జగన్‌ను దెబ్బతీసే కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను దెబ్బతీసే కుట్ర

జగన్‌ను దెబ్బతీసే కుట్ర

Written By news on Thursday, March 21, 2013 | 3/21/2013

ఆయనపై సీబీఐ దర్యాప్తు కోరినవారు రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులు
* జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా దర్యాప్తు కోరారు
* జగన్‌కు ఆర్థిక సలహాదారును కాబట్టే ఈ కేసులో నన్ను ఇరికించారు
* అభియోగాలన్నీ అవాస్తవం, ఆధారరహితం.. కొట్టివేయండి
* ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి
* సీబీఐకి న్యాయస్థానం నోటీసులు.. విచారణ ఏప్రిల్ 1కి వాయిదా 

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఆయన రాజకీయ ప్రత్యర్థులు హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తు కోరారని ఆడిటర్ విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్రావు, టీడీపీ నేత ఎర్రన్నాయుడులు వైఎస్‌కు రాజకీయ ప్రత్యర్థులని, రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన రెండో చార్జిషీట్ సీసీ నంబర్ 9లో తనపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలని, ఎటువంటి ఆధారాలు చూపనందున వాటిని కొట్టివేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టులో విజయసాయిరెడ్డి బుధవారం డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్ రాజారెడ్డికి ఆడిటర్‌ను...

‘‘ఆడిటర్‌గా 1985-86లో నమోదు చేసుకున్నా. వీఎస్ రెడ్డి ఎస్‌పీ అసోసియేట్స్ ఆడిటింగ్ కంపెనీలో భాగస్వామిని. వైఎస్ కుటుంబానికి మూడు తరాలుగా ఆడిటర్‌గా సేవలు అందిస్తున్నా. జగన్‌మోహన్‌రెడ్డి తాత రాజారెడ్డి కంపెనీలకు ఆడిటర్‌గా పనిచేశాను. తర్వాత జగన్ కంపెనీలకు ఆర్థిక సలహాదారుగా, ఆడిటర్‌గా కొనసాగుతున్నా. అందుకే ఈ కేసులో నన్ను అక్రమంగా ఇరికించారు. జగన్‌తో కుమ్మక్కై జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు పెట్టించాననేది అవాస్తవం, ఆధారరహితం. 2006 నవంబర్ 14 నుంచి 2007 జూన్ 21 వరకు జగతి పబ్లికేషన్స్ డెరైక్టర్‌గా ఉన్నా. ఆ సమయంలో బయటి నుంచి ఎటువంటి పెట్టుబడులు రాలేదు. నేను డెరైక్టర్‌గా తప్పుకున్న తర్వాత 2007 ఆగస్టు 9 నుంచే జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. చట్టం మీద గౌరవం ఉండే వ్యక్తిని. చట్టవిరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవర్తించను. ఆధారాలు లేకుండా నాపై అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించడం తగదు’’ అని సాయిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘‘నాపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలు. ఆధార రహితం. 

చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్లలో నాపై మోపిన అభియోగాలకు సీబీఐ ఎటువంటి ఆధారాలూ చూపలేదు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినవారు క్విడ్‌ప్రోకో పద్ధతుల్లో పెట్టిన పెట్టుబడులు తదితర వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కానీ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీబీఐ దర్యాప్తు కొనసాగింది. ఇందులో ప్రజాప్రయోజనమే లేదు. ప్రైవేటు వ్యక్తులు, ఇతరులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని నాపై మోపిన అభియోగాలను కొట్టివేయండి. నాపై అభియోగాలు నమోదు చేసేందుకు ఆధారాలు లేవు. అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్టు)లోని సెక్షన్ 9 కింద నాపై అభియోగాలు ఎలా మోపుతారు? నేను ప్రజాప్రతినిధిని కాదు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు. పీసీ యాక్టులోని సెక్షన్ 9 నాకు వర్తించనే వర్తించదు. నేరపూరిత కుట్ర (120-బి), మోసం (420), నకిలీ డాక్యుమెంట్లను సృష్టించడం (468), నకిలీ డాక్యుమెంట్లను నిజమైనవిగా నమ్మించడం (471) తదితర అభియోగాలను నమోదు చేసేందుకు ఎటువంటి ఆధారాలు లేవు’’ అని సాయిరెడ్డి వివరించారు. సీబీఐ మోపిన అభియోగాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

బెయిల్ షరతులు సడలించండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ఢిల్లీ విభాగం నోటీసులు జారీచేసిందని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న తన బెయిల్ షరతులను సడలించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆడిటర్ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. మే 26న తన కుమార్తె వివాహం ఉందని, ఈ నేపథ్యంలో ఈనెల 27 నుంచి జూన్ 10 వరకు హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న షరతులను సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు.. ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలని సీబీఐకి సూచిస్తూ విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు.

జగన్ రిమాండ్ 1 వరకు పొడిగింపు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు ఏప్రిల్ 1 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు.

నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, శరత్‌చంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిమ్మగడ్డ ప్రకాష్, విజయలక్ష్మీ ప్రసాద్, చంద్రమౌళి, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మన్మోహన్‌సింగ్, జగతి, జనని కంపెనీల ప్రతినిధి సీపీఎన్ కార్తీక్, భారతి సిమెంట్ నుంచి బాలాజీ, కార్మెల్ ఏషియా నుంచి రమేష్‌బాబు, సిలికాన్ బిల్డర్స్ నుంచి వేణుగోపాల్‌రాజు తదితరులు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 1కు వాయిదా వేసింది. మరోవైపు జగన్ కంపెనీల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించి సమర్పించిన మూడో చార్జిషీట్ సీసీ నంబర్ 10, వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించి సమర్పించిన సీసీ నంబర్ 14 చార్జిషీట్లపై అభియోగాల నమోదు ప్రక్రియను కోర్టు బుధవారం ప్రారంభించింది. జగన్ కంపెనీల్లో ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన సీబీఐ సమర్పించిన మొదటి చార్జిషీట్ సీసీ నంబర్ 8పై అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు గడువు కావాలని సీబీఐ విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

త్వరలో తుది చార్జిషీట్: సీబీఐ

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని, త్వరలోనే తుది చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. దర్యాప్తు ఏ దశలో ఉందో వివరిస్తూ సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ బుధవారం కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇదిలా ఉండగా మార్చి 31లోగా అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీట్ దాఖలు చేయాలని జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐకి మౌఖికంగా స్పష్టం చేసింది. ఇందుకు సీబీఐ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 31 ఆదివారం కావడంతో 30లోగానే సీబీఐ చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించే అవకాశం ఉం - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=564223&Categoryid=1&subcatid=33#sthash.eeAEONRE.dpuf
Share this article :

0 comments: