రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: విజయమ్మ

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: విజయమ్మ

Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013

ఉగాది పర్వదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. విజయనామ సంవత్సరం రాష్ట్ర అభ్యున్నతి కోసం పాల్పడే శక్తులకు అన్నింటా విజయం చేకూర్చాలని ఆమె ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు, పల్లెలు కళకళలాడాలని కోరుకుంటున్నట్లు విజయమ్మ పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొంటారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఎం. రామచంద్రశాస్త్రితో పంచాంగ శ్రవణం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
Share this article :

0 comments: