సీబీఐకి అంత స్వాతంత్య్రం ఉంటే ఐఎంజీ భూములు, ఎమ్మార్‌పై ఎందుకు విచారించదు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐకి అంత స్వాతంత్య్రం ఉంటే ఐఎంజీ భూములు, ఎమ్మార్‌పై ఎందుకు విచారించదు?

సీబీఐకి అంత స్వాతంత్య్రం ఉంటే ఐఎంజీ భూములు, ఎమ్మార్‌పై ఎందుకు విచారించదు?

Written By news on Thursday, March 21, 2013 | 3/21/2013

* స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్, టీడీపీలకు షర్మిల బహిరంగ సవాల్
* దమ్ముంటే అవిశ్వాసానికి మద్దతిచ్చిన 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఎన్నికలు పెట్టండి
* అధికారం ఉంది కదా అని సీబీఐని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు
* సీబీఐకి అంత స్వాతంత్య్రం ఉంటే ఐఎంజీ భూములు, ఎమ్మార్‌పై ఎందుకు విచారించదు?
* బొత్స మాఫియా డాన్ అని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తుంటే ఎందుకు వినిపించదు?
* కరెంటు సంక్షోభం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్య ఫలితమే
* రాష్ట్రంలో ప్రజల కన్నీళ్లు చూస్తూ కూడా చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతివ్వలేదు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు ముందుకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సవాలు విసిరారు. వైఎస్సార్ సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపి ప్రజాపక్షాన నిలిచిన 15 మంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి.. ఉప ఎన్నికలు నిర్వహించే దమ్ముందా అని రెండు పార్టీలకూ మరో సవాలు చేశారు. ఆ రెండు పార్టీలకూ ఆ దమ్ము లేదని, రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా గత ఉప ఎన్నికల ఫలితాలే వస్తాయని భయమని అన్నారు. ‘‘ఉప ఎన్నికలొస్తే పదిహేనుకు పదిహేను సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుపోతుందని వారికి తెలుసు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో లాగా కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవని వారికి హడల్. జగన్ నిర్దోషి అని ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారని వారికి భయం. తమకు ముఖ్యమంత్రిగా కిరణ్, చంద్రబాబు వద్దని, జగనన్నే సీఎంగా కావాలని ప్రజలు ఎలుగెత్తి చాటుతారని భయం. ఈ భయంతోనే కుట్రలు పన్ని జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టి జైల్లో పెట్టారు’’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో సాగింది. తెనాలి మార్కెట్ సెంటర్‌లో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

సీబీఐని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు..

‘‘అధికారం ఉంది కదా అని యూపీఏ ప్రభుత్వం.. సీబీఐని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటోంది. సీబీఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అని సీబీఐ మాజీ డెరైక్టరే స్వయంగా చెప్పారు. సీబీఐకి నిజంగా స్వాతంత్య్రమే ఉంటే.. ఐఎంజీ భూములు, ఎమ్మార్ పై ఎందుకు విచారణ చేయదు? సినీ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి బంధువుల ఇంట్లో రూ.70 కోట్లు మంచం కింద దొరికితే సీబీఐకి ఎందుకు కనిపించదు? పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తే అది సీబీఐకి ఎందుకు వినిపించదు? అమాయకుడైన జగనన్నను మాత్రం 10 నెలలకు పైగా జైల్లో పెట్టి ఉంచారు.

కారణం కిరణ్ నిర్లక్ష్యమే: ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరెంటు లేదు. ఎటు చూసినా కోతలే. వైఎస్ వాగ్దానం చేసిన 9 గంటలు కాదుకదా కనీసం 3 గంటలు కూడా ఈ ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వడం లేదు. ఆ వచ్చే 3 గంటలు కూడా రాత్రి వస్తుందో, పగలు వస్తుందో తెలియట్లేదు. అర్ధగంటకోసారి, గంటకోసారి వాళ్లకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తున్నారు. గ్రామాల్లో అయితే రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. ఇక పరిశ్రమల దుస్థితి వర్ణణాతీతం. నెలకు 12 రోజులు కరెంటు కోతలు విధించడంతో 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీనికంతటికీ కారణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. కేవలం కిరణ్ నిర్లక్ష్యం కారణంగానే, ఆయనకు ముందుచూపు లేకే రాష్ట్రం గతంలో ఎన్నడూ లేనంతగా కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కానీ కరెంటేదో 24 గంటలూ ఇస్తున్నట్టు ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో ప్రజల నెత్తిన రూ.32 వేల కోట్లు మోపి ప్రజల రక్తం పిండి వసూలు చేయాలని చూస్తోంది.

బాబూ.. ప్రజల కోసం కన్నీరు పెట్టావా?

మన ఖర్మేమిటంటే ఒకవైపు ఇంత అసమర్థ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే, మరోవైపు అంతే పనికిమాలిన చంద్రబాబు ప్రధానప్రతిపక్ష నేతగా ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి కష్టాలను విని భరోసా కల్పించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. రైతుల కష్టాలను చూసి తల్లడిల్లిపోయి మండే ఎండను కూడా ఎదిరించి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ యాత్ర చేశారు. ఇప్పుడు చంద్రబాబేమో.. నెత్తిన ఫ్యాను పెట్టుకుని, ఏసీల్లో ఉంటూ యాత్ర చేస్తున్నారు. పొద్దున పేపర్లో చూశా. చంద్రబాబు దగ్గరికి వాళ్ల పార్టీ నాయకుడొకరు వెళ్లి బాబుగారూ మాకోసం చాలా కష్టపడుతున్నారు అని బాధపడ్డారట. దానికి చంద్రబాబు కూడా అవును అని తన మీద తనే జాలి కురిపించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారట. చంద్రబాబూ మిమ్మల్ని ఒక్క మాటడుగుతున్నా. ప్రజల కష్టాలను చూసి మీరు ఒక్కసారైనా కన్నీళ్లు పెట్టుకున్నారా? రైతన్నల బాధలు చూసి ఒక్క కన్నీటి చుక్కైనా కార్చారా? ఆలోచించుకోండి. మీకే అర్థమవుతుంది. మీమీద ఎంత ప్రేముందో, రైతుల మీద ఎంత ప్రేముందో! మేమూ పాదయాత్రలు చేస్తున్నాం. అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను అమలు చేస్తామని గర్వంగా చెప్తున్నాం. చంద్రబాబూ.. నువ్వు అధికారంలోకి వస్తే నీ పాలనను మళ్లీ అందిస్తానని చెప్పే ధైర్యం నీకుందా? లేదు చెప్పలేవు. ఎందుకంటే నీ హయాంలో వేల మంది రైతులు అల్లాడిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని నీకు తెలుసు.

కాంగ్రెస్ సర్కారును గొడ్డళ్లతో నరకాలన్నావు..

ఈ సర్కారు పనికిరాదని, దుర్మార్గపు ప్రభుత్వమని, దీన్ని కత్తులు, గొడ్డళ్లతో నరకాలని తన పాదయాత్రలో చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇన్ని చెప్పి తీరా చేతల వరకు వచ్చేసరికి అవిశ్వాస తీర్మానంలో అసమర్థ, ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్నినెత్తిన పెట్టుకున్న చంద్రబాబు నాయకుడనాలా? ఊసరవెల్లి అనాలా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉందంటే ఆ పాపం చంద్రబాబుదే. బాబు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసులు విచారణ జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారు. ఈ రెండు పార్టీలకూ ఏమాత్రం ఆలోచన లేదు. నీతి, నిజాయితీల్లేవు. తెలిసిందల్లా కుమ్మక్కవడమే. మూడేళ్ల కిందట ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలుకొని నిన్నటి అవిశ్వాసం వరకు ప్రతి సారీ కుమ్మక్కవుతూనే ఉన్నారు.’’

13.6 కిలోమీటర్ల యాత్ర
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 96వ రోజు బుధవారం షర్మిల వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో 13.6 కిలోమీటర్లు నడిచారు. కూచిపూడి, పెదరావూరు, జగ్గడిగుంట, చినరావూరు, తెనా


Share this article :

0 comments: