ప్రజలే ప్రభుత్వానికి హాలిడే ప్రకటిస్తారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలే ప్రభుత్వానికి హాలిడే ప్రకటిస్తారు

ప్రజలే ప్రభుత్వానికి హాలిడే ప్రకటిస్తారు

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013

హైదరాబాద్: తమని అన్నివిధాల నానా అవస్థలకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో ప్రజలే హాలిడే ప్రకటిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత విజయమ్మ హెచ్చరించారు. శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో ఆమె మాట్లాడుతూ పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా విడిచిపెట్టారన్నారు. రాజీవ్ యువకిరణాల పేరుతో ప్రైవేట్ రంగంలో అరకొర ఉద్యోగాలను కల్పిస్తున్నారని చెప్పారు. ఆరున్నర లక్షల కోట్ల రూపాయల మేర పారిశ్రామిక ఒప్పందాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఒక్క యూనిట్ విద్యుత్ గాని, ఒక్క ఉద్యోగం కాని వచ్చిందా? అని అడిగారు. నేతన్నలు, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్మెంట్లో కోతలు పెట్టారని విమర్శించారు. అధికార దుర్వినియోగంచేసి సహకార ఎన్నికల్లో ఈ ప్రభుత్వం గెలుపొందిందన్నారు. ఈ ప్రభుత్వం ఎవరికి ప్రతినిధి అని ప్రశ్నించారు. చంద్రబాబుకా? ప్రజానీకానికా? కిరణ్‌కుమా రెడ్డికా? అని అడిగారు. ఎవర్ని రక్షిస్తుందీ ప్రభుత్వం? చంద్రబాబునా? అణగారిన వర్గాలవారినా? అని ప్రశ్నించారు.

ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం ప్రకటించకపోవడం దారుణం అన్నారు. అవిశ్వాసానికి ఎందుకు నిలబడ్డటంలేదని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజూ మాట్లాడే చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదు? అని అడిగారు. ప్రభుత్వానికి అనుకూలంగా చంద్రబాబు విప్ జారీచేసిన వైనం దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు


Share this article :

0 comments: