న్యాయస్థానాల మాటేమో కానీ...ప్రజల తీర్పు స్పష్టంగా ఉండబోతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » న్యాయస్థానాల మాటేమో కానీ...ప్రజల తీర్పు స్పష్టంగా ఉండబోతోంది

న్యాయస్థానాల మాటేమో కానీ...ప్రజల తీర్పు స్పష్టంగా ఉండబోతోంది

Written By news on Tuesday, March 26, 2013 | 3/26/2013

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి ఓదార్పు యాత్ర చేయడమేనా జగన్‌గారు చేసిన నేరం? ఓదార్పుయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇచ్చి ఉన్నట్లయితే జగన్‌గారి ఇమేజ్ పెరిగినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట చెక్కు చెదరకుండా ఉండేది కదా. ఈ వాస్తవాన్ని సోనియా ఎక్కడ గ్రహిస్తుందోనని ఆమెకు, జగన్‌కు మధ్య కాంగ్రెస్ నాయకులు అడ్డుగా నిలిచారు. 

జగన్ తన తండ్రి మాదిరిగానే సొంత ఇమేజ్ కలిగిన నాయకుడిగా ఎక్కడ ఎదుగుతారోనని కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పు వల్ల నేడు రాష్ట్రంతో పాటు, దేశంలో కూడా అనేక ఒడిదుడుకులు ఏర్పడి కాంగ్రెస్ అనే నావ 2014 ఎన్నికలలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అధికార ప్రతిపక్షాలు ఏకమై... అత్యంత ప్రజాభిమానం కలిగిన ఒక ఎంపీని, అతి తక్కువ వయస్సు కలిగిన ఒక గొప్ప పారిశ్రామికవేత్తను, అక్రమ సంపాదన పేరుతో ఇబ్బందులకు గురి చేశాయి. తత్ఫలితంగా ప్రజలకు దూరం అయ్యాయి. జగన్‌గారు కాంగ్రెస్‌పార్టీనుండి ఉద్దేశపూర్వకంగా బయటకు రాలేదన్నది జగమెరిగిన సత్యం. ప్రజావ్యతిరేక శక్తులకు లోబడి ఉండలేక ఆయన బయటికి వచ్చారు. 

ఓదార్పుయాత్రలో ప్రజాసమస్యల పట్ల ఆయన స్పందించిన తీరు కూడా కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేసింది. అందులోంచి బయటపడేందుకు ఆ యువనేతను అరెస్ట్ చేయించింది. ప్రజాసమస్యలను గాలికి వదిలి ఎప్పుడూ జగన్‌గారిని నిందించడానికే సమయాన్ని వెచ్చిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల అవసరాలు, సమస్యలు ఈ కాంగ్రెస్‌కు పట్టవా? లేక ప్రజలు నిద్రపోతున్నారులే అనుకుంటోందా? ప్రజలు అదను కోసం ఎదురుచూస్తున్నారు. తమ సత్తాను రాబోయే ఎన్నికలలో చూపిస్తారు. న్యాయస్థానాలలో జగన్‌కు ఇంతవరకు న్యాయం జరగలేదు. కానీ తమకు నిజమైన నాయకుడు ఎవరో ప్రజలు త్వరలోనే స్పష్టంగా తీర్పు చెప్పబోతున్నారు. జగన్ సీఎం అవడమే జనం అభిమతం.

- సంగారెడ్డి నరసింహారెడ్డి, వేంపల్లి 

సాక్షులను ప్రభావితం చేస్తారని అనడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే

తమ్ముడూ... నీకోసం మా కుటుంబమంతా ప్రార్థిస్తున్నాము. చెల్లి భారతి చెప్పినట్లు గ్ఛి ్చట్ఛ టఝ్చ ఞ్ఛౌఞ్ఛ ఛఠ్ట ౌఠట ం ఎౌఛీ జీట ఛజీజ ఎౌఛీ. ఆ వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటే నా కన్నీళ్లు ఆగవు. నిద్ర మధ్యలో మెలకువ వస్తే తమ్ముడు జైల్లో ఉన్నాడని గుర్తొచ్చి నా హృదయం ఆక్రోశిస్తుంది. దేవా బిడ్డను జ్ఞాపకం చేసుకొమ్మని అడుగుతాను. నువ్వు విజయోత్సవంతో బయటికి వచ్చే ఆ దృశ్యాన్ని పదే పదే ఊహించుకుంటాను. న్యాయం అందరికీ సమానంగా ఉంటే అడగను. కానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం! ఇదేనా ప్రజాస్వామ్యం? జీవోలపై సంతకాలు చేసిన మంత్రులు అందరూ బయట ఉన్నారు. జగన్ ఒక్కరూ లోపల ఉన్నారు. దీన్ని ప్రజలంతా గుర్తించారు. 

అధికార దుర్వినియోగం చేస్తున్నదెవరో, చట్టాన్ని, న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నది ఎవరో ప్రజలకు బాగా తెలుసు. మరి జగన్‌గారు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని అనడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే కదా! తమ్ముడూ మీరు ఎప్పుడూ అంటుంటారు. ‘దేవుడు చూస్తున్నాడు’ అని. అది నిజం. యెషయా ప్రవక్త (59:16) చెప్పినట్లు ‘న్యాయం జరుగక పోవుట యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి నచ్చలేదు. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహయము చేసెను’ అన్న వాక్యాలు నీ విషయంలో నిజమవుతాయి. 

- ప్రశాంతి, అనంతపూర్
Share this article :

0 comments: