రాష్ట్రంలో రెండు పార్టీలే ఉండాలట.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో రెండు పార్టీలే ఉండాలట..

రాష్ట్రంలో రెండు పార్టీలే ఉండాలట..

Written By ysrcongress on Friday, March 15, 2013 | 3/15/2013

అసలు నువ్వు ప్రతిపక్షమా? లేక పాలక పక్షమా?
నీ పార్టీ కళ్లెం ప్రభుత్వం చేతుల్లో ఉందా?
ఎన్నికలొస్తే డిపాజిట్లు రావని జంకుతున్నావా?
నీ పార్టీ ఎమ్మెల్యేల సీట్లు 80 నుంచి 8కి పడిపోతాయని భయమా?
పాదయాత్ర పేరుతో వేల కిలోమీటర్లు నడుస్తున్నావ్.. 
ప్రజలు పడుతున్న కష్టాలు నీ కంటికి కనిపించడం లేదా?
కళ్లకు గంతలు కట్టిన గుర్రంలా వ్యవహరిస్తున్నావ్
అవిశ్వాసానికి మద్దతు తెలపకుంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్
కాంగ్రెస్, టీడీపీలు మట్టిగొట్టుకుపోయే రోజు త్వరలోనే వస్తుంది
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 90, కిలోమీటర్లు: 1,239.5

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘కరెంటు బిల్లులు, కోతలు, నిత్యావసర ధరలతో కాల్చుకుతింటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తమకొద్దని ప్రజలు నినదిస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిందేనని మెజారిటీ పార్టీలన్నీ ముక్తకంఠంతో చెప్తున్నాయి. అయినా సరే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అవిశ్వాసం పెట్టనంటే పెట్టనంటున్నారు. చంద్రబాబూ ఒక్క మాట చెప్పు.. అసలు నువ్వు ప్రతిపక్షమా? పాలక పక్షమా? నువ్వు ఒక్కసారైనా ప్రజల పక్షాన నిలబడలేవా? అసలు ఎందుకు చంద్రబాబూ.. నువ్వు అవిశ్వాసం పెట్టనంటున్నావ్?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిలదీశారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోతే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి డిపాజిట్లు రావని, నీ పార్టీఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుత 80 నుంచి 8కి పడిపోతుందని భయపడుతున్నావా? అని ఆమె చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 

చంద్రబాబు తన మీద ఉన్న కేసుల భయంతోనే కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. సినీ నటుడు చిరంజీవి తన పార్టీని బహిరంగంగానే కాంగ్రెస్‌లో కలిపేస్తే.. చంద్రబాబు మాత్రం తెరచాటున తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ పాలక పక్షానికి భజన చేయడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారని షర్మిల నిప్పులు చెరిగారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయూలకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయూత్ర గురువారం గుంటూరు జిల్లా తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గం నల్లపాడులో షర్మిలకు అఖండ స్వాగతం లభించింది. కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. నల్లపాడు కూడలిలో అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. 

రాష్ట్రంలో రెండు పార్టీలే ఉండాలట..

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీలే ఉండాలట. మూడో పార్టీ రాకూడదట. కాంగ్రెస్‌పై విసుగొస్తే తెలుగుదేశానికి, టీడీపీపై విరక్తి వస్తే కాంగ్రెస్‌కు ఓటేసే అనివార్యాన్ని ప్రజలకు కల్పించాలట. అందుకే ఆ రెండు పార్టీలు కలిసి జగనన్నపై కుట్ర పన్ని జైల్లో పెట్టారుు. జగనన్న బయటకొచ్చే రోజు దగ్గరలోనే ఉంది. కాంగ్రెస్, టీడీపీలు మట్టిగొట్టుకుని పోయే రోజులొస్తారుు. దీన్ని ఆపడం ప్రత్యర్థి పార్టీల తరం కాదు’’ అని షర్మిల అన్నారు.

కురిసిన పూలవాన..

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయూత్ర 90వ రోజు గురువారం తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సాగింది. మేడికొండూరు మండలం యూనివర్సల్ కళాశాల నుంచి యూత్ర ప్రారంభించిన షర్మిల పేరేచర్ల, శ్రీనివాస కాలనీ, వెంగళరావుపాలెం, నల్లపాడు మీదుగా 10.9 కిలోమీటర్లు నడిచారు. నల్లపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి గురువారం రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. అంతకుముందు షర్మిల యూత్రకు దారిపొడవునా అఖండ స్వాగతం లభించింది. బంతి, గులాబీ పూలవాన కురిసింది. వేలకొద్దీ అభిమానులు, కార్యకర్తలు యూత్రలో పాల్గొనడంతో ట్రాఫిక్ స్తంభించినా ప్రజలు పట్టించుకోకుండా షర్మిలను చూసేందుకు తరలివచ్చారు. యూత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి, స్థానిక నేతలు మర్రి రాజశేఖర్, దేవళ్ల రేవతి, కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఈపూరి అనూప్, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, రావివెంకట రమణ, బండారు సాయిబాబు మాదిగ తదితరులున్నారు.


బాబూ.. చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్...

‘‘తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎంత? చస్తే ఎంత? చార్జీల మీద చార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతూ కర్కశంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాల్సిన బాధ్యత ప్రతిపక్ష తెలుగుదేశంపై ఉన్నా స్పందించదు. పైగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారపక్షానికి గొడుగుపడుతున్నారు. అవిశ్వాసం పెట్టమని కోరుతున్న ఇతర పక్షాలపై బురదజల్లుతున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇలాంటి దుస్థితి తలెత్తడం ఇదే తొలిసారి. పుట్టెడు కష్టాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. పాదయూత్ర పేరిట వేల కిలోమీటర్లు నడుస్తున్నప్పుడైనా.. వారి కష్టాలు నీకు కనబడడం లేదా చంద్రబాబూ? దారికి ఇరువైపులా కనబడకుండా గుర్రం కళ్లకు గంతలు కట్టినట్టు చంద్రబాబు కూడా గంతలు కట్టుకుని నడుస్తున్నారు. 

నడుస్తున్నది బాబైనా.. నడిపిస్తున్నది కాంగ్రెస్సే. చెప్పు చంద్రబాబూ.. నీ పార్టీ కళ్లెం అధికార కాంగ్రెస్ చేతిలో ఉందా? అవినీతి కేసుల్లో అరెస్టుల భయంతోనే నువ్వు అధికార కాంగ్రెస్ చెప్పినట్టు ఆడుతున్నావా? చంద్రబాబూ.. నువ్వు వైఖరి మార్చుకుని అవిశ్వాసానికి మద్దతు పలకకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావ్. ఒక రాజకీయ నాయకుడు ఎంతగా దిగజారగలడో అంతగా చంద్రబాబు దిగజారిపోయూరు. కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు ఇదే తొలిసారి కాదు. ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. సహకార, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జతకట్టారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్సార్ సీపీని ఎదుర్కొంటారుు.’’
- షర్మిల
Share this article :

0 comments: