రాత్రిళ్లు ఎవరుంటారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రాత్రిళ్లు ఎవరుంటారు?

రాత్రిళ్లు ఎవరుంటారు?

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధరాత్రి సమయంలో చేస్తున్న ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర అంతంకాని విషాదయాత్రగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు పాదయాత్ర ప్రజల కన్నీళ్లు తుడవడానికి చేస్తున్నట్లుగా లేదని, సాయంకాలంవేళ విహారయాత్ర చేస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు సుమారు 200 రోజులపాటు అర్ధరాత్రి వేళల్లో చేసిన పాదయాత్ర ప్రజలకు ఏరకమైన భరోసా కల్పించలేదన్నారు. భూమన శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004కు ముందు చేపట్టిన పాదయాత్రకు, చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న పాదయాత్రకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తే డా ఉందన్నారు. వైఎస్ భగభగమండే ఎండల్లో రోజుకు 23 కిలోమీటర్లమేర పాదయాత్ర చేస్తూ.. ప్రజల కన్నీళ్లను తుడిచారని గుర్తుచేశారు. పాదయాత్రలో రాత్రివేళ రోడ్డుపక్కనే వేసిన గుడారాల్లోనే కూలర్లు లేకుండా విశ్రమించేవారని, అందుకు ప్రత్యక్షసాక్షి తానేనని భూమన తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న 6 కిలోమీటర్ల పాదయాత్ర సాయంత్రం 5 గంటల తర్వాత ప్రారంభమై, అర్ధరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగుతోందన్నారు. అదికూడా మట్టిరోడ్డుపై లక్షల లీటర్ల మంచినీటిని చల్లుతూ పూర్వం రాజులు విహారయాత్ర వెళ్లినట్లు చంద్రబాబు వెళుతున్నారని ఎద్దేవా చేశారు.

రాత్రిళ్లు ఎవరుంటారు?

‘‘చంద్రబాబు తన పాదయాత్రలో ఏ ఒక్క పేదవారి కన్నీరైనా తుడిచారా? ఒక్క ఎకరానైనా ఎండిన పంటపొలాన్ని పరిశీలించారా?’’ అని భూమన సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న అర్ధరాత్రి పాదయాత్రలో ఎవర్ని కలుస్తున్నారని నిలదీశారు. ‘‘బాబు సీఎంగా ఉండగా.. తాను నిద్రపోను, ఇతరులను నిద్రపోనివ్వను అని పదేపదే అంటుండేవారు. దీంతో అప్పట్లో అందరూ బాబు చాలాగొప్పగా పనిచేసేవారని భావించేవారు. అయితే బాబు నిద్రలేనితనంతో బాధపడుతున్నారని, అందుకే అర్ధరాత్రివేళ పాదయాత్ర చేస్తూ.. తన పైత్యాన్ని పార్టీ కార్యకర్తలపై రుద్దుతున్నారని అసలు విషయం ఇప్పుడు బయటపడుతోంది’’ అని భూమన ఎద్దేవా చేశారు.

అలవికాని వాగ్దానాలు: ‘‘గ తంలో వైఎస్ పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల కడగండ్లను చూసి చలించి వాగ్దానాలు చేయగా.. అప్పుడు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఎగతాళి చేశారు. వైఎస్ హామీలను నెరవేర్చడానికి తన వద్ద మంత్రదండమేదీ లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబే అర్ధరాత్రివేళల్లో అలవికాని వాగ్దానాలు చేస్తున్నారు’’ అని భూమన విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని దించేసే అస్త్రాన్ని చంద్రబాబు తన చేతిలో పెట్టుకుని అడుగడుగునా కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. బాబు పాదయాత్ర టీడీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికి చేసినట్టుగా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకే చేసినట్లుందని ఆయన ఆరోపించారు. బాబు పాదయాత్రకు విశ్వసనీయత లేనందునే ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారన్నారు. కాగా మరోప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల రాత్రివేళ గుడారాల్లోనే నిద్రిస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా భూమన చెప్పారు.
Share this article :

0 comments: