మీ కుట్రలు ఇంకెన్నాళ్లు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ కుట్రలు ఇంకెన్నాళ్లు?

మీ కుట్రలు ఇంకెన్నాళ్లు?

Written By news on Monday, March 25, 2013 | 3/25/2013

జగనన్నకు అన్యాయం చేసేవారు ఇంతకు ఇంత అనుభవిస్తారు
జగన్‌పై విచారణ ఇంకా పూర్తి కాలేదట!
చార్జిషీటు ఎప్పుడు వేస్తామో చెప్పలేమంటూ సీబీఐ బాధ్యతారహితంగా మాట్లాడుతోంది
6 నెలల్లోపు విచారణ పూర్తి చేసి..చార్జిషీటు వేయండని సుప్రీం చెప్పింది
జగనన్నకు బెయిల్ వస్తుందనుకున్న ప్రతిసారీ సీబీఐ నుంచి చంద్రబాబు, చిదంబరం వరకు అడ్డుపడుతున్నారు
మరో ప్రజాప్రస్థానానికి 100రోజులు 
మంగళగిరి సభకు పోటెత్తిన జనం


మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ పత్య్రేక ప్రతినిధి: ‘‘జగనన్నకు బెయిల్ వస్తుందనుకున్న ప్రతిసారీ సీబీఐ నుంచి చంద్రబాబునాయుడు.. చిదంబరం వరకు ప్రతి ఒక్కరూ జోక్యం చేసుకొని, చేయాల్సిన ప్రయత్నమంతా చేసి బెయిల్‌కు అడ్డం పడుతున్నారు. నిన్ననే చూశాం.. సీబీఐ కేవీపీ గారిని విచారణ చేసిందట.. విచారణ అయిపోయిన తర్వాతసీబీఐ అధికారులు బయటికి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద విచారణ ఇంకా పూర్తి కాలేదు. చార్జిషీటు ఎప్పుడు ఫైల్ చేస్తామో చెప్పలేమని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. 6 నెలల్లోపు విచారణ పూర్తి చేసి, చార్జిషీటు దాఖలు చేయండని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన 6 నెలలు మార్చి 31తో పూర్తవుతుందని తెలిసినా సీబీఐ ఇంకా విచారణ పూర్తి చేయలేదు, చార్జిషీటు ఎప్పుడు వేస్తామో తెలియదని ఇప్పుడు చెబుతున్నారు. మరి రెండేళ్ల నుంచి ఈ సీబీఐ పని చేసినట్టా లేక గాడిదలు కాసినట్టా...?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. 

రాజీవ్‌గాంధీ చనిపోతే బోఫోర్స్ కేసు నుంచి ఆయన పేరు తొలగించారు కానీ వైఎస్సార్ చనిపోయినా రాజకీయ ఒత్తిడితో ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు నల్లబ్యాడ్జీలు కట్టుకొని భారీ ఎత్తున తరలివచ్చారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ప్రజల పక్షాన నిలబడిన 15 మంది ఎమ్మెల్యేలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వేదికకు ముందు వరుసలో కూర్చున్నారు. ఈ వేదిక మీద నుంచి షర్మిల ప్రజలను ఉద్దేశించి తీవ్ర ఉద్వేగంగా మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

వీళ్లకు నీతి, నిజాయితీ లేదు: తెలుగుదేశం, కాంగ్రెస్ కుమ్మక్కై జగనన్న మీద కేసులు పెట్టి రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నారు. రెండేళ్ల నుంచి సీబీఐ జగనన్న మీద విచారణ చేస్తూనే ఉంది. వందలాది మంది సిబ్బందితో జగనన్న ఇంటి మీద, మా బంధువుల ఇంటి మీద ఈ సీబీఐ దాడులు చేసింది. విచారించిన ప్రతిసారీ కూడా జగనన్న సీబీఐకి పూర్తిగా సహకరించారు. అయినా సీబీఐ ఇప్పటివరకు ఏ ఒక్క ఆధారం చూపించలేదు. అయినా 10 నెలలుగా జగనన్నను జైల్లో బంధించారు. వీళ్లకు నీతీ నిజాయితీ లేదు.. పాపభీతి అంతకన్నా లేదు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అసూయ ద్వేషాలు పెంచుకుని జగనన్నకు అన్యాయం చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. వీళ్లు చేస్తున్న పాపం ఊరికే పోదు. ఇంతకింత అనుభవిస్తారు. కుట్రలు పన్నిన శకుని దగ్గర నుంచి వంద పాపాలు చేసిన శిశుపాలుని వరకు ప్రతి ఒక్కరూ అనుభవించినట్టే వీళ్లు చేస్తున్న పాపాలకు ఫలితం అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. జగనన్నకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరూ మట్టి కొట్టుకుని పోయేరోజు దగ్గరలోనే ఉంది.

టీడీపీ, కాంగ్రెస్ నేతలు రోజూ భయపడి చస్తున్నారు..

వైఎస్సార్ ఏ పని చేసినా అందులో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఉండేలా చేశారు. అలాంటి మహానేత పేరును దోషిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం జరిగింది. అదే చంద్రబాబునాయుడు ఐఎంజీ కేసులో వేల కోట్లు విలువ చేసే భూములను ఆయన బినామీలకు కారు చౌకగా ఇచ్చుకున్నారు. కోర్టు ఆయన మీద విచారణ చేయాలని ఆదేశిస్తే.. మా వద్ద సిబ్బంది లేరని చెప్పింది ఈ సీబీఐ. ఆయన మీద అయితే ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా ఈ సీబీఐ ఆయనను విచారించదు. బడా నాయకులమని చెప్పుకునే వీళ్లకు చిన్న వయస్సులో ఉన్న జగనన్నను ఎదుర్కొనే ధైర్యం లేక, దమ్ము లేక సీబీఐని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్న జగనన్నను చూసి ఈ కాంగ్రెస్, టీడీపీ నేతలు రోజూ భయపడి చస్తున్నారు. మీకు నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే జగనన్నను బయటకు తీసుకువచ్చి రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసురుతున్నా. కానీ మీకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజా కోర్టు నుంచి వచ్చే తీర్పేంటో ఈ రాష్ర్టంలో ప్రతి ఒక్క నాయకునికి తెలిసిపోయింది.

ఆ దమ్ము, ధైర్యం మీకుందా?: మీకు దమ్ముంటే మొన్న అవిశ్వాసంలో కాంగ్రెస్ వైపు కాకుండా, టీడీపీ వైపు కాకుండా ప్రజాపక్షాన నిలబడిన 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి మళ్లీ ప్రజా తీర్పును కోరండి. అలాగే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీల గుర్తు మీద ఎన్నికలకు వెళ్లాలని ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా. మీకు ఆ ధైర్యం లేదు. ఎన్నికలొస్తే 15కు 15 సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని.. మీకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని భయం. జగనన్న నిర్దోషి అని ప్రజలు తీర్పు ఇస్తారని మీకు భయం. మాకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వద్దు.. కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దు.. మాకు జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలని జనం ఎలుగెత్తి చాటుతారని భయం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగనన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం. చంద్రబాబునాయుడైతేనేమి... కిరణ్‌కుమార్‌రెడ్డి అయితేనేమి... ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా ప్రజల నుంచి వచ్చిన నాయకులు కాదు. ఒకరేమో పిల్లనిచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వస్తే.. మరొకరు ఢిల్లీ నుంచి వచ్చిన కవర్‌లోంచి దిగిపడ్డారు. వీళ్లకు ప్రజా సమస్యలు అర్థం కావు. రైతుల కష్టాలు తెలియవు. ప్రజల గుండె చప్పుడు విని వాళ్ల కన్నీళ్లను తుడవాలనే మనసు ఉండదు.

ఈ దుర్మార్గ రాజకీయాలపై పల్లెల్లో నిశ్శబ్ద విప్లవం మొదలైంది

వైఎస్సార్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజు రాష్ట్ర ప్రజలు ఎన్ని కష్టాల్లో ఉన్నారో.. ఈ రోజు నేను పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కూడా అవే కష్టాలున్నాయి. వైఎస్సార్ ఏ భరోసా అయితే కలిగించాలని బయలుదేరారో, ఈ మరో ప్రజాప్రస్థానం కూడా రాజశేఖరరెడ్డి గారి పాదయాత్రకు కొనసాగింపుగా... జగనన్న వదిలిన బాణంగా... మీ ముందుకు వచ్చి నిలబడి ఉన్నా. ఈ రోజుకి పాదయాత్ర మొదలై 100 రోజులు పూర్తయింది. ఇది గొప్ప విషయమని నేను అనుకోవడం లేదు. రికార్డుల కోసం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ప్రజలపై పగబట్టింది కాబట్టి, ప్రతిపక్షం ఉండి కూడా ప్రయోజనం లేదు కాబట్టి, అసెంబ్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసం పెడితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ దానికి మద్దతు పలకకుండా ఈ ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలబడి ఉంది కాబట్టి మీ ముందుకు వచ్చా. మీ కష్టాలు కలకాలం ఉండవని ధైర్యం చెబుతూ ప్రజలకు భరోసా కలిగించడానికి చేస్తున్న పాదయాత్ర ఇది. 

రైతన్న కష్టాలు, కూలన్న, మహిళలు, బీసీలు, దళితులు, మైనార్టీలు, విద్యార్థులు, గీత, చేనేత, ప్రతి ఒక్కరి కష్టాలు తీరే రోజు వస్తుందనీ.. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందనీ భరోసా కల్పించేందుకే ఈ పాదయాత్ర. ఒక ప్రజా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని నీచమైన కుమ్మక్కు కుట్ర రాజకీయాలతో అన్యాయంగా నాలుగు గోడల మధ్య బంధించడాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు కట్టుకొని చేస్తున్న పాదయాత్ర ఇది. మనకు పండుగ వచ్చిందీ అంటే అది జగనన్న బయటకి వచ్చినప్పుడే.. రాజన్న రాజ్యం స్థాపించినపుడే. ఈ దుర్మార్గపు, నీచ నికృష్ట రాజకీయాలను వెక్కిరిస్తూ మన పల్లెల్లో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. రాబోయే రాజన్న రాజ్యానికి ఈ విప్లవమే నాంది కాబోతోంది. 

ఆదివారం 100వ రోజు మరో ప్రజాప్రస్థానం రేవేంద్రపాడు గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి పెదవడ్లపూడి, ఆత్మకూరు, గణపతినగర్ మీదుగా మంగళగిరికి చేరింది. ఇక్కడ భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. రాత్రి 9 గంటలకు ఎర్రబాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఆదివారం 13.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1375.4 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యింది. ఆదివారం పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకతోటి సుచరిత, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గుర్నాథరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మద్దాల రాజేష్, కొరుముట్ల శ్రీనివాసులు, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, తెర్లం బాలరాజు, గొర్ల బాబూరావు, భూమన కరుణాకర్‌రెడ్డి, జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, తానేటి వనిత, సుజయ్ కృష్ణ రంగారావు, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నాని, కొడాలి నాని, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, దేవగుడి నారాయణరెడ్డి, మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదినూరి ప్రసాద్‌రాజు, జంగా కృష్ణమూర్తి, దారా సాంబయ్య, పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, ఆర్‌కే, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, పుత్తా ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీపార్వతి, కాపు భారతి, గోనె ప్రకాష్, గౌతంరెడ్డి, మేరుగ నాగార్జున, జంకె వెంకటయ్య, ఎరిస్వామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ సీఎస్ రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డిలు ఉన్నారు.


రాజన్న ఆశయం, జగనన్న దీక్ష ఒక్కటే

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గుంటూరు జిల్లాలో 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులు నేను నడవగలిగాను అంటే అది కేవలం మీ ప్రేమానురాగం వల్లే సాధ్యమైంది. ఈ 100 రోజులు రాజన్న పాదమై నడిచాను. జగనన్న వదిలిన బాణమై పయనించాను. నేను వేసిన ప్రతి అడుగులో రాజన్న చనిపోలేదని, రాష్ట్ర ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని అర్థమైంది. జనమంతా జగనన్నలో రాజన్నను చూసుకుంటున్నారని అర్థమైంది. ఈ 100 రోజుల్లో ప్రతి రోజూ రాజన్న ఆశయాన్ని తలచుకుంటూ నడవడం జరిగింది. వైఎస్ పాలించిన ఐదు సంవత్సరాలు ఒక సువర్ణయుగంలా సాగాయి. కన్నతండ్రిలా ఆలోచించి అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతూ పాలించాడు. రైతులు రాజులుగా బతికిన రోజులవి. రైతులకు వైఎస్ నీళ్లిచ్చాడు. ఏడుగంటలపాటు ఉచితంగా కరెంటు ఇచ్చాడు. మద్దతు ధర ఇచ్చాడు. వారి అప్పులు తీరేందుకు రూ.12 వేల కోట్లతో రుణమాఫీ కూడా చేశాడు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పావలా రుణాలిచ్చాడు. డబ్బులేని కారణంగా విద్యార్థుల చదువు ఆగకూడదని లక్షల మంది పేదలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాడు. పేదలకు లక్షలు ఖర్చయ్యే వైద్యం ఉచితంగా అది కూడా పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ అందిచ్చాడు. రాజన్న ఆశయం.. జగనన్న దీక్ష ఒక్కటే. మన రాష్ట్ర ప్రజలు, మన రైతులు, అక్కాచెల్లెళ్లు, మన అవ్వా తాతలు నూరేళ్లు చల్లగా ఉండాలన్నదే వారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసమే జగనన్న తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశాడు.
- షర్మిల

మరో చీకటి అధ్యాయం నడుస్తోంది

చంద్రబాబు నాయుడు పాలించిన తొమ్మిదేళ్లు రాష్ట్రంలో ఓ చీకటి అధ్యాయం. అయితే రాజన్న చనిపోయిన తర్వాత ఈ మూడున్నర సంవత్సరాల నుంచి కూడా మరో చీకటి అధ్యాయం నడుస్తోంది. ఈ ప్రభుత్వ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. రైతులు అప్పులపాలై.. భూముల్ని, ఇంట్లో బంగారాన్ని, ఇంట్లో కిడ్నీలను కూడా అమ్ముకుంటున్నారు. నిత్యావసరాలు, చార్జీలు ఎడాపెడా పెరిగిపోవడంతో మూడు పూటలా తినలేని పరిస్థితి ఉంది. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కుంటుపడింది. 108, 104 కనుమరుగైపోయాయి. ఈ ప్రభుత్వం పక్కా ఇళ్లకు పాడె కట్టింది. చేనేతను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నేత కార్మికులు రోజుకు రూ.50, రూ.70, రూ.100తో బతుకుతున్నారంటే ఈ పాపం ఇప్పుడున్న ప్రభుత్వానిదే.
Share this article :

0 comments: