దుర్భరమైన ప్రజల బతుకు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దుర్భరమైన ప్రజల బతుకు: షర్మిల

దుర్భరమైన ప్రజల బతుకు: షర్మిల

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

రాష్ట్రంలో ప్రజల బతుకులు దుర్భరమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. అప్పులతో రైతులు చాలా కష్టాలుపడుతున్నారు. ప్రతి పల్లెలో మహిళలు కన్నీరు పెడుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు. రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడంలేదు. పిల్లలకు ఫీజులు కూడా చెల్లించడం కూడా కష్టమవుతోందని వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. విద్యార్థులు చదువుకోవడానికి విద్యుత్ ఉండటం లేదు. పరిశ్రమలు మూతబడి కార్మికులు రోడ్డున పడ్డారని వివరించారు. విద్యుత్ గురించి అడిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిటికీలు, తలుపులు తెరిచి పడుకోమని చెబున్నారు. వైఎస్ బతికి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవికావు. అన్నివర్గాల వారి గురించి వైఎస్‌ఆర్ ఆలోచించారు. అందుకే అందరి గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. విద్యుత్, గ్యాస్, ఆర్టీసీ ఛార్జీలను ఒక్క రూపాయి కూడా వైఎస్‌ఆర్ పెంచలేదు. ఒక్క పన్నుకూడా వేయకుండానే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు చంద్రబాబే కదా అటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యేల చేత దీక్షచేయించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకొచ్చింది? విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు పోరాటం చేయడం విడ్డూరం కాదా? 50 రూపాయలున్న హార్స్‌పవర్ 625 రూపాయలు చేసింది చంద్రబాబు కాదా? ప్రతిఏటా విద్యుత్ ఛార్జీలు పెంచుతామని వరల్డ్‌ బ్యాంకుతో చంద్రబాబు ఒప్పందం చేసుకోలేదా? రైతులపై విద్యుత్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను చంద్రబాబు పెట్టలేదా? చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను పెంచితే వైఎస్ఆర్ 13 రోజులు ఆమరణ దీక్ష చేశారని షర్మిల గుర్తు చేశారు. విద్యుత్ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించలేదు. ఇప్పుడు ఏముఖం పెట్టుకుని చంద్రబాబు పోరాటంచేస్తున్నారు? విద్యుత్ ఛార్జీలపైనా, ఉచిత విద్యుత్‌పైనా చంద్రబాబు వైఖరేంటి? అవసరమైనప్పుడల్లా ఛార్జీలు పెంచాలని చంద్రబాబు తన పుస్తకంలో రాయలేదా? ఉచిత విద్యుత్ బట్టలు ఆరేసుకోడానికే అని చంద్రబాబు అన్నారు. అప్పుడు అలా మాట్లాడి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న చంద్రబాబును ఏమనుకోవాలి? తనది రెండు నాల్కల ధోరణనని చంద్రబాబే నిరూపించుకుంటున్నారు. చంద్రబాబు ముందు ఊసరవెల్లి కూడా చిన్నబోతుంది. అవిశ్వాసంలో చంద్రబాబు కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. సర్కారు మోపిన 32 వేల కోట్ల రూపాయల భారానికి చంద్రబాబు ఆమోదం తెలపలేదా? ఈ భారం పాపం చంద్రబాబునాయుడుదే. చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలవల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
Share this article :

0 comments: