సర్వే చరిత్ర ఏంటో తెలుసు: గోనె - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్వే చరిత్ర ఏంటో తెలుసు: గోనె

సర్వే చరిత్ర ఏంటో తెలుసు: గోనె

Written By news on Friday, March 29, 2013 | 3/29/2013


 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై మాట్లాడుతున్న కేంద్ర సహాయమంత్రి సర్వే సత్యనారాయణ.. కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సంజయ్‌గాంధీలు ఏ విధంగా చనిపోయారో గుర్తు చేసుకోవాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు సూచించారు. సర్వే మాదిరి తామూ మాట్లాడగలమని, కానీ సభ్యత, సంస్కారం కలిగిన వ్యక్తులుగా ఆ పని చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జనరల్ స్థానంలో ఎస్సీ అభ్యర్థి అయిన సర్వేకు టికెట్ ఇచ్చి గెలిపించిన మహానేత ైవైఎస్‌ను తూలనాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు మెంబర్‌గా కూడా గెలవని చరిత్ర ఉన్న సర్వే.. మహానేతపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదన్నారు.

1996లో పార్లమెంటు స్థానానికి లక్ష్మీపార్వతి నేతృత్వంలోని టీడీపీ తరఫున సర్వే పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. సర్వే అంతటి నీచ చరిత్ర, అవినీతిపరుడు మరొకరు ఉండరన్నారు. 2010 ఉపఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డిలో ‘కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ లీడర్లను చెప్పులతో కొట్టండి’ అని చెప్పిన సర్వే మాటకు కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి పదవి చేపట్టగానే రాష్ట్రానికి ప్రైవేట్ విమానంలో వచ్చారని, అది ఎవరు సమాకూర్చారో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. జాతీయరహదారులపై దాబాలకు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.కోట్ల లంచం పుచ్చుకున్నారని, వాటిని త్వరలో ఆధారాలతోసహా బయటపెడతానని చెప్పారు.
Share this article :

0 comments: