సర్కారును రక్షించి.. దీక్షలా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారును రక్షించి.. దీక్షలా ?

సర్కారును రక్షించి.. దీక్షలా ?

Written By news on Thursday, March 28, 2013 | 3/28/2013

* నాడు అవిశ్వాసానికి మద్దతిస్తే ప్రభుత్వం కూలిపోయేది.. ప్రజలకు కరెంటు భారం తప్పేది
* అప్పుడేమో ప్రభుత్వాన్ని బాబు కాపాడారు.. ఇప్పుడు విద్యుత్తు చార్జీలపై దీక్షలంటున్నారు
* చంద్రబాబు తన పార్టీని తెర వెనుక నుంచి కాంగ్రెస్‌కు అమ్ముకున్నారు
* అందుకే కాంగ్రెస్ పార్టీకి రక్షణగా నిలబడి ఆ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు
* జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు లేకుండా చేస్తాం
* మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా మహిళా పోలీసులను కాపలా పెడతాం 

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కరెంటు చార్జీలు పెంచి సర్కారు రాష్ట్ర ప్రజల మీద రూ.32 వేల కోట్ల భారాన్ని మోపింది. ప్రజల రక్తాన్ని పిండైనా సరే బిల్లులు వసూలు చేయాలనుకుంటున్న ఈ ప్రభుత్వం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉంటే ప్రభుత్వం కూలిపోయి ఉండేది.. ప్రజల మీద కరెంటు భారం పడకుండా ఉండేది. కానీ అప్పుడేమో చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా అండగా నిలబడ్డారు. ఇప్పుడేమో కరెంటు చార్జీలు పెంచినందుకు నిరసనగా దీక్షలు చేస్తామంటూ నాటకాలు ఆడుతున్నారు. 

ఈ నాటకాలు ఎందుకు చంద్రబాబూ అని అడుగుతున్నా.. కుట్రలు, మోసాలు, నీచ రాజకీయాలతో ప్రజలను ఎంత కాలం మోసం చేస్తావు చంద్రబాబూ?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దాన్ని భుజాన మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సాగింది. డాబాకొట్ల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇదీ చంద్రబాబు నైజం..

‘‘రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రైతులకు మూడు గంటలు, పల్లెలకు నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నారు. పరిశ్రమలకు 15 రోజులు కూడా ఇవ్వడం లేదు. ఈ దెబ్బతో వేలకొద్దీ పరిశ్రమలు మూతపడి రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. కరెంటు బిల్లులేమో.. చూస్తేనే షాక్ కొడుతున్నాయి. మన ఖర్మ ఏమిటంటే ఒక వైపు అసమర్థ ప్రభుత్వం ఉంది, మరోవైపు పనికిరాని ప్రధాన ప్రతిపక్షం ఉంది. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో పల్లెలను పీల్చి పిప్పిచేశారు. ఇప్పుడేమో తాను అప్పటి చంద్రబాబును కానని, మారానని అంటూ అదే పల్లెల మీదుగా ఆయన పాదయాత్ర చేస్తున్నారు.

నిజమే కావచ్చని అనుకున్నాం.. ఈ పాలకుల ఏలుబడిలో ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెల్లో ప్రజలు పడుతున్న కష్టాలను ఆయన తన పాదయాత్రలో కళ్లారా చూశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి గద్దె దింపుతారని అనుకుంటే.. ఆయన అవిశ్వాసం పెట్టలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగా నిలబడి అది కూలిపోకుండా కాపాడారు. ఇదీ చంద్రబాబు నైజం.

ఆయనకు ముని శాపముందట..

నాన్నగారు ఎప్పుడూ ఒక మాట అంటుండే వారు. చంద్రబాబుకు ఒక మునీశ్వరుని శాపం ఉందట, ఆయన ఎప్పుడైతే నిజం చెప్తారో అప్పుడే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుందట. సినీ నటుడు చిరంజీవి బహిరంగంగానే ఆయన పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేసుకున్నారు. చంద్రబాబేమో.. తెర వెనుక నుంచి తన పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నారు. తన అవినీతి మీద విచారణ జరుపకుండా కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకుని చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు చంద్రబాబు. 

ఆయన ఎనిమిదేళ్ల ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా ఉండి 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. రూ. 50 ఉన్న హార్స్ పవర్ విద్యుత్‌ను రూ. 625 చేశారు. కరెంటు బిల్లులు కట్టని రైతులను శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. విద్యుత్తు చార్జీలు ప్రతి ఏటా పెంచుతానని, ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం పెట్టుకున్న దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన కరెంటు చార్జీలు పెంచినందుకు నిరసనగా వైఎస్సార్ నిరాహార దీక్షలు చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగి ముగ్గురు రైతులను పోలీసులు కాల్చి చంపారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించకుండా, వారిని కాల్చి చంపిన పోలీసులను పరామర్శించానికి వెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు.’’

11 కిలోమీటర్ల మేర యాత్ర..

103వ రోజు బుధవారం పాదయాత్ర కృష్ణాజిల్లా విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సహాయ సమన్వయకర్త జొన్నల శ్రీనివాసరెడ్డి రూపొందిన ‘ద లీడర్’ డైరీని షర్మిల ఆవిష్కరించారు. అక్కడినుంచి యాత్ర చేస్తూ పైపులరోడ్డు, ప్రకాష్ నగర్, శాంతినగర్, డాబాకొట్ల సెంటర్ మీదుగా జింఖానా గ్రౌండ్‌కు చేరుకున్నారు. డాబాకొట్ల సెంటర్‌లో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జింఖానా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.45 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 11 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,404.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, వంగవీటి రాధ, జలీల్‌ఖాన్, జ్యేష్ట రమేష్, పార్టీ నాయకులు తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, గౌతంరెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, తాడి శకుంతల, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, వైఎస్ కొండారెడ్డి, డాక్టర్ హరికృష్ణ తదితరులున్నారు. 

బెల్టు దుకాణాలు తెచ్చింది చంద్రబాబే..

‘‘రూ.2కే కిలో బియ్యం ఇస్తానని, పూర్తి మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్టీఆర్ రెండు వాగ్దానాలు చేశారు. ఆయన్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ రెండు పథకాలను తుంగలో తొక్కారు. ఇవాళ నేను పాదయాత్రలో వస్తుంటే కొంత మంది మహిళలు నన్ను కలిశారు. ‘అమ్మా... మా ఒక్క సెంటర్లోనే మూడు మద్యం దుకాణాలున్నాయి. మా మగోళ్లు చేసిన కష్టమంతా తాగుడుకే పోతోందమ్మా... ఇవి చాలవు అన్నట్లు ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులు ఉన్నాయమ్మా’ అని ఆవేదనతో చెప్పారు.

రాష్ట్రానికి బెల్టు దుకాణాలు తెచ్చింది చంద్రబాబే. ఆయన హయాంలోనే ఎక్కడ పడితే అక్కడ బెల్టు దుకాణాలు పెట్టించారు. అమ్మా... అయ్యా మీకు మాటిచ్చి చెప్తున్నాను. జగనన్న ముఖ్యమంత్రయిన తరువాత ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు. గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా ఉండేందుకు, మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరగకుండా ఉండేందుకు మహిళా పోలీసులను పెడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది.’’ -షర్మిల
Share this article :

0 comments: