నా కుమారుడి మరణానికి బ్రదర్ అనిల్‌కు సంబంధంలేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా కుమారుడి మరణానికి బ్రదర్ అనిల్‌కు సంబంధంలేదు

నా కుమారుడి మరణానికి బ్రదర్ అనిల్‌కు సంబంధంలేదు

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013


తన కుమారుడి మరణానికి బ్రదర్ అనిల్‌కుమార్‌కు ఎటువంటి సంబంధం లేదని మృతుడు వీరభద్రారెడ్డి తండ్రి తేళ్లూరి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం ఆయన తనను కలసిన మీడియాప్రతినిధులతో మాట్లాడారు. గతనెల 25న తన కుమారుడు వీరభద్రారెడి ్డకృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని పోచంపల్లి గ్రామశివార్లలో మృతి చెందాడని, ఈ మరణాన్ని కొందరు నాయకులు రాజకీయాలకు వాడుకో చూస్తున్నారన్నారు. మీడియా ప్రతినిధులు బాధలో ఉన్న తన కుటుంబానికి సానుభూతి తెలిపాల్సింది పోయి ఆ విషయంపై పదేపదే గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమీ చదువుకోలేదని, కాగితాలు, డాక్యుమెంట్ల గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తన కుమారుడు.. కొండలరావు దగ్గర పనిచేసిన 20 ఏళ్ల కాలంలో ఏనాడూ బ్రదర్ అనిల్ గురించి చెప్పలేదన్నారు. అసలు అనిల్ ఎవరో తమకు ఇంతవరకు తెలియదన్నారు. సంఘటనాస్థలంలో దొరికిన లేఖ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేసి, తన కుమారుడి మృతికి కారణాలు కనుగొనాలని కోరారు. 
Share this article :

0 comments: