ఇంత ప్రజాబలం ఏ నాయకుడికి ఉంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంత ప్రజాబలం ఏ నాయకుడికి ఉంది?

ఇంత ప్రజాబలం ఏ నాయకుడికి ఉంది?

Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరగనంత అభివృద్ధిని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి సాధించారు. ఆయన పాలించిన కాలాన్ని ‘సువర్ణయుగం’ అని విపక్షాలు సైతం ఒప్పుకోక తప్పదు. ఇలా ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్న తరుణంలో దైవం ఆయనని తీసుకెళ్లింది. ఇక అప్పటి నుంచి వైయస్సార్‌గారు సాధించిన సమసమాజాన్ని పాలక, ప్రతిపక్షాలు ముక్కలుచెక్కలు చెయ్యడం మొదలుపెట్టాయి. పదవీవ్యామోహంతో అపవిత్రమైన పొత్తులు పెట్టుకోవడమే కాక ఆ మహానేత వారసుడైన జగన్‌ను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జగన్ అనే శక్తిని నిలువరించడానికి ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా కుయుక్తులు పన్ని, ఆయనను వేధిస్తున్నాయి. 

అయితే ఆ దుష్టశక్తుల పన్నాగాలన్నీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయి. జగన్‌కు ఉన్న ప్రజాదరణ ముందు ఆ శక్తుల ముఖాలు వెలవెలబోతున్నాయి. మనం ఎప్పుడైనా పూర్తి రోజు శ్రమచేస్తే శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. అలాంటిది మన జగనన్న తపస్విలా ఓపికతో, సహనంతో, చిరునవ్వుతో, ఆప్యాయతతో, చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో, ధైర్యసాహసాలతో ప్రజానాయకుడిగా ఎదిగారు. వైయస్సార్‌గారి సువర్ణపాలనను మనం ప్రత్యక్షానుభవం పొందాం కాబట్టి మళ్లీ అలాంటి పాలన రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. లేకుంటే ఇప్పుడు మనం జీవిస్తున్న అంధకారంలోనే మన ఆశలు ఆవిరైపోతాయి. 
- చెదుళ్ళ వెంకటరమణారెడ్డి, గోపానిపల్లె, ప్రకాశం జిల్లా

కాంగ్రెస్‌ది కుటిల రాజకీయం చంద్రబాబుది అధికార దాహం
వై.ఎస్.విజయమ్మకి... అమ్మా! నేను 72యేళ్ల వృద్ధుడిని. రైల్వేలో పని చేసి రిటైర్ అయ్యాను. వైఎస్సార్‌గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటినుండీ నేను ఆయన అభిమానిని. ఆయన ఎప్పుడు సీఎం అవుతాడా అని ఎదురుచూస్తుండేవాణ్ని. చివరికి ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్సార్‌గారు సీఎం కావడంతో ఆంధ్ర రాష్ట్రానికి సువర్ణ పరిపాలన వచ్చింది. కానీ ప్రజలు ఆయన పాలనా ఫలాలను పూర్తిగా అందుకోకముందే ఆ భగవంతుడు ఆయనను తనలో చేర్చుకుని, కోట్లాది ఆంధ్రులను అనాథల్ని చేశాడు. ఆ తర్వాతి పరిణామాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజూ ప్రత్యక్షంగా చూస్తున్నవే. వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించడం, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందడం, జగన్మోహనరెడ్డిగారికి వస్తున్న ప్రజాభిమానం... ఇవన్నీ చూసి మిగతాపార్టీల కళ్లు కుట్టినట్టున్నాయి.

ప్రత్యేకించి చంద్రబాబునాయుడు అధికార దాహంతో చేసే ప్రచారం రాష్ట్రానికి పెద్ద తలపోటుగా మారింది. ప్రజలు ఛీ కొడుతూ ఎన్ని ఓటములతో బుద్ధి చెప్పినా ఆయన కళ్లు తెరుచుకోలేదు. మరోవైపు కాంగ్రెస్, చంద్రబాబుల నీచ రాజకీయాల కారణంగా జగన్‌బాబు కష్టాలనుభవిస్తున్నారు. కానీ విజయమ్మ తల్లీ... పేద, బడుగు వర్గాలకు సహాయం చేసినవారికి తప్పక మంచిరోజులు వస్తాయి. మీ కుటుంబం మళ్లీ సంతోషంతో మునిగే రోజులు దగ్గరున్నాయి. మీరు, భారతి, షర్మిల, పిల్లలు అధైర్యపడవద్దు. కోట్లాది గుండెలు, మనసులు మీ కొరకు పరితపిస్తున్నాయి. చీకటి తరువాత వెలుగు వచ్చినట్లు, కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి. మీ బిడ్డ జగన్ త్వరలోనే విడుదలై వస్తారు. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారు. 
- తేరు శేషయ్య, గురవారెడ్డిపాలెం, ప్రకాశం జిల్లా
Share this article :

0 comments: