సోనియా మెప్పు కోసమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సోనియా మెప్పు కోసమే

సోనియా మెప్పు కోసమే

Written By news on Tuesday, March 26, 2013 | 3/26/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మండిపాటు
సర్వేకు మల్కాజ్‌గిరీ జనరల్ ఎంపీ
సీటు ఇచ్చి గెలిపించింది వైఎస్సే
అలాంటి నేతపైనే విమర్శలా?

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. సోనియాగాంధీ మెప్పు పొందడం కోసం వైఎస్‌ను ఇలా కించపరుస్తారా? అని ప్రశ్నించారు. మరిన్ని పదవులు పొందాలనుకుంటే సోనియాగాంధీని మరో రకంగా పొగుడుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, మేకతోటి సుచరిత, కె.శ్రీనివాసులు సోమవారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘సోనియాగాంధీ కాళ్లు పట్టుకొని ఇంకా పెద్ద పదవులు పొందాలనే దురాశతోనే వైఎస్‌పై కేంద్రమంత్రి సర్వే హీనమైన మాటలు మాట్లాడారు. మీ మనస్తత్వం చూస్తుంటే అమ్మ పాలుతాగి రొమ్ము గుద్దే వారిలా కనిపిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు మల్కాజ్‌గిరి జనరల్ సీటు ఇచ్చి గెలిపించిన నాయకుడు రాష్ట్రంలో ఎవరు?.. ఆ రాజశేఖరరెడ్డినే మర్చిపోయారా? మీకు సోనియాగాంధీపై అంతగా నమ్మకం ఉంటే ఏ ఎన్నికల్లోనైనా సోనియా బొమ్మను మీరు తెచ్చుకోండి. మేం రాజశేఖరరెడ్డి బొమ్మ తెచ్చుకుంటాం. మీ సోనియాగాంధీ బొమ్మ గెలుస్తుందో, మా రాజశేఖరరెడ్డి పేరు ప్రఖ్యాతులు గెలుస్తాయో మీరే చూడండి. కనీసం అప్పుడైనా మీకు కళ్లు తెరుచుకుంటాయి’ అని పేర్కొన్నారు. జాగ్రత్తగా మాట్లాడాలని సర్వేను హెచ్చరించారు. 

ఆనాడేం చేశారు?

వైఎస్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు చేసే ఈ కాంగ్రెస్ నేతలు ఆయన రెండోసారి సీఎంగా పదవి చేపట్టే సమయంలో సోనియాగాంధీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని మేకతోటి సుచరిత ప్రశ్నించారు. వైఎస్ మరణించాకే ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. సర్వే సత్యనారాయణకు జనరల్ ఎంపీ సీటు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించింది రాజశేఖరరెడ్డి అని, అప్పుడు ఇవేవీ ఆయనకు గుర్తు లేవా? అని శ్రీనివాసులు నిలదీశారు. సోనియాగాంధీ వల్లే వైఎస్ రాజశేఖరరెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సర్వే చెబుతున్న మాటలు నిజమైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు జరగటం లేదని సూటిగా ప్రశ్నించారు.
Share this article :

0 comments: