అర్ధంకాని బాబు అంతరార్ధం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అర్ధంకాని బాబు అంతరార్ధం: విజయమ్మ

అర్ధంకాని బాబు అంతరార్ధం: విజయమ్మ

Written By news on Friday, March 15, 2013 | 3/15/2013

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమయం వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించకుండా ఉండటంలో అంతరార్ధం ఏమిటో అర్ధం కావడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత విజయమ్మ అన్నారు. శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో ఆమె మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం బాధగా ఉందన్నారు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ కుమ్మక్కయ్యాయని ఆమె విమర్శించినప్పుడు ఆ రెండు పార్టీల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్దిసేపు అంతరాయం కలిగించారు. 

విజయమ్మ ప్రసంగం.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టే సమయం వచ్చినప్పుడు తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించకుండా ఉండటంలో అంతరార్ధం ఏమిటో అర్ధం కావడంలేదు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ కుమ్మక్కయ్యాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షం విప్ జారీ చేయడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. రాష్ట్రం గతంలో ఎన్నడూ ఎదుర్కోనంత విద్యుత్ కోతను ఎదుర్కొంటోంది. పరిశ్రమలు భారీగా నష్టపోతున్నాయి. అధికారికంగా విధించిన కోతకు మించి పరిశ్రమలకు విద్యుత్ కోత అమలు చేస్తున్నారు. పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయారు. చిన్న పరిశ్రమల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వారు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పట్టణాలలో, గ్రామాలలో విద్యుత్ ఎప్పుడు తీస్తారో, ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచితంగా విద్యుత్ ఇచ్చినవారికి కూడా ఇప్పుడు భారీగా బిల్లులు వస్తున్నాయి. పరిశ్రమలు తీసుకున్న రుణాల చెల్లింపు వాయిదా వేయాలి. 
ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. పేద ప్రజలకు ఇస్తానన్న బియ్యం కోటాను 30 కిలోలకు పెంచలేదు. 
వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అమలు చేయడంలేదు. విద్యుత్ విషయంలో బొగ్గులేదు, నీరు లేదంటున్నారు. గ్యాస్ ఆధారంగా పని చేసే, బొగ్గుపై నడుస్తున్న విద్యుత్ కేంద్రాల పరిస్థితి ఏమిటి? విద్యుత్ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఏ ప్రయత్నం చేయలేదు. బొగ్గు దిగుమతిపై ఎందుకు దృష్టిపెట్టలేదు?. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా రాష్ట్రాన్ని అంథకారంలో నెట్టివేశారు. గ్యాస్ సరఫరాలో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు.
ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ నుంచి వచ్చింది? వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. అది దేశంలోనే రికార్డ్. ఈ ప్రభుత్వం ఛార్జీలను దారుణంగా పెంచింది. గతంలో వాడుకున్న విద్యుత్ కు కూడా సర్ ఛార్జీ విధించారు. 

పెట్రోల్, డీజిల్ ధరలు తరచూ పెంచేశారు. గ్యాస్ ధర పేదలు కొనలేనంతగా పెరిగింది. ఆర్టీసి బస్ ఛార్జీలు, ఇంటిపన్నులు పెంచేశారు. రైతులకు మద్దతు ధర లభించడంలేదు. అకాల వర్షాలతో భారీగా నష్టపోయారు. 
Share this article :

0 comments: