వస్త్రవ్యాపారులకు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వస్త్రవ్యాపారులకు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు

వస్త్రవ్యాపారులకు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013

వస్త్ర వ్యాపారంపై విధిస్తున్న వ్యాట్‌ను ఎత్తేయాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర వస్త్ర వ్యాపారులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. పక్క రాష్ట్రాలు రాయితీలు ఇస్తుంటే ఇక్కడ మాత్రం వ్యాట్ పేరుతో వసూలు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం దిగి రాకుంటే మెడలు వంచతామంటూ వైఎస్సార్ సీపీ నేతలు హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వస్త్ర వ్యాపారుల సమస్యపై సోమవారం సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వ్యాట్ ఎత్తివేసే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాసులు స్పష్టం చేశారు.
Share this article :

0 comments: