పూజామందిరాలకు వెళ్లి చూడండి.. వైఎస్సార్ స్థానం ఏమిటో తెలుస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పూజామందిరాలకు వెళ్లి చూడండి.. వైఎస్సార్ స్థానం ఏమిటో తెలుస్తుంది

పూజామందిరాలకు వెళ్లి చూడండి.. వైఎస్సార్ స్థానం ఏమిటో తెలుస్తుంది

Written By news on Wednesday, March 6, 2013 | 3/06/2013

జగన్ కోసం - 284 రోజులు

వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి కుటుంబాన్ని ఈ రాజకీయ స్వార్థపరులు ఇంతగా వేధిస్తున్నారేమిటి?! ఒక్కణ్నీ చేసి ఒక తల్లి బిడ్డను కష్టాలపాలు చేస్తున్నారే... మీకంటూ కుటుంబం, పిల్లలు లేరా! ఒక్కసారి ఊహించండి... ఈ పరిస్థితి మీ పిల్లలకు వస్తే ఎలా ఉంటుందో. ఈ కుటిల నేతలకు నేను చేసే విన్నపం ఏమిటంటే - మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకండి. చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు, ఎల్లో మీడియా అందరూ కలసి ఆ మహానేతని ‘రాష్ట్రాన్ని కుమారుడికి దోచిపెట్టిన వ్యక్తి’గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నిజాలు ప్రజలకు తెలుసు. కులమతాలకు అతీతంగా ప్రజల మనసు దోచి కుమారుడికి ఇచ్చిన వై.ఎస్.గారికి ఈ రాష్ట్ర ప్రజలలో స్థానం ఎక్కడో తెలుసా? పాదయాత్ర చేస్తున్నారు కదా... మీరు గ్రామాలలోకి వెళ్లినప్పుడు ఇళ్లలోని పూజామందిరాలకు వెళ్లి చూడండి. 

వై.ఎస్. స్థానం ఎక్కడుందో మీకే తెలుస్తుంది. ఆయనని అభిమానించే రాష్ట్ర ప్రజలెవరూ ఇటీవలి క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండుగలు జరుపుకోలేదు. జగన్ గారు విడుదలైన రోజు పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామంలోను, ప్రతి కుటుంబంలోను ‘తమ ఇంటి మనిషిని జైల్లో పెట్టారు’ అనే భావన ప్రజలలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్థి పథంలో సాగాలన్నా, ప్రజలు సుఖసంతోషాలతో బతకాలన్నా జననేత జగనన్న విడుదల కావడం తప్ప వేరే దారి లేదు. 
- ఎ.వందన, పూతలపట్టు, చిత్తూరు

లక్షలాది కుటుంబాల ఆదరణ ఉంది!
నేను హౌస్‌వైఫ్‌ని. ఇంతకుముందు రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ వైయస్ రాజశేఖరరెడ్డిగారి అకాల మరణం తర్వాత మేమంతా ఆయన్ని జగన్‌లో చూసుకుంటున్నాము. వైయస్ ప్రవేశపెట్టిన పథకాలు సవ్యంగా, అవినీతి రహితంగా అమలు కావాలంటే అది ఒక్క జగన్‌కే సాధ్యం. అందుకే రాష్ర్టంలోని ప్రతి కుటుంబం జగన్‌ను సీఎంగా చూడాలనుకుంటోంది. అంతే తప్ప చంద్రబాబునో, ఇంకో బాబునో కాదు. ఇలా ఎందుకంటున్నానంటే - చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి కాని, ప్రజల కష్టాల గురించి కాని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అది చేస్తా, ఇది చేస్తా అని ప్రజల మధ్యకు వెళుతున్నాడు. 

నిజమైన నాయకుడు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాడు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. కాని చంద్రబాబు అలా చేయకుండా అధికార పార్టీతో కుమ్మక్కై జగన్‌ని జైలుకు పంపించారు. జగన్‌పై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా మచ్చలేని మహరాజులా జైలు నుండి బయటకు వస్తాడు. భర్త జైలులో ఉన్నా ధైర్యంగా ఉన్న భారతమ్మకు ప్రజల అండదండలు ఉన్నాయి. విజయమ్మ, షర్మిలకు లక్షలాది కుటుంబాల ఆదరణ ఉంది. షర్మిలమ్మ పాదయాత్రను మేము ఎన్నటికీ మరచిపోము. అడుగడుగునా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు ‘నేనున్నాను’ అని ధైర్యం చెప్పి, త్వరలో రాజన్న రాజ్యం వస్తుందన్న ధీమా ఇస్తున్న రాజన్న బిడ్డలా, జగనన్న చెల్లెలుగా ముందుకు సాగిపోతోంది.
- బి.సునీత, ఎమ్మిగనూరు, కర్నూలు
Share this article :

0 comments: