కోతలతో వేలకొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోతలతో వేలకొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి

కోతలతో వేలకొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి

Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013

ఈ కోతలతో వేలకొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి
లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు
సీఎంకు ముందు చూపు లేకనే రాష్ట్రంలో కరెంటు సంక్షోభం
31 మంది ఎంపీలున్నా మన రైతులకు ఒరిగింది శూన్యమే
ఈ కాంగ్రెస్ పెద్దలు ప్రతిరోజూ ఢిల్లీకి వెళ్లొస్తుంటారు..
అక్కడ మన రాష్ట్ర సమస్యలు మాత్రం చర్చించరు
ప్రజలను ప్రభుత్వం గాలికొదిలేసినా.. బాబు అవిశ్వాసం పెట్టరు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 78, కిలోమీటర్లు: 1,100.8
 ‘‘రైతులకు కనీసం మూడు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారో.. ఎప్పుడు తీస్తారో ఎవ్వరికీ తెలియదు. గ్రామాల్లో మహిళలంతా అల్లాడిపోతున్నారు. పొద్దంతా కష్టం చేసి రాత్రి పూట ఇంటికి వస్తే అరగంట కూడా కరెంటు ఉండట్లేదట. పొయ్యి వెలుతురుతోనే వంట చేసుకుంటున్నారట. ఇంతవరకు ఉన్న ఈ అనధికారిక కోతలు సరిపోవన్నట్టు సర్కారు మళ్లీ పల్లెల్లో అధికారికంగా విద్యుత్తు కోత పెట్టింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా 12 గంటల వరకు కరెంటు ఉండదట.. ఇదే జరిగితే పల్లెలన్నీ ఇక చీకట్లోనే ఉండిపోతాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోతలు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సాగింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

పరిశ్రమలెలా బతికేది?

‘‘పరిశ్రమలకు 12 గంటలు అధికారికంగానే కరెంటు కోతఉంది. ఇప్పుడు మళ్లీ కోత పెడతారట.. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో పరిశ్రమలు బతకగలవా? వేల కొద్దీ పరిశ్రమలు మూతపడుతున్నాయి... లక్షల మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్య ఇంత ఘోరంగా ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల, ఆయనకు ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ర్టం నుంచి 31 మంది ఎంపీలనిచ్చాం. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు బొత్స.. ఇతర కాంగ్రెస్ నాయకులంతా ఇక్కడి నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి ఇక్కడికి.. పైకీ.. కిందకీ రివ్వున తిరుగుతూనే ఉంటారు. అధిష్టానంతో ప్రజా సమస్యలు ప్రతీదీ చర్చిస్తామంటారు. మరి ఏ సమస్య గురించి చర్చించారని ఏ రోజూ కూడా ఏ ఒక్క నాయకుడూ చెప్పనే చెప్పరు. మన రాష్ట్రానికి విద్యుత్తు సమస్య ఉంటే దాన్ని పట్టించుకోరు.. గ్యాస్ అవసరం ఉంటే అది తీసుకురారు.. బొగ్గు కావాలంటే వినిపించుకోరు. ఢిల్లీలో వీళ్లు చర్చించేది ప్రజా సమస్యలు కాదు. వాళ్ల పదవులు ఎలా కాపాడుకుందామనే వాళ్ల చర్చలు ఉంటాయి. వీళ్లకు పదవిని కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధలో కనీసం 10 శాతం చూపించినా మన రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ప్రజలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినా.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాత్రం అవిశ్వాసం పెట్టరు.

సీఎం కిరణ్ ఆనందపడిపోయారట..

గోదావరి నదిపై మహారాష్ట్ర వాళ్లు బాబ్లీ ప్రాజెక్టు కట్టుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది కనక దాన్ని తొలగించడానికి వీలు లేదని, 2.7 టీఎంసీల నీళ్లు వాడుకోవచ్చని కోర్టు చెప్పింది. దానిగాను ఒక కమిటీని వేసిందట.. ఈ కమిటీలో ఒకరు మన రాష్ట్రం నుంచి కూడా ఉంటారట. ఆ కమిటీలో మన వాళ్లు కూడా ఒకరు ఉన్నారు కదా అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆనందపడిపోయారట... ఇందులో సంతోషపడాల్సిన విషయం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. పైరాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే మనకు నీళ్లు ఎలా వస్తాయని అడుగుతున్నా. నారాయణపూర్, ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులన్నింటినీ చంద్రబాబు హయాంలోనే కట్టారు. ఇవాళ గోదావరి నీళ్లయినా, కృష్ణా నీళ్లయినా మనకు రాలేదు అంటే అందుకు కారణం చంద్రబాబే.

చంద్రబాబుకు ఈ జన్మకు అర్థం కాదు..

చంద్రబాబుకు మాట ఇవ్వడం అంటే ఏమిటో..! ఆ మాట మీద నిలబడటం అంటే ఏమిటో ఈ జన్మకు అర్థం కాదు. బాబు 1999 ఎన్నికల్లో చాలా వాగ్దానాలు చేశారు. ప్రతి మహిళకూ బంగారు మంగళ సూత్రం ఇస్తానన్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకూ రూ. 5 వేలు డిపాజిట్ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకొస్తే.. పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.25 వేలు ఇస్తానని చెప్తున్నారు.’’

15.6 కిలోమీటర్ల యాత్ర..

శుక్రవారం 78వ రోజు పాదయాత్ర గుంటూరు జిల్లా కొండమోడు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి అనుపాలెం, చౌటప్పయ్యపాలెం, నందిరాజుపాలెం, నాగిరెడ్డిపాలెం మీదుగా బెల్లంకొండ మండల కేంద్రానికి చేరింది. ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఇక్కడే ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 15.6 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. షర్మిల వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, ఆర్‌కే, అంబటి రాంబాబు, తలశిల రఘురాం, స్థానిక నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, పి.గౌతంరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, వెంకటలక్ష్మీరాజ్యం, నన్నపునేని సుధ, బండారి సాయిబాబు మాదిగ, దేవళ్ల రేవతి, నూతలపాటి హన్మయ్య తదితరులు ఉన్నారు.

నిర్వాసితులకు అండగా ఉంటా

‘‘నేను పాదయాత్ర చేసుకుంటూ జిల్లాల వెంట తిరుగుతున్నప్పుడు చాలా మంది నిర్వాసితులు ‘ఇంకా మాకు నష్ట పరిహారం అంద లేదమ్మా’ అని చెప్పారు. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులు కూడా తమకు నష్టపరిహారం రాలేదని చెప్తున్నారు. జల ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన కుటుంబాలను ఈ రోజు వరకు కూడా సర్కారు పట్టించుకోలేదు. జగనన్న ద్వారా మళ్లీ రాజన్న రాజ్యం వచ్చినప్పుడు.. భూములిచ్చిన అన్ని కుటుంబాలకూ ఇళ్లయితేనేమి, నష్టపరిహారం అయితేనేమి, ఉద్యోగాలైతేనేమి.. అన్నీ తప్పకుండా అమలు చేస్తామని మాటిస్తున్నా.’’
- షర్మిల
Share this article :

0 comments: