జగన్ అంటే జనం గర్వించే నాయకుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అంటే జనం గర్వించే నాయకుడు

జగన్ అంటే జనం గర్వించే నాయకుడు

Written By news on Thursday, March 7, 2013 | 3/07/2013


జగనన్నకి... అన్నా! మీ మీద జరుగుతున్న కుళ్లు రాజకీయాలను చూసి మీకు ఉత్తరం రాయాలనుకున్నా! వైయస్ రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు పొగిడినవారే ఇప్పుడు అదే నోటితో ఆయన్ని తిడుతున్నారు. అవసరాన్ని బట్టి నాయకుల మనసు మారుతుంది. కానీ ఎప్పటికీ మారనిది ప్రజల విశ్వాసమే. అందుకే ప్రజలు ఈరోజున మీవైపున నిలబడ్డారు. అన్నా... నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు. కానీ వైఎస్సార్ చేసిన మంచి పనులు... అభయహస్తం, 108, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎన్నో జీవితాలకు ప్రాణం పోశాయి. ఎందరో నిరుపేదల కుటుంబాలను నిలబెట్టాయి. దాంతో మీ కుటుంబంపై మాకు ఆత్మీయత, అనుబంధాలు ఏర్పడ్డాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడ్డ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. మీరు సీఎం కావాలి.

నాన్నగారి ఆశయాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నడపాలి. ఒక మంచినాయకుడిగా, స్వార్థం లేకుండా సుపరిపాలన అందించాలి. మీ హయాంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉండాలని మా కోరిక. పరిశ్రమలు, వ్యవసాయం, విద్య... ఇలా అన్ని రంగాలను, అన్ని ప్రాంతాలను మీరే అభివృద్ధి చేయాలి జగనన్నా! మీరు వస్తే అంతా నాశనం అవుతుందని అంటున్న అబద్ధాలకోరు నాయకుల నోరు మూతపడేటట్లు మీరు అభివృద్ధి చూపాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప నాయకుడుగా మీరు నిలిచి ఉండాలని నా ఆకాంక్ష. జగన్ అంటే జనం గర్వించే నాయకుడు, జనం గురించి ఆలోచించే నాయకుడు అని మార్మోగిపోవాలి. యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించండి. సి.ఎం. పదవికి ఒక రోల్ మోడల్‌గా ఉండండి. నమ్మకద్రోహులైన కాంగ్రెస్ నాయకులను దగ్గరకు రానీయకండి.

- పవన్, అనంతపురం

ఆ చిరునవ్వే ఒక భరోసా...

ఈ రాష్ట్రంలో - తన మాటలతోనే కాదు, తన చిరునవ్వుతో కూడా ‘నేనున్నాను’ అనే భరోసా ప్రజలకు ఇవ్వగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జననేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. అటువంటి ప్రజానాయకుణ్ని కుట్రలు కుతంత్రాలతో నాలుగు గోడల మధ్య బంధించారు. అధికార పార్టీ, ప్రతిపక్షం ఒక్కటై ఇక తమకు భవిష్యత్ ఉండదని తెలిసి, ఢిల్లీ నుండి గల్లీ వరకు ఏకమై సీబీఐని అడ్డం పెట్టుకుని నిర్బంధించారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి గురించి. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం అన్నది ప్రజాసమస్యలపై పోరాడుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మూడు సంవత్సరాల నుండి పోరాడుతోంది.

తనకు అండగా ఉన్న ఎల్లో మీడియాతో నిత్యం తప్పుడు రాతలు రాయిస్తూ జగన్‌కి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని చూస్తోంది. చంద్రబాబుకి బాగా తెలుసు జగన్‌ని గెలవటం అసాధ్యమని! అందుకే ‘వస్తున్నా మీ కోసం’ అంటూ వెళ్లి ప్రజలకు అబద్ధాలు చెపుతున్నారు. చంద్రబాబు పదేపదే చెప్పే డైలాగ్- ‘ఎన్టీయార్‌ను చూస్తే తెలుగుజాతి ఆత్మగౌరవం గుర్తుకొస్తుందని’! అది నిజం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ఒప్పుకుంటారు. మరి చంద్రబాబుగారిని చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఆయనే చెప్తే బాగుంటుంది. ఏముంది చెప్పుకోడానికి? వెన్నుపోటు రాజకీయం తప్ప.

- గుత్తాల క్రాంతి కిరణ్, చల్లపల్లి, ఉప్పులగుప్తం
Share this article :

0 comments: