కన్నడ కథనాలపై న్యాయమూర్తి ఆగ్రహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కన్నడ కథనాలపై న్యాయమూర్తి ఆగ్రహం

కన్నడ కథనాలపై న్యాయమూర్తి ఆగ్రహం

Written By news on Thursday, March 14, 2013 | 3/14/2013


బెంగళూరు: కన్నడ పత్రికల్లో వచ్చిన కథనాలతో తమకు సంబంధంలేదని సీబీఐ ప్రత్యేక కోర్టుకు డీఐజీ హితేంద్ర వెల్లడించారు. కన్నడ పత్రికల్లో ప్రచురించిన విచిత్ర కథనాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కథనాలపై కోర్టుకు సీబీఐ డీఐజీ హితేంద్ర వివరణ ఇచ్చారు. ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డికి తాము అలాంటి ప్రశ్నలు వేయలేదని డీఐజీ హితేంద్ర తెలిపారు.

'కన్నడ పత్రిక కథనం ఎలా రాసిందో మాకు తెలీదు' అని సీబీఐ డీఐజీ హితేంద్ర తెలిపారు. కన్నడ పత్రికలో వచ్చిన కథనం ఓ రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోందన్నారు. గాలి జనార్దనరెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తున్న సమయంలో ఇలాంటి కథనాలపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ రాజకీయపార్టీకి 500 కోట్లు ఇచ్చారంటూ కథనం ఎలా వచ్చిందని సీబీఐ డీఐజీ హితేంద్రను జడ్జి ప్రశ్నించారు.

నిందితుడిని అలా ప్రశ్నించారా? అతడు అలా సమాధానం చెప్పారా, కోర్టు పరిధిలో ఈ అంశం ఉండగా పత్రికలు కథనాలు ఎలా రాస్తున్నాయని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత గాలిజనార్దన రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీబీఐ తనను ఆ ప్రశ్నే అడగలేదని గాలి తెలిపారు. మీడియా ఈర్ష్యాద్వేషాలతో వ్యవహరిస్తోందని, అవసరమైతే పత్రికలపై చర్యలకు వెనకాడొద్దని సీబీఐని కోర్టు ఆదేశించింది.
Share this article :

0 comments: