జగన్ ప్రజల మధ్య ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ప్రజల మధ్య ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది

జగన్ ప్రజల మధ్య ఉంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది

Written By news on Thursday, March 28, 2013 | 3/28/2013


కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని రీతిగా నామరూపాలు లేకుండా పతనమైపోయిన సమయంలో వైఎస్సార్ సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టంగట్టారు. అదంతా వై.ఎస్. కృషి ఫలితమేనని హైకమాండ్ సహా రాష్ట్ర నాయకులంతా పూర్తి విశ్వాసంతో వైఎస్సార్‌ను సీఎంను చేశారు. అప్పటినుండి వై.ఎస్.గారి పాలనాదక్షత, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను మరోసారి గెలిపించారు. రెండోదఫా కూడా ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానమే కాంగ్రెస్‌ను గెలిపించింది. ఇక కాంగ్రెస్‌కు ఢోకాలేదని అంతా అనుకుంటున్న సమయంలో వైఎస్సార్ హఠాన్మరణంతో రాష్ట్రమంతా నిర్ఘాంతపోయింది. వై.ఎస్. కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.

ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ తన తండ్రి చేసిన సేవలను కొనసాగించేందుకు జగన్ మంచి హృదయంతో ముందుకొచ్చినప్పటికీ కొంతమంది నాయకుల మాటలు నమ్మి, హైకమాండ్ ఆయనను ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేసింది. ఓదార్పుయాత్రకు అవరోధాలు కల్పించింది. చివరకు జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టి, కనీసం బెయిల్ కూడా రానివ్వకుండా చేస్తోంది. ప్రజలందరూ ఈ వాస్తవాన్ని గ్రహించారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదామా అని ఎదురుచూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం వాస్తవాన్ని గ్రహించి జగన్‌ను జైలు నుండి విడుదల చేస్తేనే అరకొర సీట్లైనా దక్కుతాయి. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని మన్నించి జగన్‌ని విడుదల చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినపార్టీగా కాంగ్రెస్ మరోసారి చరిత్రకెక్కుతుంది.

- బ్రదర్ జోసెఫ్, ఏలూరు
Share this article :

0 comments: