టిడిపి నేతల దీక్ష హాస్యాస్పదం: ప్రవీణ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » టిడిపి నేతల దీక్ష హాస్యాస్పదం: ప్రవీణ్

టిడిపి నేతల దీక్ష హాస్యాస్పదం: ప్రవీణ్

Written By news on Wednesday, March 27, 2013 | 3/27/2013

శాసనసభలో అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వాన్ని నిలబెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు విద్యుత్ సమస్యపై నిరాహారదీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపిన ఉదంతాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు విస్మిరించినా ప్రజలు విస్మరించలేదన్నారు. బషీర్ బాగ్ లోని విద్యుత్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి ప్రాయచిత్తం చేసుకుని దీక్షాస్థలికి వెళితే బాగుండేదన్నారు. ఉచిత విద్యుత్ సరికాదు, బోరుబావులను నిషేధించాలని తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని ఎందుకు విస్మరించారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. గత తప్పిదాలను ఒప్పుకోకుండా దీక్ష చేయడంలో అర్థం లేదన్నారు. అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ కు అండగా నిలిచిన చంద్రబాబు ఇక నుంచి ప్రభుత్వం తీసుకునే ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయానికి బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా ఏర్పడిన టీడీపీ ఇప్పుడు వైఎస్ఆర్ ను వ్యతిరేకించడమే ఏజెండాగా మార్చుకుందని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో ఎలాంటి విద్యుత్ సమస్యలేదు. దానికి తోడు ఆయన ఉచిత విద్యుత్ అందించినందువల్లే ప్రజలు రెండవ సారి పట్టగట్టారన్నారు.విజయనగరం: ఎల్‌.కోటలో వైఎస్‌ఆర్‌ సీపీ కార్యాలయాన్ని పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్‌ కృష్ణరంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కల్లేపల్లికి చెందిన 250 మంది వైఎస్‌ఆర్‌ సీపీ లో చేరారు. జిల్లా కన్వీనర్‌ పెన్మత్స సాంబశివరాజు తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: