ఆరోపణలు నిరూపించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆరోపణలు నిరూపించండి

ఆరోపణలు నిరూపించండి

Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013

‘రక్షణ స్టీల్స్’తో మాకెలాంటి సంబంధం లేదు
ఉందని నిరూపిస్తే అదే రోజు పాదయాత్ర ఆపి ఇంటికి వెళ్లిపోతా
నిరూపించలేకపోతే చంద్రబాబునాయుడు ఆయన పదవులకు రాజీనామా చేసి ఇంటికెళ్లిపోతారా?
మరో ప్రజాప్రస్థానంలో షర్మిల సవాల్

‘రక్షణ స్టీల్స్’తో మాకెలాంటి సంబంధం లేదు మరో ప్రజాప్రస్థానంలో షర్మిల స్పష్టీకరణ ఉందని నిరూపిస్తే అదే రోజు పాదయాత్ర ఆపి ఇంటికి వెళ్లిపోతా నిరూపించలేకపోతే చంద్రబాబు ఆయన పదవులకు రాజీనామా చేసి ఇంటికెళ్లిపోతారా? బయ్యారం ఖనిజాన్ని తవ్వుకొనే హక్కును వైఎస్సార్ రక్షణ స్టీల్స్‌కు ఇవ్వలేదు.. ఆ ఖనిజాన్ని ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీనే తవ్వాలని ఆకాంక్షించారు తెలంగాణ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని సంకల్పించారు

‘‘ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఇనుప ఖనిజం గనులతో, రక్షణ స్టీల్స్‌తో నాకుగాని, నా భర్తకు గాని సంబంధం లేదు. ఇదే మాట ఇప్పటికి అనేకమార్లు స్పష్టంగా చెప్పాం. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నేతలు పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారు. బయ్యారం గనులు, రక్షణ స్టీల్స్ ఒప్పందం రద్దు చేసి రెండేళ్లకు పైనే అవుతుంది. రద్దు చేసింది కూడా అప్పుడు, ఇప్పుడూ మా పక్షాన, మా పార్టీలోనే ఉన్న బాలినేని శ్రీనివాసరావు అనే మంత్రి. దాన్ని రద్దు చేసి ఇన్ని రోజులైనా.., అది నాదని, వైఎస్సార్ నాకు కట్నం కింద ఇచ్చారని, రక్షణ స్టీల్స్ నాదని, నా బినామీలే ఉన్నారని ఈ నాయకులు ఈ రోజుకూ ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ల మనసులో ఎంత దురుద్దేశం ఉందో అర్థమవుతోంది. 

ఈ ఆరోపణలు ఒకటి, రెండుసార్లు కాదు ఇప్పటికి 100 సార్లు చేసుంటారు. ప్రతిసారీ వీళ్లకు సమాధానం ఇస్తూనే ఉన్నాం. అయినా..‘దున్నపోతు మీద వాన పడ్డట్టు’ ఉంది కానీ వాళ్ల మట్టి బుర్రలకు ఎక్కడంలేదు. ఈ పార్టీ నాయకులందరికీ.. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడుకు సవాల్ చేస్తున్నాం. చంద్రబాబుగారూ..! ఇంకొకసారి బయ్యారం గనులను వైఎస్సార్ అల్లునికి, కూతురుకు కట్టబెట్టారని అనే ముందు ఒకసారి ఆలోచన చేసుకొని నా సవాల్‌ను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వైఎస్సార్ బిడ్డగా నేను సవాల్ చేస్తున్నాను.. బయ్యారం గనుల్లో, రక్షణ స్టీల్స్‌లో నాకు భాగం ఉంది అని చంద్రబాబుగారు నిరూపించగలిగితే.., అదే రోజున నేను పెట్టేబేడా సర్దుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి, పాదయాత్ర ముగించి ఇంటికి వెళ్లిపోతాను.

కానీ.. చంద్రబాబుగారూ..! మీరు నిరూపించలేకపోతే మీ పార్టీకి, మీ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా? చంద్రబాబుగారు సమాధానం చెప్పాలి. నా మీద ఆరోపణలు చేస్తున్న ఎవరైనా సరే నా సవాల్‌ను స్వీకరిస్తారా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సవాల్ చేశారు.
Share this article :

0 comments: