కనీసం టీవీలోనైనా జగన్‌గారిని చూపించండి ప్లీజ్... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కనీసం టీవీలోనైనా జగన్‌గారిని చూపించండి ప్లీజ్...

కనీసం టీవీలోనైనా జగన్‌గారిని చూపించండి ప్లీజ్...

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013

కనీసం టీవీలోనైనా జగన్‌గారిని చూపించండి ప్లీజ్...
నాకు ఏడుసంవత్సరాల కుమార్తె ఉంది. పేరు శ్రావణి. జగన్‌గారు ఓదార్పుయాత్ర చేసే సమయంలో శ్రావణి వయస్సు ఐదు సంవత్సరాలు. అప్పటి నుండి సాక్షి ఛానల్ చూస్తూ ఉండేది. పిల్లలు సహజంగా కామిక్స్ చూస్తారు. కాని శ్రావణి మాత్రం టీవీలో ఎప్పుడూ జగన్‌గారినే చూసేది. గత ఎనిమిది మాసాల నుండి సాక్షిలో జగన్‌గారు కనబడకపోయేసరికి శ్రావణి దిగులుతో అల్లాడుతోంది. ‘‘అమ్మా-జగనన్నను చూపించు, నన్ను తీసికెళ్లు’’ అని రోజూ మారాం చేస్తోంది. కాని నేను సర్దిచెప్పలేకపోతున్నాను. స్కూలుకు కూడా సరిగా వెళ్లడం లేదు. 

దయచేసి నా కూతురి మనోవేదనను పోగొట్టడానికి సాక్షి ఛానల్ వాళ్లకు విన్నవిస్తున్నాను. జగన్‌గారి ఓదార్పుయాత్రను రోజూ కొన్ని నిమిషాలపాటైనా ప్రసారం చేయమని కోరుకుంటున్నాను. మనసులు మమతలు తెలియని రాజకీయనాయకులు, వాళ్ల అడుగులకు మడుగులొత్తే సీబీఐలాంటి వ్యవస్థలు ఉన్నంతకాలం నాలాంటి తల్లులు బాధపడవలసిందేనా? ఇప్పటికైనా జగన్‌గారిని జైలు నుండి విడుదల చేయాలని ఈ ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. నా కోరిక మన్నించేటట్లయితే టీవీలో రోజూ సాయంత్రం 4 తర్వాత జగన్‌గారి ఓదార్పుయాత్ర ప్రసారం చేయమని కోరుకుంటున్నాను. మా పాప 4 గంటలకు స్కూలు నుండి వస్తుంది. నా కోరిక మన్నించమని వేడుకుంటున్నాను.

- వెంకటమ్మ, కొత్తపేట, గుంటూరు

అప్పుడేం జరిగిందో...ఇప్పుడూ అదే జరుగుతుంది!

జగన్‌ని అక్రమంగా జైల్లో పెట్టి కొన్ని పార్టీలవారు పైశాచికానందాన్ని పొందుతున్నారు. వారిని చూస్తే నాకు బైబిల్‌లోని ఒక దృష్టాంతం గుర్తుకొస్తుంది. బైబిల్ గ్రంథంలో యాకోబు అనే దైవజనుడున్నాడు. అతని కుమారులలో ఒకడు యోసేపు. కొన్ని కారణాల వల్ల యోసేపు సోదరులు అతడిని ఐగుప్తుకు అమ్మి వేస్తారు. ఐగుప్తురాజు ఫరో. ఫరో సేనాధిపతి పొతీఫరు. పొతీఫరు యోసేపును కొంటాడు. పొతీఫరు ఇంట్లో పనులన్నీ యోసేపు చూసుకునేవాడు. యోసేపు నిజాయితీని చూసిన పొతీఫరు తన ఇంటిని, వ్యాపారాన్ని యోసేపునకు అప్పగిస్తాడు. యోసేపు దైవభక్తిగలవాడు, నిజాయితీపరుడు కావడం చేత మంచి పేరు తెచ్చుకుంటాడు. అంతేకాదు, అతడు రూపవంతుడు, సుందరుడు. అతని అందాన్ని చూసి పొతీఫరు భార్య ఆకర్షితురాలవుతుంది. యోసేపును వేధిస్తుంది. కానీ యోసేపు పాపం చేయడానికి ఒప్పుకోడు.

యజమాని భార్య యోసేపు మీద కక్ష కడుతుంది. తన భర్తకు అబద్ధాలు చెప్పి అధికారుల్ని ప్రభావితం చేసి, యోసేపును అన్యాయంగా జైల్లో వేయిస్తుంది. జైల్లో ఉన్న యోసేపును చూచి వికృతానందాన్ని పొందుతుంది పొతీఫరు భార్య. అయితే పైనున్న దేవుడు అందరినీ చూస్తూనే ఉంటాడు. ఆయన న్యాయవంతుడు. అందుకే యోసేపును చూశాడు. జైలు నుండి విడిపించాడు. అంతేకాదు, ఐగుప్తుకు ప్రధానిగా చేశాడు. దేవుడు తనను నమ్ముకున్న వారిని ఎన్నడూ విడువడు.

వర్తమానంలో కూడా జగన్‌బాబుని జైల్లో పెట్టామని కొంతమంది అమానుషమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. జగన్‌బాబు నిర్దోషిలా బయటకు వస్తాడు. యోసేపులా ఉన్నత పదవులు పొందుతాడు. ‘‘దేవుడు నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులు సిగ్గుపడుదురు. వారు ఆకస్మికముగా వెనుకకు మళ్లుదురు’’ (కీర్తనలు 6:9,10) - ఈ వాగ్దానం ప్రకారం జగన్ విజయం పొందుతారు.

- డి.జె.అమూల్యరావు, తణుకు
Share this article :

0 comments: