'ప్రభుత్వానికి మద్దతుతెలిపిన టిడిపి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ప్రభుత్వానికి మద్దతుతెలిపిన టిడిపి'

'ప్రభుత్వానికి మద్దతుతెలిపిన టిడిపి'

Written By news on Saturday, March 16, 2013 | 3/16/2013

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపిందని వైఎస్ఆర్ సిపి కేంద్ర పాలకమండలి సభ్యులు మైసూరా రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చను ఆ పార్టీ వైఎస్ఆర్ సిపిని విమర్శించడానికే ఉపయోగించుకుందన్నారు. ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని చెప్పారు. పాలకపక్షంపై టిడిపి తన విశ్వాసాన్ని చాటుకుందన్నారు. కాంగ్రెస్, టిడిపి మధ్య సంబంధాలు రెండేళ్లుగా కొనసాగుతున్నాయని, ఇప్పుడు శాసనసభ సాక్షిగా నిరూపితమైందని పేర్కొన్నారు. సభలో లేని వ్యక్తులను విమర్శించకూడదన్న సభానిబంధనలను కూడా టిడిపి సభ్యులు పాటించలేదన్నారు. ఆ సమయంలో టిడిపి సభ్యుల మాటలకు అధికార పక్ష సభ్యులు మద్దతు తెలపడం చూస్తుంటే వారి కుమ్మక్కుకు స్సష్టమైపోయిందన్నారు. అందరూ దీనిని గమనిస్తున్నారని తెలిపారు.

ఛార్జిషీట్ అనేది ఒక అభియోగ పత్రం. దానిని కోర్టులో దాఖలు చేసిన తరువాత, కోర్టు విచారించి నిర్ధారిస్తుందని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న విషయాలను బయట ప్రస్తావించకూడదు. నిబంధనలు అతిక్రమించి ఛార్జిషీట్లోని విషయాలను ప్రస్తావిస్తుంటే ఉపసభాపతి సక్రమమైనరీతిలో అడ్డుకోలేదన్నారు. తెలిసి చేశారో తెలియక చేశారో అర్ధం కావడంలేదన్నారు.

కర్నూలు: వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారనే భయంతోనే ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు పలకలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పడిపోయి ఎన్నికల్లోస్తే జగన్ సీఎం అవుతారన్న జంకుతో చంద్రబాబు అవిశ్వాసానికి దూరంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికలే చంద్రబాబుకు ఆఖరి ఎన్నికలు అవుతాయని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యకర్తల సమావేశంలో నాగిరెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: