వైఎస్ ఆశయాలు సాధించి తీరుతాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఆశయాలు సాధించి తీరుతాం

వైఎస్ ఆశయాలు సాధించి తీరుతాం

Written By ysrcongress on Saturday, March 23, 2013 | 3/23/2013

జైలులో జగన్‌తో ప్రత్యేక ములాఖత్

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు తనవంతు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ గురువైన వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌ను అక్రమంగా జైలు పాలుచేసి ఇప్పటికి మూడు వందల రోజులు గడిచాయన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు తాను వచ్చినట్లు పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వనప్పటికీ కుత్బుల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనకు పార్టీలు, కులమతాలకు అతీతంగా గెలిపించిన ప్రజల అభీష్టం మేరకే ఆనాడు తాను వైఎస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్‌కు మద ్దతు ఇవ్వాలన్న ప్రజల కోరిక మేరకు ఆయనకు అండగా నిలిచేందుకు నిశ్చయించుకున్నట్లు తెలిపారు. 

వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతూ వైఎస్ ఆశయాలను సాధించే దిశగా ప్రజలతో కలిసి ముందుకు వెళతానన్నారు. పనిచేసేవారికే ప్రజలు పట్టం కడతారు తప్ప.. హంగు ఆర్భాటాలకు పోయే నాయకులను దరిచేరనివ్వరన్నారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. ఆయన వెంట గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, దూళ్ళపల్లి సహకార సంఘం చైర్మన్ నవీన్‌గుప్తా, వైఎస్సార్ సీపీ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు, కంటోన్మెంట్ మాజీ చైర్మన్ జంపాన ప్రతాప్, వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్‌గౌడ్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి నవీన్‌గౌడ్ తదితరులు ఉన్నారు. జగన్‌ను కలిసినవారిలో భారతీరెడ్డి, శ్రీకాకుళం మాజీ ఎంపీ పాలవలస రాజశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా నాయకుడు రాజీవ్‌కృష్ణ ఉన్నారు.

ఉగాది తరువాత కాంగ్రెస్ ఖాళీ : వడ్డేపల్లి

ఉగాది పండుగ తరువాత రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారని వడ్డేపల్లి నర్సింగరావు అన్నారు. వైఎస్ ఆశీస్సులతో నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే తప్ప వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: