తల్లుల ఆశీర్వాదంతో జగన్ త్వరలోనే బయటికి వస్తారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తల్లుల ఆశీర్వాదంతో జగన్ త్వరలోనే బయటికి వస్తారు

తల్లుల ఆశీర్వాదంతో జగన్ త్వరలోనే బయటికి వస్తారు

Written By ysrcongress on Sunday, March 17, 2013 | 3/17/2013

ఏమైపోతోంది దేశం? వై.ఎస్. కుటుంబం మీద ఈ ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి కుమ్మక్కయ్యి, కుట్ర పన్ని జగన్‌ను జైలుపాలు చేశారని చిన్నపిల్లాణ్ని అడిగినా చెబుతాడు. ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందంటే కేవలం అది వైఎస్సార్ వల్లే. ప్రజలు ఆయనను చూసి గెలిపించారు కానీ, కాంగ్రెస్‌ని చూసి కాదు. అలాంటి ఆ మహానాయకుడి కుటుంబం మీద ఎంత బురద చల్లినా, ఎన్ని నీచమైన నిందలు వేసినా ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం వై.ఎస్. కుటుంబ ప్రతిష్ట ప్రకాశిస్తూనే ఉంటుంది. జగన్ ప్రజాబలంతో జైలు గోడలను దాటుకుని కడిగిన ముత్యంలా విజయవంతంగా బయటికి వస్తాడు. ఆ తర్వాత ఇలా కుట్రలు చేసినవారంతా కొట్టుకుపోవడం ఖాయం. కులమతాలకు అతీతంగా ప్రతి మహిళా... జైల్లో ఉన్నది తన బిడ్డేనని భావిస్తున్నారు. జగన్‌ని బయటికి తీసుకురావాలని ప్రతి తల్లీ కోరుకుంటోంది. ఆ తల్లుల ఆశీర్వాదమే జగన్‌ని బయటకు తీసుకువస్తుంది. 

- లీలావతి రాథోడ్, హైదరాబాద్

బాబుగారు ఎంత పరితపించినా...ప్రజాభిమానం జగన్‌బాబు పైనే!

చంద్రబాబునాయుడు నేడు సీఎం కుర్చీ కోసం మూడోసారి విపరీతంగా తపన పడుతున్నారు. అలుపెరగని బాటసారిలా పడుతూ లేస్తూ పాదయాత్రలు చేస్తున్నారు. ఎప్పుడూ లేని ప్రేమానురాగాలను ప్రజలపై కురిపిస్తున్నారు. గతంలో తన పాలనలో ఏ విషయాలైతే వ్యతిరేకించి, ఎదుటివారిని కించపరిచి, దుర్భాషలాడి, ప్రజలను తుపాకీ గుళ్లకెలాగైతే బలిచేశాడో... అలా వాటినే ఇప్పుడు హామీలుగా ఒలకబోస్తున్నారు. తన శత్రువర్గమైన కాంగ్రెస్ సర్కారుతో స్నేహం చేస్తూ, వాటాలు పంచుకున్నట్లు ఎలక్షన్లలో సీట్లు పంచుకుంటున్నారు. పార్టీ సిద్ధాంతాలకు నైతిక విలువలకు చెయ్యిచ్చి, కాంగ్రెస్ చేయి అందుకున్నారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి అధిష్టానాన్ని మేనేజ్ చేస్తూ జగన్‌ని జైలు నుంచి బయటకు రానీయకుండా, తాను జైల్లోకి పోకుండా ఉండేందుకు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఈ వికృతాలకు ఏదో ఒకరోజు ఫుల్‌స్టాప్ పడుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది.

సొంత మామనే కుర్చీలోంచి పడగొట్టించిన ఈ అల్లుడు మహానుభావుడు... వైఎస్సార్‌ని దించటానికి, చేతికి తడి అంటకుండా ప్రయత్నించారనడానికి... ఆయన కుట్రలు, మోసాలు, దగాలు, అబద్ధాలు, భూకబ్జాలు, బినామీ ఆస్తులు, అబద్ధపు ప్రకటనలు, చీకటి భాగోతాలే నిదర్శనమని తెలుగు ప్రజలు నమ్ముతున్నారు. అందుకే బాబుగారూ... మీరెన్ని పిల్లిమొగ్గలు వేసినా, తిరిగి ముఖ్యమంత్రి కాలేరు. మీరే కాదు. కాంగ్రెస్‌వారూ కాలేరు. అది జగన్ ఒక్కరికే సాధ్యం! 

- కింజారపు కూర్మినాయుడు, శ్రీకాకుళం

రాష్ట్ర ప్రజల ఆశాకిరణం జగన్ ఒక్కరే

అధికారపక్షం అడుగులకు మడుగులు ఒత్తుతూ, కాంగ్రెస్‌ను సైకిల్ వెనుక కూర్చోబెట్టుకుని రొప్పుతూ, ఒగరుస్తూ ఫెడల్ తొక్కుతున్నారు. అన్ని పార్టీలూ ఏకమై అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా నిస్సిగ్గుగా పక్కకు తప్పుకున్న పెద్దమనిషి చంద్రబాబు నాయుడు!

స్వార్థపరత్వం తప్ప మానవత్వం లేని కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి వెన్ను విరిచేలా ధరలు పెంచుకుంటూ పోతోంది. కాంగ్రెస్ అవలంబిస్తున్న ఈ ప్రజావ్యతిరేక ధోరణితో సామాన్య మానవుడు బతకడమే కష్టమైపోయింది. వై.యస్ బతికున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కొండంత అండ ఉండేది. ధైర్యం, భరోసా ఉండేవి. వైయస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీయండి, మరే పథకమైనా కానీయండి వాటివల్ల ప్రజలకు ఒక ధీమా ఉండేది. ఇప్పుడా పథకాలనన్నింటినీ కాంగ్రెస్ నాయకులు క్రమక్రమంగా తుంగలో తొక్కేస్తున్నారు. 

ఈ స్థితిలో ప్రజలకు కనిపిస్తున్న ఆశాకిరణం జగన్ ఒక్కరే. వై.ఎస్. తర్వాత అంతటి మానవత్వం, కరుణ ఉన్న సమర్థుడైన నేతగా ప్రజల ముందుకు వచ్చిన జగనన్న... ‘మీకు నేనున్నాను’ అని చేతల్లో చూపించారు. ఆ యువనాయకుడికి ప్రతి పల్లె, ప్రతి గ్రామం హారతిచ్చి ఆహ్వానం పలికింది. తమ హృదయంలో ఉన్నత స్థానం ఇచ్చింది. అది చూసి ఓర్వలేకపోయిన కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని జైల్లో పెట్టించింది. ఆ వెంటనే ది గ్రేట్ చంద్రబాబు నాయుడు జగనన్నపై ఆరోపణలకు దిగారు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు లేనిపోనివన్నీ కల్పించి దుష్ర్పచారం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. 

అధికారపక్షం అడుగులకు మడుగులు ఒత్తుతూ, కాంగ్రెస్‌ను సైకిల్‌వెనుక కూర్చోబెట్టుకుని రొప్పుతూ, ఒగరుస్తూ పెడల్ తొక్కుతున్నారు. అన్ని పార్టీలూ ఏకమై అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా నిస్సిగ్గుగా పక్కకు తప్పుకున్న పెద్దమనిషి చంద్రబాబు నాయుడు! కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కైనట్లు ఈ పరిణామంతో మరోసారి స్పష్టమయింది. జగన్‌ను జైలుకు పంపడానికి ఈ రెండు పార్టీలూ కలసి సి.బి.ఐ.ని వాడుకున్న విషయం కూడా తేటతెల్లమయింది. వీరి కుట్రలకు, కుతంత్రాలకు, కుటిల రాజకీయాలకు ఇక ఎన్నికలే విరుగుడు. 2014లో జరిగే ఎన్నికల్లో జగన్‌పై తమ అభిమానాన్ని, ఆయన పట్ల విధేయతను చాటుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు కూడా సిద్ధం కావలసిందే... చరిత్రహీనులయేందుకు!

- రొడ్డ రమేష్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్
Share this article :

0 comments: