు. ‘‘సాంకేతికంగా నాలుగైదు ఓట్ల ఆధిక్యంతో బయటపడేలా ఉన్నా పార్టీలో అసంతృప్తులు ఎక్కువగా ఉన్నందున ఎటు పోయి ఎటు వస్తుందోనన్న ఆందోళన, ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్న భయం కలిగాయి. టీడీపీ మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాం’’ అని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

మమ్మల్ని బాబే చూసుకుంటాడు: జేసీ
ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘అమ్మ చనిపోతూనో, ఎక్కడికైనా వెళ్తూనో పిల్లలను జాగ్రత్తగా చూసుకొమ్మని మేనమామ చేతిలో పెడుతుంటుంది. ఆ పిల్లలకు ఏ సమస్య వచ్చినా ఇక అన్నీ ఆయనే చూసుకుంటాడు. అలాగే ఇక్కడ మమ్మల్ని, ప్రభుత్వాన్ని మా పార్టీ పెద్దలు ‘చంద్రమామ’ చేతిలో పెట్టారు. ఏ సమస్య వచ్చినా అన్నింటికీ ఆయనే ఆదుకుంటాడు. ఎవరేంచేసినా ఇక మా ప్రభుత్వానికి ఏ ఢోకా ఉండదు. ఈ విష యం ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను’’ అని నవ్వుతూ అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ఆల కించి తిరిగివస్తూ కూడా టీడీఎల్పీ కార్యాలయం వద్ద జేసీ కాసే పు టీడీపీ నేతలతో మాట్లాడారు. మధ్యాహ్నం గండ్ర కూడా అసెంబ్లీ నుంచి బయటికెళ్తూ మధ్యలో టీడీఎల్పీ కార్యాలయం వద్ద మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల, రేవంత్ వద్దకొచ్చి కరచాలనం చేశారు. ముగ్గురూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. అవిశ్వాసం వీగిపోవడం ఖాయమనేగా నవ్వుతున్నారని విలేకరులు అనడంతో, అవిశ్వాసం విషయంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది టీఆర్‌ఎసే తప్ప తాము కాదని కేశవ్ బదులిచ్చారు.
Share this article :

0 comments: