రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం

Written By ysrcongress on Wednesday, March 13, 2013 | 3/13/2013

* ఎకనమిక్ టైమ్స్ ఇంటర్వ్యూలోనూ ఇదే చెప్పాను
* నా మాటలను వక్రీకరిస్తున్నారు
* మాకు 30 నుంచి 35 లోక్‌సభ స్థానాలు వస్తాయి
* ఆరోజు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో తెలియదు
* మేం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొనే ఆలోచిస్తాం 

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఎకనమిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే చెప్పానని తెలిపారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీని స్థాపించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు.

‘‘2014 ఎన్నికల అనంతరం కేంద్రంలో ఎవరు ఉంటారో ఏమో.. ఏ ఫ్రంట్ ఏర్పడుతుందో ఏమో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది. మన రాష్ట్రానికి, మన ప్రజలకు ఎలా మంచి జరుగుతుందనుకుంటే అలా చేస్తామని నేను ఎకనమిక్ టైమ్స్ ఇంగ్లిష్ పత్రికకు చెబితే, దానిని కొందరు నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఎల్లో మీడియా కూడా అలాగే ప్రచారం చేస్తోంది’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా మాటలను వక్రీకరిస్తున్న వారందరికీ నేను మనవి చేసేది ఒక్కటే. వై.ఎస్.రాజశేఖరరెడ్డి 30 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ ఆ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డారు. ప్రాణం పోయే వరకూ ఆయన అదే పార్టీలో ఉన్నారు. 

ఇవాళ నా కుమారుడిని పది నెలలుగా జైల్లో పెట్టారు. ఇప్పటివరకూ జగన్‌పై పెట్టిన కేసులకు సంబంధించి ఏమీ చెప్పలేక పోతున్నారు. జగన్‌బాబును అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారనేది అందరికీ తెలుసు. ఎకనమిక్ టైమ్స్ వాళ్లు పదే పదే నన్నడిగారు.. పార్టీని విలీనం చేస్తారా, కలిసిపోతారా... అని. అప్పుడు నేను చెప్పింది ఏమిటంటే.. రాష్ట్రంలో మా పార్టీకి 30 నుంచి 35 లోక్‌సభ స్థానాలు వస్తాయి, 200కు పైగా అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంటాం. ఏం నిర్ణయం తీసుకోవాలనేది ఆ తరువాతే ఆలోచిస్తాం. ఆరోజున అక్కడ ఏ పార్టీ ఉంటుందో.. అది థర్డ్ ఫ్రంట్ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు. అది కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే. గతంలో ‘సీఎన్‌ఎన్’ టీవీ చానల్‌కు కూడా జగన్‌బాబు ఇదే చెప్పారు. ఆరోజు కేంద్రంలో ఏ పార్టీ ఉంటుందో దానికి మద్దతునిచ్చి మన రాష్ట్రానికి మేలు చేయడానికి అవకాశం ఉండే రైల్వే, వ్యవసాయ శాఖ వంటి మంత్రిత్వ శాఖలను కోరతామని జగన్ చెప్పారు. మన రాష్ట్రంలో జలయజ్ఞం వంటి బృహత్తర పథకాలు పూర్తి చేసుకోవాలి కనుక కీలక శాఖల అవసరం ఉంది. 

ఆరోజు జగన్ చెప్పిన మాటే నేనూ చెప్పాను. రెండోసారి కూడా ఈ నాయకులకు, మీడియాకు మీ ద్వారా చెబుతున్నాను. ఆరోజు కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ వస్తుందో, ఇంకొక పార్టీ వస్తుందో తెలియదు.. మేం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆలోచిస్తాం అని నేను చెప్పాను. ఎకనమిక్ టైమ్స్‌లో ముందు పేజీలో ఒకటి రాశారు. లోపలి పేజీల్లో మాత్రం నేను చెప్పిందే రాశారు. నాయకులు ఇవన్నీ చదవరా! చదవకుండానే మాట్లాడతారా? ఇలా ఎందుకు మాట్లాడతారు? అందుకే మీ ద్వారా వారికి జవాబు చెబుతున్నా.. ఇప్పటికైనా వారందరికీ అర్థమై ఉంటుందని భావిస్తున్నాను’’ అని వివరించారు.
Share this article :

0 comments: