రాష్ట్రంలో ‘తెలుగు కాంగ్రెస్’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో ‘తెలుగు కాంగ్రెస్’

రాష్ట్రంలో ‘తెలుగు కాంగ్రెస్’

Written By ysrcongress on Tuesday, March 19, 2013 | 3/19/2013


రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం రెండూ కలిసిపోయాయని, ప్రస్తుతం అవి ‘తెలుగు-కాంగ్రెస్’గా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సోమవారం శాసనసభ ప్రారంభం కావడానికి ముందు వీరు కాంగ్రెస్-టీడీపీ కలగలిసిన కండువాలను మీడియా పాయింట్ వద్ద ప్రదర్శించారు. పసుపు రంగు సగం, మూడు రంగులు సగం కలిసిన కండువాలను వారు ప్రదర్శించడం అందరినీ ఆకర్షించింది.

ఈ కండువాలు ప్రస్తుతం అసెంబ్లీలో నెలకొన్న రాజకీయ పరిస్థితికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో అన్నారు. అవిశ్వాసం సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం నిస్సిగ్గుగా అధికార పక్షానికి కొమ్ముకాసిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ, సహకార ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎజెండా ఒక్కటే అని, అందుకే ఈ కండువాలు ప్రదర్శించామని అన్నారు. ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, అవిశ్వాసం సందర్భంగా రాష్ట్రప్రభుత్వానికి చంద్రబాబు ఆపన్న హస్తం అందించారని, ఇదేవిధంగా రెండు పార్టీలు కలిసి రానున్న ఎన్నికల్లో ‘తెలుగు-కాంగ్రెస్’గా పోటీ చేస్తాయని భూమన ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: