ప్రజాభిమానాన్ని ఎవరూ నిర్బంధించలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాభిమానాన్ని ఎవరూ నిర్బంధించలేదు

ప్రజాభిమానాన్ని ఎవరూ నిర్బంధించలేదు

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నది భారతీయుల నమ్మకం! ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. జగన్ కోసం దాదాపు రెండు కోట్లమందికి పైగా ప్రజలు - ఆయన అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన - సంతకాల సేకరణను ధర్మ పరిరక్షణగా భావించి సంతకాలు చేశారు. ఈ సంతకాల ఉద్యమానికి రాష్ట్రపతి ఎంతగా స్పందించి రాజ్యాంగ పరిరక్షణ చేస్తారో చూడాలి. పాలకులు ధర్మబద్ధులై పరిపాలిస్తేనే అది ‘సుపరిపాలన’ అనిపించుకుంటుంది. రాముని రాజ్యం ధర్మపాలనలో సాగింది కనుకనే యుగాలు మారినా ‘రామరాజ్యాన్ని’ గొప్పగా కీర్తిస్తున్నారు ప్రజలు. 

కానీ ప్రస్తుత పాలకులు పూర్తి అధర్మంగా పాలిస్తున్నారు. సీబీఐ అంటే పాలకుల కొంగున ముడివడిన బంధమేనన్నది జగత్ విదితమే! నిజంగా జగన్ కేసు చూస్తుంటే గాంధీ నెహ్రూల వారసత్వంలో నడిచిన ‘ప్రజాస్వామ్యమేనా’ ఇది అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఏ అధికారంలోనూ లేని జగన్‌పై ఒక అక్రమమైన కేసు బనాయించాయి అధికార పార్టీ, దానికి అనుబంధమైన ప్రతిపక్ష పార్టీ. ఇందులో ధర్మాధర్మాలు లేవు. న్యాయాన్యాయాలు లేవు. కేవలం కుట్రలు, కుతంత్రాలు, వంచన. 

ఇందుకోసమేనా భారతీయ నాగరిక సమాజం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంది? ప్రజలంటే పాలకులకు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అంత చులకనా? పోనీ కోర్టు ఆదేశాలతో పనిచేస్తున్నామని చెప్పుకునే సీబీఐ, కాంగ్రెస్, టీడీపీ పిటిషన్లకి అసలు ఆధారాలేమన్నా ఉంటే సమర్పించమని ఎవరైనా అడిగారా? అసలు ధర్మపీఠాలు కూడా తగిన రీతిలో స్పందించటం లేదెందుకు? అందుకే కావచ్చు, ప్రజలే ఈ ధర్మరక్షణ ఉద్యమానికి సంతకాలతో ఊపిరి పోస్తున్నారు. ఈ ఉద్యమం నిజానికి ఇంతటితో ఆగేది కాదు. జగన్ విడుదలై బయటకొచ్చేవరకు సాగుతుంది. అధర్మ పాలకుల కళ్లు తెరిపించేవరకూ సాగుతుంది. రాబర్ట్ వాద్రాపై (సోనియా అల్లుడు) ఆరోపణలొచ్చినప్పుడు సీబీఐ దర్యాప్తు లేదు. 

అఖిలేష్ యాదవ్ భార్యపై కేసొస్తే ఆమె ప్రైవేట్ వ్యక్తి అని సీబీఐ కేసు వేయలేదు. కానీ జగన్ విషయానికొస్తే మాత్రం ఆయన్ని అరెస్టు చేస్తుంది. బెయిల్ రానీకుండా చేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఢిల్లీ పాలకుల ధర్మనీతి ఏమిటో, దానిని అంతర్లీనంగా అమలు చేసే సీబీఐ వక్రబుద్ధి ఏమిటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఇదే ‘ధర్మనీతి’ వైఎస్సార్ అనుసరించి ఉంటే, ఈపాటికి చంద్రబాబు తెచ్చుకున్న స్టేలన్నీ తొలగిపోయి జైల్లో ఉండేవాడు. కానీ రాజన్న అలా చేయలేదు. ‘రామరాజ్యం’ నీతినే అనుసరించాడు. అందుకే రాజన్నను యుగాలు, తరాలు మారినా ప్రజల నుండి వేరు చేయలేరు. ఆయన తనయుడిపై కురుస్తున్న ప్రజాభిమానాన్ని ఎవరూ నిర్బంధించలేరు.

- కె.పద్మావతి, ఏసీ ఇంజినీరింగ్ కాలేజ్, అంకుషాపూర్

కృతజ్ఞత తెలుపుకోవాలని ఆరాటపడుతున్నాం

కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో మా ఇంటి వారందరు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుని వారికి మద్దతుగా నిలిచారు. ఆ తరువాత ఆయనకు జరిగిన అవమానం (చంద్రబాబు గారి కుట్ర, వెన్నుపోటు) మా మనసులను కలచివేయడంతో 2004లో వైయస్సార్‌గారికి మద్దతు దారులుగా నిలిచాం. తర్వాత వైయస్సార్ ప్రభుత్వ హయాంలో, మన రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధి పొందిన విధంగానే మా కుటుంబమూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందింది. నిజానికి మన రాష్ట్రంలోని ధనిక, మధ్య తరగతి, పేద, అట్టడుగు వర్గం వారందరూ వై.ఎస్.గారి వల్ల ప్రయోజనం పొందినవారే. దీనికి సర్వేలు, లెక్కలు వేయించనక్కరలేదు. 

స్వాతంత్య్రానంతరం మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత ఎత్తున ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు లేరు. అందుకే వైఎస్సార్ విగ్రహాలు వాడవాడలా నిర్మించుకుని నివాళులు అర్పించుకుంటున్నారు. ఆయన కుమారుడు జగన్‌కి మద్దతుగా నిలిచి కృతజ్ఞత తెలుపుకోవాలని ఎదురు చూస్తున్నారు. మరోవైపు, విశ్వసనీయత లేని ప్రతిపక్ష నాయకుడు కొంగ జపం చేస్తూ హామీలు గుప్పిస్తూ, ఏ చిన్న సందర్భం దొరికినా వైయస్సార్ కుటుంబంపైన బురద చల్లుతూ, గొప్పలు చెప్పుకుంటూ ఈసారి అధికారం ఇస్తే మొదటి సంతకం ఋణమాఫీ, రెండవ సంతకం బెల్టు షాపురద్దు అంటూ పాదయాత్ర చేయడాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. 

నిజానికి ప్రజల ఆలోచన వేరుగా ఉందన్న విషయం చంద్రబాబు గారికి తెలిసినట్లు లేదు పాపం. పాదయాత్ర సభల్లో ఆయన చేసే వీరంగాలు చూస్తే వైయస్సార్‌పై ఆయనకు ఎంతటి ఈర్ష్య, అసూయాద్వేషాలు ఉన్నాయో తెలుస్తోంది ఫైనల్‌గా ఆయన ఒకటి తెలుసుకోవాలి. త్వరలో ఆయన పెట్టబోయే మొదటి సంతకం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా పత్రం పైనే. 

- సాయిలక్ష్మి, బెంగళూరు
Share this article :

0 comments: