మీరు చేస్తున్న పాదయాత్రలో రైతుల కష్టాలు, కన్నీళ్లు మీకు కనపడడం లేదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీరు చేస్తున్న పాదయాత్రలో రైతుల కష్టాలు, కన్నీళ్లు మీకు కనపడడం లేదా?

మీరు చేస్తున్న పాదయాత్రలో రైతుల కష్టాలు, కన్నీళ్లు మీకు కనపడడం లేదా?

Written By news on Tuesday, March 5, 2013 | 3/05/2013

 ‘‘పాదయాత్ర చేస్తూ వస్తుండగా.. ఓ అక్క.. జొన్న తీసుకొచ్చి నాకు చూపించింది. ‘కరెంటు లేదమ్మా.. నీళ్లు లేక కంకి ఎదగలేదు.. ఇది ఎందుకూ పనికి రాదు. కనీసం పశువులకైనా పనికొస్తుందేమోనని కోసుకుపోతున్నానమ్మా’ అని చెప్పింది. పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాలో నన్ను కలిసిన ఓ రైతు కూడా ఇదే గోడు చెప్పుకొన్నాడు. ‘తొమ్మిదేళ్లుగా బత్తాయి మొక్కలను సొంత బిడ్డలా పెంచుకున్నాను. మూడేళ్లుగా కరెంటు లేక చెట్లు ఎండిపోతే నా చేతులతోనే అగ్గి పెట్టానమ్మా’ అని ఆయన కన్నీళ్లు పెట్టాడు. అయ్యా చంద్రబాబు నాయుడూ మీరు కూడా పాదయాత్ర చేస్తున్నారు. మీరు చేస్తున్న పాదయాత్రలో రైతుల కష్టాలు, కన్నీళ్లు మీకు కనపడడం లేదా? .. మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు.. ప్రతి నాయకుడు(విలన్)గా ప్రజల దృష్టిలో చులకనైపోతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగింది. 

షర్మిల పాద యాత్ర చేస్తున్న దారిలోనే సత్తెనపల్లి తాలూక సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేస్తుండటంతో ఆమె కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు.మహాధర్నాలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్‌కే, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ముదునూరి ప్రసాదరాజు, తలశిల రఘురాం, ఎంవీఎస్ నాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, రావి వెంకటరమణ, మేరుగ నాగార్జున, స్థానిక నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్, విజయ భాస్కర్‌రెడ్డి, బండారు సాయిబాబు, నన్నపనేని సుధ, అన్నాబత్తుని సదాశివరావు, హన్మంతు నాయక్, సయ్యద్ మాబు, షేక్ షౌకత్ తదితరులు ఉన్నారు.

సోమవారం 81వ రోజు పాదయాత్ర సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి ముస్లిం బజార్, 5 లాంతర్ల సెంటర్, గడియార స్తంభం మీదుగా తాలూకా సెంటర్ చేరుకుని షర్మిల.. మహాధర్నాలో పాల్గొన్నారు. అక్కడి నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా నడుస్తూ రాత్రికి వెంకటపతి నగర్‌లో ఏర్పాటుచేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. యాత్రలో మొత్తం 6.2 కిలోమీటర్లు నడిచారు. 
Share this article :

0 comments: