చంద్రబాబు హయాంలోనే బీజం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు హయాంలోనే బీజం!

చంద్రబాబు హయాంలోనే బీజం!

Written By news on Friday, March 1, 2013 | 3/01/2013

టెండర్‌ను దక్కించుకుంది టీడీపీ సానుభూతిపరుడి సంస్థే
వైఎస్ సీఎం కాగానే వ్యతిరేకిస్తూ మహారాష్ట్రకు లేఖ
అన్ని పార్టీలతో చర్చించి సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వం


తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయానికి గొడ్డలిపెట్టుగా మారనున్న బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీజం పడింది. ఆయన హయాంలోనే గోదావరిపై ఈ ప్రాజెక్టును నిర్మించడానికి మహారాష్ర్ట ప్రభుత్వం పరిపాలన అనుమతిని ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించింది కూడా అప్పుడే. పైగా ఈ టెండర్‌లో పాల్గొని పనుల్ని దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ కూడా టీడీపీ సానుభూతిపరుడిదే. ఆ సమయంలోనే బాబ్లీని బాబు గట్టిగా వ్యతిరేకించినట్టయితే... ప్రస్తుతం ఈ నష్టం జరిగేది కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మహారాష్ర్టకు లేఖను రాయడంతోపాటు పనుల నిలుపుదల కోసం పలు ప్రయత్నాలు చేశారు. అన్ని రాజకీయ పక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్రపై ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో న్యాయపరంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా వాద ప్రతిపాదనలను విన్న సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పును వెల్లడించింది.

నోరు తెరవని బాబు!

అధికారంలో ఉన్నప్పుడు నోరు తెరవని తెలుగుదేశం పార్టీ నేతలు అధికారం కోల్పోగానే బాబ్లీపై ఆందోళన బాట పట్టడం గమనార్హం. స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే ఈ ఉద్యమానికి నేతృత్వం వహించి ప్రాజెక్టు సందర్శన పేరిట మహారాష్ర్టలోకి చొచ్చుకువెళ్లి అక్కడి పోలీసుల చేతుల్లో అరెస్టు నాటకం ఆడారు. చివరకు రాష్ర్ట ప్రభుత్వ ఖర్చులతో ఆయనను, టీడీపీ నేతలను విమానంలో రాష్ట్రానికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడే బాబ్లీని బాబు అడ్డుకుని ఉంటే... నేడు ఈ నష్టం జరిగి ఉండేది కాదని నిపుణులు విమర్శిస్తున్నారు. 
Share this article :

0 comments: