‘ఏలేరు’కు సర్కారు మోకాలడ్డు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఏలేరు’కు సర్కారు మోకాలడ్డు

‘ఏలేరు’కు సర్కారు మోకాలడ్డు

Written By ysrcongress on Saturday, March 23, 2013 | 3/23/2013

ఏలేరు సాధన కోసం పాదయాత్రకు శ్రీకారం 
ఏలేశ్వరంలో భారీ బహిరంగ సభ

జగ్గంపేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏలేరు ఆధునికీకరణ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు మైసూరారెడ్డి అన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లు కేటాయించి, 2009లో శంకుస్థాపన చేసినప్పటికీ ప్రభుత్వం పనులు చేపట్టలేదు. ప్రస్తుత బడ్జెట్‌లోను నిధులు కేటాయించకపోవడంతో ఏలేరు ఆధునికీకరణ సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పాదయాత్రకు శుక్రవారం రాత్రి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి శివారు ఆయకట్టు ఉన్న పిఠాపురం వరకు ఏడు రోజుల పాటు 71.9 కిలోమీటర్ల మేరకు జరగనున్న ఈ పాదయాత్ర ఏలేరు ప్రాంతంలోని గ్రామాల మీదుగా సాగుతుంది. ఈ యాత్రను ఏలేశ్వరంలో మైసూరారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో రైతాంగాన్ని ఉద్దేశించి మైసూరారెడ్డి మాట్లాడారు. 2009లో ఏలేరు పనులకు రాజశేఖరరెడ్డి నిధులు కేటాయించగా, ఇప్పటివరకు కనీసం మట్టితవ్వకం పనులు కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. జగన్ ద్వారానే ఏలేరు సాధ్యమవుతుందని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారంలో ముందుంటామంటూ.. పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బేరసారాలు సాగించుకున్నారని ఆరోపించారు. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కోసం పదవులను కూడా త్యాగం చేసి శాసనసభ్యులు ఓటు వేశారన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏలేరు ప్రాంతానికి చెందిన పళ్లంరాజు కేంద్రంలోను, తోట నరసింహం రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నప్పటికీ నిధులు సాధించలేక పోయారన్నారు. వైఎస్సార్ మా నాయకుడని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. ఆయన ప్రకటించిన ప్రాజెక్టులను చేపట్టకపోతే 2014 ఎన్నికల్లో ప్రజలు అడుగుతారని, ఈ ప్రభుత్వం ఇబ్బంది పడకతప్పదన్నారు. 

ఏం సమాధానం చెబుతారో మీకే తెలుసని రైతులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయాల్సిన చంద్రబాబు.. తన ఎమ్మెల్యేలతో అది వీగిపోయేలా చేశారన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఏలేరుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి నిధులు తేవడంలో విఫలమయ్యారని, ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం ఆధునికీకరణకు రూ.258 కోట్లు నిధులు అవసరమవుతాయన్నారు. ఏలేరు ప్రాంత రైతుల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ఏలేరు ఆధునికీకరణకు డాక్టర్ రాజశేఖరరెడ్డి పెద్ద మనసుతో నిధులు కేటాయించారన్నారు. రైతుల కోసం ఇన్ని ప్రాజెక్టులు చేపట్టిన ఘనత భారతదేశంలో ఏ ఒక్కరికీ లేదని చెప్పారు.
Share this article :

0 comments: