బాబు ఆపన్న ‘హస్తం’! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు ఆపన్న ‘హస్తం’!

బాబు ఆపన్న ‘హస్తం’!

Written By ysrcongress on Wednesday, March 13, 2013 | 3/13/2013

* టీఆర్‌ఎస్ అవిశ్వాసానికి మద్దతిచ్చేది లేదు
* టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ
* టీఆర్‌ఎస్ లేఖ అందగానే టెలి కాన్ఫరెన్స్ డ్రామా
* అవిశ్వాసాన్ని పట్టించుకోవద్దని నేతలకు ఆదేశం
* స్థానిక ఎన్నికలు ఎదుర్కోలేకే టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ అవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చాయన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
* కిరణ్ మాటలనే బాబు కూడా అందుకున్న వైనం
* మరోసారి బయటపడ్డ కాంగ్రెస్-టీడీపీ ఫిక్సింగ్ 

‘‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనలేకే టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ కలిసి అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చాయి. ఇలాంటప్పుడు అవిశ్వాసానికి తెలుగుదేశం పార్టీ మద్దతివ్వాల్సిన అవసరం లేదు’
- బాబు


‘‘సహకార ఎన్నికల ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వస్తాయేమోనని టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ భయపడుతున్నాయి. అందుకే రెండూ కలిసి కుట్ర పన్ని ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తున్నాయి’’
- సీఎం
 

 తెర పూర్తిగా తొలగింది. కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న పాలక, ప్రధాన ప్రతిపక్షాల మ్యాచ్‌ఫిక్సింగ్ మరోసారి బాహాటంగా బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరకాలుగా విఫలమైందని, దానికి ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత లేదని కొద్ది నెలలుగా పాదయాత్ర పొడవునా దుయ్యబడుతున్న చంద్రబాబు... తీరా సమయం వచ్చేసరికి తన అసలు రంగును బయట పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రతిపాదించనున్న అవిశ్వాసానికి టీడీపీ మద్దతివ్వాల్సిన అవసరం లేనేలేదని తాజాగా ఆయన తేల్చేశారు! పైగా ఈ విషయమై అటు ముఖ్యమంత్రి కిరణ్, ఇటు విపక్ష నేత చంద్రబాబు మంగళవారం అచ్చు గుద్దినట్టుగా ఒకేరకంగా మాట్లాడారు! ‘స్థానిక ఎన్నికలకు భయపడి టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాస కుట్ర చేశాయి’ అని మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో కిరణ్ మంగళవారం మధ్యాహ్నం ఆరోపించగా.. రాత్రికల్లా బాబు కూడా అదే బాణీ అందుకున్నారు. కిరణ్ వ్యాఖ్యలను యథాతథంగా తానూ వల్లె వేశారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనలేకే టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ కలిసి అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చాయి. 

ఇలాంటప్పుడు అవిశ్వాసానికి మనం మద్దతివ్వాల్సిన అవసరం లేదు’ అంటూ టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్‌లో బాబు చెప్పుకొచ్చారు! పైగా కిరణ్ తన ప్రసంగంలో టీఆర్‌ఎస్‌ను, వైఎస్సార్‌సీపీని విమర్శించేందుకే పరిమితమయ్యారు తప్ప పొరపాటున కూడా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రస్తావనే తేలేదు! ఇటు టీడీపీ నేతలతో కాన్ఫరెన్స్ సందర్భంగా బాబు కూడా టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలనే ఆక్షేపించారు తప్పితే కాంగ్రెస్ పేరు కూడా ఎక్కడా పలకలేదు! ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిన కనీస బాధ్యతను కూడా పూర్తిగా విస్మరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని టీఆర్‌ఎస్ ప్రకటించి వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించిన వేళ.. కిరణ్, బాబు ఏకతాటిపైకి వచ్చి మరీ ఇలా యుగళ గీతం విన్పించిన వైనం రాజకీయ వర్గాలనే గాక కాంగ్రెస్, టీడీపీలను కూడా విస్మయపరిచింది. కాంగ్రెస్, టీడీపీ పేరుకే అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తప్ప... వాస్తవానికి అన్ని విషయాల్లోనూ ‘ఒకేమాట, ఒకే బాట’గా సాగుతున్నాయన్న వాస్తవం మరోసారి రాష్ట్ర ప్రజలందరి కళ్లముందూ ఆవిష్కృతమైంది. ముఖ్యంగా ఏం చేసైనా సరే కాంగ్రెస్ సర్కారును ఏదోలా గట్టెక్కించేందుకు బాబు విశ్వప్రయత్నం చేస్తున్న వైనం కూడా స్పష్టంగా బయట పడింది!

అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిందిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పంపిన లేఖను మంగళవారం అందుకున్న టీడీపీ, రాత్రికల్లా హైడ్రామా మధ్య తన నైజాన్ని బయటపెట్టుకుంది! కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ను రక్షించే భారాన్ని నెత్తిన వేసుకున్న ఆయన, అవిశ్వాసానికి మద్దతివ్వాల్సిన అవసరం లేదంటూ పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. దానిపై ఏం చేయాలన్న అంశంపై నేతలతో రోజంతా తర్జనభర్జన పడ్డ అనంతరం, మద్దతివ్వాల్సిన అవసరం లేదని చివరకు మంగళవారం రాత్రి బాబు తేల్చేశారు. పైగా మంగళవారం మధ్యాహ్నమే అవిశ్వాసానికి సంబంధించి సీఎం కిరణ్ మాట్లాడిన మాటలనే బాబు సైతం టీడీపీ నేతలతో ఉటంకించారు! టీఆర్‌ఎస్ ప్రతిపాదించే అవిశ్వాసంపై టీడీపీ ఇప్పటివరకు సూటిగా ఎలాంటి స్పందన తెలియజేయని విషయం తెలిసిందే. పైగా మీకోసం యాత్రలో ఉన్న బాబు కూడా దీనిపై ఎక్కడా స్పందించలేదు. పైగా ఈ అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోదని పార్టీ నేతలతో తాజాగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి.

బాబు ఆపన్న ‘హస్తం’!
ప్రధాన ప్రతిపక్ష టీడీపీ మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటిస్తే ప్రభుత్వ మనుగడ కష్టమని సర్వత్రా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఇరకాటంలో పడ్డ టీడీపీ నాయకత్వం, ఎలాగైనా కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కాపాడటానికి అనుసరించాల్సిన వ్యూహంపైనే అంతర్గతంగా కసరత్తును తీవ్రతరం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. టెలికాన్ఫరెన్స్ అనంతరం, అవిశ్వాసంపై అనుసరించాల్సిన వైఖరిపై మంగళవారం టీడీఎల్పీ వ్యూహ కమిటీ కూడా సమావేశమైంది. టీఆర్‌ఎస్ ప్రకటన, తద్వారా ఉత్పన్నమయ్యే పరిణామాలపై తర్జనభర్జన పడింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటమే పరమావధిగా చంద్రబాబు సంకేతాలకు అనుగుణంగా ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న అంశంపై ఎక్కువ సేపు సమాలోచనలు జరిపినట్టు సమాచారం. మీకోసం పేరుతో యాత్ర చేస్తున్న చంద్రబాబు శాసనసభ సమావేశాలకు హాజరుకానని ముందుగానే ప్రకటించారు.

ఇప్పుడు ఆ అంశం కీలకంగా మారింది. చంద్రబాబు సభకు హాజరుకాకపోతే నేరుగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్టు స్పష్టంగా తెలిసిపోతుందని, అందువల్ల ఆయన రావడం మంచిదని ఒక ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు దాన్ని సమర్థించారు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నపుడు ఇపుడు అవిశ్వాస తీర్మానం ఎవరో పెడితే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న బాబు వాదన కూడా చర్చకు వచ్చింది. ‘ఒకవేళ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగినా, ప్రభుత్వానికి మనం అండగా ఉన్నాం గనుక పడిపోదు.ఏదో అద్భుతం జరిగి పడిపోయినా వెంటనే ఎన్నికలు రావు. రాష్ట్రపతి పాలనో, కాంగ్రెస్‌ను మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమో జరుగుతుంది. ఏది జరిగినా టీడీపీకి ఒరిగేదేమీ లేదు. కాబట్టి ప్రభుత్వం కూలిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది’ అన్న యోచనలో టీడీపీ నేతలున్నారని అంటున్నారు.
Share this article :

0 comments: